S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీ వ్యూస్

12/14/2019 - 22:54

సైరా.. ప్లాప్! సాహో ఢాం!! పాన్ ఇండియా సినిమా అంటూ తీసి అప్రతిష్టపాలైనారంటూ.. జరా శంకర్ కూడా జాగ్రత్త అని ఓ పాఠకుడు అభిప్రాయంగా రాశారు. ఆయన తీస్తున్న భారతీయుడు-2ను దృష్టిలో పెట్టుకొనే ఈ చురక వేసి ఉండొచ్చు. శంకర్‌ని ఇలా డి గ్రేడు చేయడం భావ్యమేనా? ఇది ప్రాంతీయ ద్వేషంలా తోస్తుంది. అసలు దక్షిణాది వారంటేనే ఉత్తరాదికి వారికి ద్వేషం. నేడు తెలుగువారికి సోదర తమిళ తంబిలపై ద్వేషమెందుకో?

12/10/2019 - 22:53

‘ఫేక్’ దందా మూలాలను చర్చించిన చిత్రం -అర్జున్ సురవరం తీసి పారేయతగ్గ సినిమా కాదు. సమీక్షకులు మరీ తగ్గించి రేటింగులు ఇచ్చినా, సినిమా చూసిన తరువాత.. ఇప్పుడొస్తున్న చాలా సినిమాలకంటే బెటర్ అనిపించింది. సమీక్షకులు భిన్నకోణాల్లో సినిమాను సమీక్షించినా -ఆడియన్స్ మాత్రం సినిమాలో ఎంటర్‌టైన్‌మెంట్ ఉందా? బోర్ కొట్టకుండా కూర్చోగలిగామా? అన్నది మాత్రమే చూస్తారు.

11/30/2019 - 22:37

రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రగా వచ్చిన తోలుబొమ్మలాటలో తలతిక్క కథనం విసిగించింది. గతంలో ఆయన చేసిన ‘ఆ నలుగురు’, ‘మీ శ్రేయోభిలాషి’ చిత్రాల్లో ప్రధానమైన భూమిక కనిపిస్తుంది. ఓ సమస్యను చర్చించే కథలుగా ఆ సినిమాలు రాజేంద్రుడి భావోద్వేగ నటనకు అద్దంపట్టాయి. ఇప్పుడు ఆయన ఎంచుకుంటున్న కథల్లో ఆహార్యం బాగున్నా -కథనం బాగోక పాత్రలన్నీ పేలవంగా మిగులుతున్నాయి.

11/23/2019 - 22:38

ఏ రామకృష్ణా..?
తెనాలి రామకృష్ణ సమీక్ష భలేవుంది. ఆసక్తికరమైన టైటిల్ పెట్టి ఆడియన్స్‌ని థియేటర్ వరకూ రప్పించగలరుకానీ, తొలి ఆటతోనే టాక్ విస్తృతమై సినిమా చీదేస్తుందన్న విషయాన్ని చిత్రబృందం గ్రహించలేకపోయంది. అసలు టైటిల్‌కీ, సినిమాకు ఏమైనా సంబంధం ఉందా? అన్న అనుమానాలు మొదటి సీన్‌నుంచే ఆడియన్స్‌ని వెంటాడాయ. ఏదో అనుకుని ఏదేదో తీసేస్తే ఆడియన్స్ చూసేసే రోజులు పోయాయని దర్శకులు గ్రహించాలి.

11/09/2019 - 20:02

గీతాంజలిని తొలిసారిగా సీతమ్మ పాత్రలోనే చూశాం. ఆ తరువాత కథానాయికగా, వాంప్‌గా, రెండో కథానాయికగా, ముఖ్యంగా అక్కినేని చెల్లెలిగా ఆమె నటించిన ప్రతి పాత్ర వైవిధ్యమే. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఆమె సినిమాలన్నీ అద్భుతం. ముఖ్యంగా ఏ పాత్రలో నృత్యం అయినా సరే అద్భుతంగా చేసి మెప్పించగల నటి గీతాంజలి. ఆమె తెలుగు ప్రేక్షకులను వదిలి దూర తీరాలకు వెళ్లడం, పాత సినిమా ప్రేక్షకులకు బాధాకరం.

