ఫ్లాష్ బ్యాక్ @ 50

అమ్మకోసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తొలుత అక్కినేని నాగేశ్వరరావుతో కలిసి అశ్వనీ పిక్చర్స్ పతాకంపై సంగీత దర్శకులు ఆదినారాయణరావు ‘మాయలమారి/ మాయక్కారి’ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో రూపొందించారు. తరువాత 1951లో తన భార్య, ప్రముఖ నటి అంజలీదేవి పేరుమీద అంజలీ పిక్చర్స్ నెలకొల్పి పలు చిత్రాలను రూపొందించారు. తరువాత పెద్ద కుమారుడు చిన్నారావు పేరిట చిన్ని బ్రదర్స్ స్థాపించి కొన్ని చిత్రాలు నిర్మించారు. సతీ సక్కుబాయి (65), సతీసుమతి (67), కుంకుమ భరణి (68) తరువాత వీరు నిర్మించిన చిత్రం -అమ్మకోసం. 1970 మే 26న విడుదలైన ఈ సినిమా 50ఏళ్లు పూర్తి చేసుకుంటుంది.
బర్ల వెంకట వరప్రసాద్ (బివి ప్రసాద్) నవంబర్ 9న రాజమండ్రిలో జన్మించారు. విద్యాభ్యాసం పూర్తిచేసి దర్శకత్వం మీద అభిలాషతో మద్రాస్ వెళ్లారు. తొలిసారి 1965లో ‘సింహాచల క్షేత్ర మహిమ’ చిత్రానికి దర్శకత్వం వహించారు. 1970లో అమ్మకోసం చిత్రానికి సారధ్యం వహించారు. ఆ తరువాత మట్టిలోమాణిక్యం (1971) చిత్రానికి నేషనల్ ఫిల్మ్ అవార్డ్ అందుకున్నారు. తరువాత ‘తోటరాముడు’, ‘లక్ష్మి’, ‘ఊరికి సోగ్గాడు’, ‘చుట్టాలున్నారు జాగ్రత్త’ వంటి పలు చిత్రాలకు దర్శకత్వం నిర్వహించటమేకాక కొన్ని చిత్రాలను నిర్మించి, నిర్మాతగా మారారు.
*
మాటలు: ఆచార్య ఆత్రేయ
కళ: ఎకె శేఖర్
కూర్పు: ఎన్‌ఎస్ ప్రకాశం
నృత్యం: చిన్ని, సంపత్, వెంపటి సత్యం
స్టంట్స్: సాంబశివరావు పార్టీ, రాఘవులు అండ్ పార్టీ
సినిమాటోగ్రఫీ: విఎస్‌ఆర్ స్వామి
సంగీతం: ఆదినారాయణరావు
నిర్మాత: చిన్నారావు
కథ, దర్శకత్వం: బివి ప్రసాద్
*
ధనవంతుడు ధర్మారావు (నాగయ్య) కుమారుడు రఘుబాబు (గుమ్మడి). కోడలు (అంజలీదేవి) భారతి. రఘు, భారతిలకు వివాహానికి ముందే కలిగిన బాబు (బేబీ రాణి)ని భారతి తండ్రి సోమయ్య (రమణారెడ్డి)వద్ద ఉంచుతాడు. రఘుబాబు ఓ పెద్ద భవంతి నిర్మిస్తాడు. ఆ సమయంలో తన బాబుకోసం భారతి ఆరాటపడుతుంది. ఈలోపు సోమయ్య తాగుడు మైకంలో బాబును రూ. 