Others

ముత్యమంత ముద్దు (నాకు నచ్చిన సినిమా)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజేంద్రప్రసాద్, సీత జోడీగా వచ్చిన ‘ముత్యమంత ముద్దు’ చిత్రం చాలా ఇష్టం. కమర్షియల్‌గా గొప్ప సినిమా కాలేకున్నా -కథాసారాంశం బావుంటుంది. భావుకతతో యండమూరి వీరేంద్రనాథ్ థ్రిల్లర్ నవలను దర్శకుడు రవిరాజా పినిశెట్టి సినిమాగా తెరకెక్కించారు. కథాపరంగా చూస్తే -మగవాళ్ల ప్రేమను నమ్మకూడదన్న భావన విద్యాధరి (సీత)ది. అందుక్కారణం -బాల్యంలోనే తల్లిని తండ్రి హింసించటం చూసి అలా ద్వేషం పెంచుకుంటుంది. తను అద్దెకుంటున్న ఇంటి ఓనరు (గొల్లపూడి మారుతీరావు), అతని కొడుకు (నారాయణరావు) ప్రవర్తన కూడా.. మగవాళ్ల ప్రేమపై నమ్మకం సన్నగిల్లడానికి కారణం. విద్యాధరి బాస్ సైతం తనకు పెళ్లైన విషయాన్ని దాచి ఆమెతో పెళ్లికి ప్రతిపాదిస్తాడు. ఈ విషయం తెలిసిన విద్యాధరి.. మగవాళ్లపై మరింత ద్వేషం పెంచుకుంటుంది. ఆమెను లొంగ దీసుకోవడానికి సధాకర్ పన్నిన కుట్రనుంచి అనుదీప్ (రాజేంద్రప్రసాద్) రక్షిస్తాడు. ఆ పరిచయంలో ఏడేళ్ల క్రితమే విద్యాధరిని ప్రేమించినట్టు, తన ప్రేమ ఎంతవరకూ నిజమో తెలుసుకోడానికి వింద్య పర్వతాలపై తపస్సు చేశానని, దాంతో తనకు కొన్ని శక్తులు వచ్చాయని చెబుతాడు. విద్యాధరి ఆ మాట నమ్మదు. అనేక సందర్భాల్లో తన ప్రేమ నిజమైందని అనుదీప్ రుజువు చేసినా నమ్మలేకపోతుంది. తన శ్రేయోభిలాషి, పోలీస్ ఆఫీసర్ రంగనాథ్ మాటలు విశ్వసించిన విద్యాధరి -అనుదీప్ శక్తులన్నీ మెస్మరిజం అని కొట్టిపడేస్తుంది. విద్యాధరి కోసం అనుదీప్ తన శక్తులను వదులుకున్నా విశ్వసించదు. ఈక్రమంలో సుధాకర్, అతని భాగస్వామి చేసే వ్యాపార మోసాలను బయట పెట్టేందుకు రంగనాథ్‌కు సహాయం చేయడానికి సుధాకర్ ఇంటికెళ్లిన విద్యాధరి అక్కడ ప్రమాదంలో పడుతుంది. సుధాకర్ హత్య, ఆ నేరం విద్యాధరిపై పడటం, ఆమె నేరం చేయలేదని అనుదీప్ తన శక్తియుక్తులను ఉపయోగించి కాపాడటం, ఆ క్రమంలో గాయాలపై ఆస్పత్రి పాలవ్వడం.. చివరకు అనుదీప్ ప్రేమ నిజమని నమ్మిన విద్యాధరి అతనికి ముత్యమంత ముద్దు ఇవ్వడంతో సినిమా శుభంగా ముగుస్తుంది. సింపుల్ స్టోరీని తీరైన పద్ధతిలో రవిరాజా తెరకెక్కించినప్పటికీ బాక్సాఫీస్ దగ్గర సినిమా నిలువలేదు. కానీ, రాజేంద్రప్రసాద్, సీతల నటన అద్భుతం. కథ ఆసక్తికరంగా ఉంటుంది. ప్రేమలేఖ రాశా నీకందిఉంటదీ../ ఇచ్చుకో.. ముద్దిచ్చి పుచ్చుకోలాంటి పాటలు అప్పట్లో సెనే్సషన్ సృష్టించాయి.
-వి శ్రీనివాస్, పాలకొల్లు