11/02/2019 - 20:40

తమన్నా మీద నయనతార గుస్సా అట. ఎందుకంటే సైరాలో తన పాత్రకన్నా ఆమె పాత్రే ఎక్కువని. పైగా నయన్ కంటే తమన్నాకే ప్రశంసలు ఎక్కువగా అందాయంటూ ఓ పత్రిక కథనం. ఆ అభిప్రాయాన్ని బలపరుస్తూ తమన్నా కూడా ‘సీనియర్ నటి నయన్ ఉన్నా తనకే ప్రేక్షకామోదం లభించింది’ అంటూ డబ్బాకొట్టుకుంది. పైగా రామ్‌చరణ్ భార్య ఉపాసన తమన్నా నటనకు ఫిదా అయి గిఫ్ట్ ఇచ్చిందన్న వార్త ప్రచారం పొందింది.

10/26/2019 - 20:13

గోపీచంద్ ‘చాణక్య’ ఫరవాలేదు కానీ చాకచక్యం కరువైంది. థ్రిల్లర్ కథాంశం ఉండడంవల్లనే సినిమా కొంత విశ్రాంతి తర్వాతనుంచి బాగుందనిపించింది. సంగీతం ఆకట్టుకోలేదు. ఈమధ్య అన్ని సినిమాల్లో సాంగ్స్ ఉత్తేజపరిచేవిగా ఉండటంలేదు. మెలోడీ ట్యూన్స్‌ను ఉత్సాహపరిచేలా చేయటం లేదు. మెహరిన్ గ్లామర్‌గా బాగుంది. గోపీచంద్‌కు అప్పుడే ముసలి ముఖం ఛాయలు వచ్చేశాయ. అతను ఫిట్‌నెస్ మీద ముఖ వర్చస్సుమీద శ్రద్ధతీసుకోవాలి.

10/19/2019 - 20:33

మాతృదేవత అని ఓ సినిమా నాలుగు దశాబ్దాల ముందు వచ్చింది. అందులో హీరో బయటికి వెళ్తూ, నా మామూలు అని హీరోయిన్‌ని అడుగుతాడు. సీన్ ఛేంజవుతుంది. మరేదో చూపిస్తారు. వెంటనే పాత సీన్ వచ్చేస్తుంది. ముఖం నిండా సిగ్గుకప్పేయగా బుగ్గ తుడుచుకుని వెళ్తుంది కథానాయిక. ముద్దు ఆమె బుగ్గపై పెట్టడం చూపలేదు. కాని పెట్టినట్లు అర్ధమైంది. ఎక్స్‌ప్రెషన్ ద్వారా దాన్ని సజెస్టివ్ కిస్ అంటారు. ఆమె మహానటి.

10/12/2019 - 20:07

కమెడియన్ వేణుమాధవ్ ఆకస్మిక మరణం -చిత్ర పరిశ్రమకు తీరనిలోటు. ఆయనలాగే చాలామంది తెలుగు కమెడియన్లు సంపూర్ణ జీవితాన్ని అనుభవించకుండానే -లైఫ్ స్క్రీన్‌నుంచి మాయం కావడం నిజంగానే విషాదభరితం. వేణుమాధవ్ కథనంలో ఎంతోమంది కమెడియన్స్‌ని గుర్తు చేయడం -నిజంగానే నివాళిగా అనిపించింది.

10/05/2019 - 20:31

చిరంజీవి తీసిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమాటిక్‌గా హిట్ కావొచ్చు. కానీ చారిత్రక కథగా ప్రచారం చేసుకుని ఇష్టారీతిన తీసిన సినిమాను గొప్ప చిత్రంగా పరిగణించలేం అంటోంది పూర్వతరం. తెల్లదొరల పాలనలో రైతుల నుంచి పన్నులు వసూలు చేయడానికి పాలెగాళ్ల వ్యవస్థ ఉండేది. వసూలు చేసిన శిస్తుల్లో కొంత ఉంచుకుని, కొంత బ్రిటీష్ పాలకులకు అందించేవారు. ఆ వ్యవస్థ నిజానికి బ్రిటీష్‌కు అనుకూలంగానే ఉండేది.

Pages