3లకు అమ్మేశాడనే విషయం భార్యకు తెలియచేస్తాడు. ఈ వార్త విని భారతి కృంగిపోతుంది. తరువాత వారికి మరొక బాబు చిన్ని (బేబీ బ్రహ్మాజీ) పుడతాడు. ఈలోపు వారి పెద్ద కొడుకు అనుకోని పరిస్థితుల్లో అనాధగా వారింట ఆశ్రయం పొందుతాడు. కంట్రాక్టర్ భుజంగరావు (నాగభూషణం), కళావతి (గీతాంజలి) అనే నర్తకిని హత్యచేసి, ఆ హత్యానేరం రఘుబాబు, వారి కుమారుడు గంగూలపై నెట్టడంతో వారిరువురూ జైలుకెళ్తారు. ఈ కుట్రవలన మామగారిని, ఆస్తిని పొగొట్టుకున్న భారతి చిన్నకొడుకు ఆనంద్‌తో తండ్రి వూరువెళ్లి కష్టనష్టాలకోర్చి అతన్ని చదివించి పోలీస్ ఆఫీసర్‌ని చేస్తుంది. బోస్టన్ స్కూల్‌లో చదివి శిక్ష పూర్తి చేసుకుని వచ్చిన గంగూ (కృష్ణ) భుజంగరావును అంతంచేసి తండ్రిని విడిపించాలని ఓ గుంపుతో సావాసం చేస్తాడు. అక్కడ ముఠా నాయకుని కుమార్తె గౌరి (విజయనిర్మల) ప్రేమ పొందుతాడు. ఆనంద్ (కృష్ణంరాజు), భుజంగరావు గుట్టు ఛేదించాలని ప్రయత్నించటం, భుజంగరావు కూతురు (రేఖ) అతన్ని ప్రేమించటం జరుగుతుంది. గంగూను పట్టాలని ఆనంద్ ప్రయత్నించటం, అతన్ని అంతంచేయాలని గంగూ ప్రయత్నంచేయగా, గంగూ తన పెద్దకొడుకని గ్రహించిన భారతి, వారిద్దరిమధ్య సన్నిహిత్యానికి ఆశపడుతుంది. గంగూ గురించి నిజం తెలిసిన ఆనంద్, అన్నను అరెస్ట్ చేయడం, భుజంగరావుకు శిక్షపడటం జరుగుతుంది. గంగూ, రఘుబాబు జైలునుండి విడుదలై భారతిని గౌరిని, గీతలను కలుసుకోవటం చిత్రం శుభంగా ముగుస్తుంది.
ఈ చిత్రంలో గౌరి తండ్రిగా ధూళిపాళ, ఇంకా రాజ్‌బాబు, వడ్లమాని విశ్వనాథం, అల్లు రామలింగయ్య, జూ.్భనుమతి, నల్లరామ్మూర్తి, సీతారాం ఇతర పాత్రలు పోషించారు.
‘అమ్మకోసం’ చిత్రంలో సన్నివేశాలకు తగ్గ అర్ధవంతమైన మాటలతో ఆచార్య ఆత్రేయ అలరించేలా రూపొందించారు. భారతి నూతన భవనంలో తమ తొలి బిడ్డకోసం వేదన, తమ కుమారుడని తెలీకపోయినా గంగూపై అభిమానం, వాత్సల్యం, ఆస్తి మొత్తం భుజంగరావు స్వాధీనం చేసుకున్నా అతన్ని నిందించక గుండె ధైర్యంతో బయటకు రావటం, గంగూ తన యజమాని రఘుబాబును విడిపించాలని యత్నించటం, అది విఫలమై రఘుబాబు భార్యను కలవటం, తండ్రిని ఆనంద్ తిరిగి అరెస్ట్‌చేయటం, గంగూయే తన కుమారుడని భారతి తెలిసికొని కుమిలిపోవటం, తన బిడ్డలిద్దరూ క్షేమంగా ఉండాలని.. ఆనంద్ అరెస్ట్ చేయబోయే విషయం ముందే గంగూకు చెప్పటం, గంగూకి నిజం తెలిసాక తమ్ముడితో తలపడడానికి ఇష్టపడక పోవటం, అతన్ని తమాషాగా కవ్వించటం, పోలీసుల దాడిని గంగూ ఎదుర్కోవటం వంటి సన్నివేశాలు అలరిస్తాయి. గీత ద్వారా ఆనంద్, ఆమె తండ్రి రహస్యాలు గ్రహించి అతన్ని అరెస్ట్ చేయటం వంటి సెంటిమెంటు సీన్స్.. ఇలా ఆకట్టుకునే సన్నివేశాలతో దర్శకులు మంచి ప్రయత్నం చేయటం విశేషం.
