Others

జాను కోసం అలా అడుగేశా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓ క్లాసిక్‌ని రీమేక్ చేయాలంటే గట్సుండాలి. జాను ప్రాజెక్టుకు సంబంధించి ఆ గట్స్ దిల్‌రాజులో కనిపించాయి. ఆయన జడ్జిమెంట్‌పై చాలామందిలాగే నాకూ గట్టి నమ్మకం. రీమేక్ ప్రతిపాదన నావరకూ వచ్చినపుడు -ముందు నేనూ సందేహించాను. కచ్చితంగా వర్కౌటవుతుందని దిల్‌రాజు చెప్పినపుడు మాత్రం కాదనలేకపోయా.
శర్వానంద్, సమంత జోడీగా దర్శకుడు సి ప్రేమ్‌కుమార్ తెరకెక్కించిన ఎమోషనల్ ఎంటర్‌టైనర్ -జాను. దిల్‌రాజు తెరకెక్కించిన చిత్రం విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ సందర్భంగా హీరో శర్వానంద్ మీడియాతో ముచ్చటించాడు.
* నటుల ముందుకు కొన్ని చాలెంజింగ్ పాత్రలొస్తుంటాయి. అలాంటి వాటిలో రామ్ కూడా ఒకటనిపించింది. ముందు భయమేసింది. ఎందుకంటే -కొంచెం అటూ ఇటూ అయితే ట్రోల్స్ తప్పదు. ఒకపక్క జోడీగా మంచి పెర్ఫార్మర్ సామ్. మరోపక్క తమిళంలో ఈ పాత్ర చేసింది విజయ్ సేతుపతి. కంపారిజన్స్ తప్పదు. ఇన్ని ఆలోచించినపుడు భయమనిపించింది.
* నిర్మాత దిల్‌రాజు చెప్పినపుడు ‘96’ చూశా. అదొక క్లాసిక్. రీమేక్ ప్రతిపాదన తెచ్చినపుడే వణుకొచ్చింది. బట్, ఫిక్సైన తరువాత -మాతృకను చెడగొట్టకూడదని బలంగా నిర్ణయించుకున్నా. అందుకు తగిన ఎఫర్ట్ పెట్టేందుకు ప్రయత్నించా.
* సినిమా చూసినోళ్లంతా -త్రిష, సేతుపతి గుర్తుకు రాలేదని కామెంట్ చేశారు. పైగా -రీమేక్‌లా లేదు, స్ట్రెయిట్ మూవీ భావన కలిగిందన్నారు. అప్పుడు ఊపిరి తీసుకున్నా. చాలా హ్యాపీ ఫీలయ్యా. సినిమాకు ఇంతకంటే గొప్ప ఫీడ్‌బ్యాక్ ఏముంటుంది?
* హిట్టయిన చిత్రానికి రీమేక్ అంటేనే తెలీని వత్తిడి ఫేస్ చేయాలి. పైగా అది క్లాసిక్ అయితే ఆ ప్రెజర్ పీక్స్‌లో ఉంటుంది. ఎందుకంటే -ప్రతి విషయాన్నీ, అంశాన్నీ మాతృకతో కంపేర్ చేసి చూస్తారు.
* రీమేక్ ప్రాజెక్టుకు నిర్మాత దిల్‌రాజు కాకపోతే చేసుండేవాడిని కాదేమో. సెకెండాఫ్ మొత్తం రెండు పాత్రలపై నిలబెట్టడం ఆషామాషీ కాదు. అక్కడే దర్శకుడు ప్రేమ్‌కుమార్ టాలెంట్ కనిపించేది. ఓ క్లాసిక్ కోసం రెండున్నర గంటలు ఆడియన్స్‌ని కూర్చోబెట్టడమే గొప్ప ఎంటర్‌టైన్‌మెంట్ అని నా భావన.
* జాను -ని నా ఖాతాలో హిట్టుగా ఎప్పటికీ చూడలేను. కెరీర్‌లో ఇదొక ప్రత్యేకమైన సినిమానే. ఆ భావనతోనే చేశాను, చూస్తున్నాను కూడా. ప్రస్థానం, గమ్యం.. ఇప్పుడు జాను. ఇవి ఎప్పటికీ కెరీర్‌లో ప్రత్యేక మైలురాళ్లు.
* తెలీకుండానే -బాలీవుడ్ హీరో అక్షయ్ ఫార్ములా ఫాలో అవుతున్నానేమో అనిపిస్తోంది. మూడు విడుదలవ్వాలి. మూడు సెట్స్‌పై ఉండాలి (నవ్వుతూ).
* ప్రస్తుతం సెట్స్‌పై ఉన్న సినిమా శ్రీకారం. డాక్టర్ కొడుకు డాక్టర్, ఇంజనీర్ కొడుకు ఇంజనీర్ అవ్వాలనుకున్నపుడు రైతు కొడుకు రైతు ఎందుకు కాకూడదు? అనే పాయింట్‌కు ‘శ్రీకారం’ చుట్టాం. వేగంగానే పూర్తవుతుంది.