S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

02/22/2020 - 22:36

అశ్వరాజ్ వారి దీపావళి చిత్రంలో సావిత్రి అభినయంతో అద్భుతంగా ప్రేక్షకులకు నచ్చే పాట -సరియా మాతో సమరాన గెలువ. ఎపి కోమల ఆలపించిన ఈ పాట ఆపాత మధుర గీతాలను ఆస్వాదించే వారికి తియ్యని వెనె్నలలా మనసును తాకుతుంది. వినేకొద్దీ ఇంపనిపిస్తుంది. సంగీతం ఘంటసాల అందించగా ఎస్ రజనీకాంత్ ఈ సినిమాకు దర్శకుడు.

02/15/2020 - 23:00

*శ్రీ శంభు ఫిలిమ్స్ బ్యానర్‌పై బి.ఎన్.రెడ్డి దర్శకత్వం వహించిన చిత్రం పూజాఫలం (1964). మునిపల్లె రాజు రచించిన పూజారి నవల ఆధారంగా నిర్మించారు. మంచిగంధం, మల్లెపువ్వులు, మనస్సులోగల ఒక నిష్కల్మష హృదయుని జీవితంలోకి ముగ్గురు యువతులు ప్రవేశించి, కల్లోలాన్ని సృష్టించారు. చివరికి ఆ ముగ్గురిలోనే తన జీవిత భాగస్వామిని గుర్తించడం ఈ చిత్ర కథ.

02/15/2020 - 22:59

మహాభారతంలోని విరాటపర్వ గాథ ఆధారంగా రాజ్యం పిక్చర్స్‌వారు నిర్మించిన చిత్రం ‘నర్తనశాల’ (1963). కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం కథాకథనం, సాంకేతిక విషయాలు ఉన్నత ప్రమాణాలను సంతరించుకుంది. కీచకుడిగా ఎస్వీ రంగారావు తన విశ్వరూపం చూపించారు. ఆయన డైలాగ్ డెలివరీ అద్భుతంగా ఉంటుంది.

02/15/2020 - 22:54

ఉషశ్రీ పిక్చర్స్ పతాకంపై శోభన్‌బాబు, శారద, రాజ్‌బాబు, సత్యనారాయణ, కృష్ణకుమారి, ముక్కామల ప్రధాన తారాగణంగా రూపొందిన మానవుడు-దానవుడు చిత్రం దాదాపు 40 ఏళ్ల క్రితం రూపొందిస్తే ఇప్పటికీ ఆ చిత్రంలోని పరిస్థితులు మన సమాజంలో కనబడుతుండడం విశేషం. మానవులందరూ దానవులుగా మారి నేడు జరుగుతున్న దిశ, నిర్భయ లాంటి సంఘటనలను గుర్తుచేస్తున్నారు. ఈ చిత్రంలో హీరో అక్క అటువంటి అకృత్యానికే బలైపోతుంది.

02/15/2020 - 22:53

ఎస్వీ రంగారావు, రాజ్‌బాబు తాతామనవడుగా నటించిన చిత్రంలో అంజలీదేవిపై చిత్రీకరించిన ‘ఈనాడే బాబూ నీ పుట్టినరోజు’ అనే పాట చాలా బావుంటుంది. సినారె కలంలోనుండి జాలువారి, పి.సుశీల గళంలోనుండి వినిపించే ఈ పాట ఎప్పుడు విన్నా కొత్తగానే ఉంటుంది. కొడుకు ఇంట్లోనే కోడలికి తెలియకుండా పనిమనిషిగా బ్రతుకుతూ తన సొంత మనవడైనా, గుండెకు హత్తుకోలేని బేలత్వం ఆమెది.

02/08/2020 - 23:30

యంగ్ సెనే్సషన్ విజయ్ దేవరకొండనుంచి వస్తున్న తాజా మూవీ -వరల్డ్ ఫేమస్ లవర్. రాశిఖన్నా, కేథరిన్ థ్రెస్సా, ఐశ్వర్య రాజేష్, ఇస్‌బెల్లా హీరోయిన్లు. క్రియేటివ్ కమర్షియల్స్‌పై దర్శకుడు క్రాంతిమాధవ్ తెరకెక్కించిన చిత్రం 14న థియేటర్లకు వస్తోంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా హీరోయిన్ రాశిఖన్నా శనివారం మీడియాతో మాట్లాడింది.

02/08/2020 - 23:01

ఓ క్లాసిక్‌ని రీమేక్ చేయాలంటే గట్సుండాలి. జాను ప్రాజెక్టుకు సంబంధించి ఆ గట్స్ దిల్‌రాజులో కనిపించాయి. ఆయన జడ్జిమెంట్‌పై చాలామందిలాగే నాకూ గట్టి నమ్మకం. రీమేక్ ప్రతిపాదన నావరకూ వచ్చినపుడు -ముందు నేనూ సందేహించాను. కచ్చితంగా వర్కౌటవుతుందని దిల్‌రాజు చెప్పినపుడు మాత్రం కాదనలేకపోయా.

02/08/2020 - 22:55

రాజేంద్రప్రసాద్, సీత జోడీగా వచ్చిన ‘ముత్యమంత ముద్దు’ చిత్రం చాలా ఇష్టం. కమర్షియల్‌గా గొప్ప సినిమా కాలేకున్నా -కథాసారాంశం బావుంటుంది. భావుకతతో యండమూరి వీరేంద్రనాథ్ థ్రిల్లర్ నవలను దర్శకుడు రవిరాజా పినిశెట్టి సినిమాగా తెరకెక్కించారు. కథాపరంగా చూస్తే -మగవాళ్ల ప్రేమను నమ్మకూడదన్న భావన విద్యాధరి (సీత)ది. అందుక్కారణం -బాల్యంలోనే తల్లిని తండ్రి హింసించటం చూసి అలా ద్వేషం పెంచుకుంటుంది.

02/08/2020 - 22:52

అడుగడుగో అల్లడుగో అభివన నారీ మన్మథుడు అభినవ నారీ మన్మథుడు -అంటూ సారంగధర చిత్రంలోని పాట నాకు చాలా ఇష్టం. చిత్రపటంలో సారగధరుని సౌందర్యాన్ని చూసి మోహిస్తుంది చిత్రాంగి. వలచి అతనితో పెళ్లికి ఆనందంతో అంగీకారం తెలిపి -వంచనకు గురై అతని తండ్రిని పెళ్లాడి, మోహాన్ని వీడలేక వేచిచూసే వేళలో పావురాల ఆటలో తన పావురం కోసం రాణి అంతఃపురానికి వచ్చే సందర్భంలో వచ్చే పాట ఇది. ఈ పాట ‘సారంగధర’ చిత్రంలోనిది.

02/01/2020 - 22:33

కెవి రెడ్డి దర్శకత్వం వహించిన ‘యోగివేమన’ (1947)లో హీరో పాత్రధారి నాగయ్య. ఈ చిత్రం ఆఖరి సన్నివేశంలో వేమన గెటప్‌లో నాగయ్య జీవసమాధి అయ్యేందుకు బిలంలోకి వెళ్లిపోతారు. ఆ సీన్ చిత్రీకరణలో దర్శకులు కెవి రెడ్డి ‘యాక్షన్’ అన్నారు. కెమెరా స్టార్ట్ అయింది. నాగయ్య జనంమధ్యలోంచి నిరామయంగా చూసుకుంటూ బిలంలోకి వెళ్లిపోయారు. అక్కడున్న వారందరూ నాగయ్య నట సమ్మోహనాస్త్రంలో పడిపోయారు.

Pages