నటుడు కృష్ణ తల్లిదండ్రుల ఆప్యాయత కోసం వేదనపడే పాత్రలో అద్భుతంగా నటించారు. తిరుగుబాటు ముఠా అండకంటే తన శక్తిమీద నమ్మకంగల యువకునిగా, గౌరి ప్రేమతో స్పందించిన వ్యక్తిగా ఆకట్టుకున్నాడు. ఆమెతో ఆడిపాడిన యుగళ గీతం -పాపికొండలకాడ పాలమబ్బుల నీడ (గానం: పి సుశీల, ఎస్‌పి బాలు, రచన: సినారే). ఈ చిత్రంలో మొత్తం ఆరు పాటలున్నాయి. కృష్ణంరాజు, రేఖలపై చిత్రీకరించిన గీతం -అదే అదే.. పదే పదే ప్రియా (గానం: పిబి శ్రీనివాస్, ఎస్ జానకి: రచన: సినారె). విజయనిర్మలపై చిత్రీకరించిన గీతం -ఈ లోయలోన ఈ పాయలోనా (గానం: పి సుశీల, రచన: సినారె). గీతాంజలిపై చిత్రీకరించిన నృత్య గీతం -రేపు వత్తువుగాని (గానం: పి సుశీల). గూడెం జనంమధ్య గీతం -అందాలవలపు జంట కలలపంట (గానం: ఎల్‌ఆర్ ఈశ్వరి, ఎస్‌పి బాలు బృందం, రచన: ఆరుద్ర). అమ్మకోసం చిత్రం పేరు గుర్తుకుతెచ్చే హిట్ సాంగ్, సినారె రచన బాలూ గానంతో నేటికీ వినిపించే పాట -గువ్వలా ఎగిరిపోవాలి ఆ తల్లి గూటికే. కృష్ణపై వివిధరకాల ప్రదేశాల్లో ఆరు బయట స్వేచ్ఛగా చిత్రీకరించారు. ప్రముఖ హిందీ నటి రేఖ హీరోయిన్‌గా నటించిన తొలిచిత్రం ‘అమ్మకోసం’. అంతకుముందు బాలనటిగా ఆమె రంగులరాట్నం చిత్రంలో నటించింది. అమ్మకోసం బ్లాక్ అండ్ వైట్ చిత్రంగా 2 పాటలను కృష్ణ, విజయనిర్మలపై మరొక గీతం కృష్ణంరాజు, రేఖలపై రంగుల్లో చిత్రీకరించారు.
పాటలతోసహా కొన్ని సన్నివేశాలు గోదావరి ఒడ్డున తీయాలని ఇరిగేషన్ డిపార్ట్‌మెంటు అనుమతి పొంది యూనిట్ మొత్తం రాజమండ్రి వెళ్ళారు. అందరూ పాపికొండల సమీపంలో వసతి ఏర్పాటు చేసుకున్నారు. విజయనిర్మలకు, కృష్ణకు గోదావరిలో తేలే ఒక హౌస్‌బోటులో బస ఏర్పాటు చేసారు. రెండు పాటల చిత్రీకరణ సవ్యంగా సాగింది. కాని, అనుకోకుండా తుఫాన్ రావటంవల్ల కృష్ణ, విజయనిర్మల ఉన్న బోటుకు ప్రమాదం కలిగి బోటుకు రంధ్రంపడి నీళ్లు లోపలికి రావటం, బోటు కుదుపులకు గురికావటం జరిగింది. ఆ సమయంలో స్టంట్ మాస్టర్ రాఘవులు సమయస్ఫూర్తితో స్పందించి 4 గుర్రాలకు తాళ్ళుకట్టి గోదావరిలో ఈదుకుంటూ వెళ్ళి బోటుకు తాళ్ళు బిగించారు. అలా గుర్రాలతో బోటును ఒడ్డుకు చేర్చారు. వేరే షూటింగ్ నిమిత్తం కృష్ణ, విజయనిర్మల మద్రాస్ వెళ్లగా మిగిలిన యూనిట్ సభ్యులు 15 రోజులపాటు రాజమండ్రిలో ఉండిపోవడం జరిగింది. పాడైన రైలు పట్టాలు బాగుచేయటానికి అన్ని రోజులు పట్టడంతో వారంతా హోటల్ రూమ్‌లలో గడపాల్సి వచ్చింది.
అలా ప్రమాదాల నడుమ పూరె్తైన చిత్రంగా ‘అమ్మకోసం’ నిలిచింది. ఈ చిత్రంలో ‘గువ్వలా ఎగిరిపోవాలి’ పాట చాలా పాపులరై ఈ చిత్రాన్ని గుర్తు చేస్తూ నిలిచింది.

-సీవీఆర్ మాణిక్యేశ్వరి