Others

అడుగడుగో అల్లడుగో..(నాకు నచ్చిన పాట)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అడుగడుగో అల్లడుగో అభివన నారీ మన్మథుడు అభినవ నారీ మన్మథుడు -అంటూ సారంగధర చిత్రంలోని పాట నాకు చాలా ఇష్టం. చిత్రపటంలో సారగధరుని సౌందర్యాన్ని చూసి మోహిస్తుంది చిత్రాంగి. వలచి అతనితో పెళ్లికి ఆనందంతో అంగీకారం తెలిపి -వంచనకు గురై అతని తండ్రిని పెళ్లాడి, మోహాన్ని వీడలేక వేచిచూసే వేళలో పావురాల ఆటలో తన పావురం కోసం రాణి అంతఃపురానికి వచ్చే సందర్భంలో వచ్చే పాట ఇది. ఈ పాట ‘సారంగధర’ చిత్రంలోనిది. చిత్రాంగి పాత్రలో భానుమతి పాటకుతగ్గ హావభావాలతో అద్భుతంగా అభినయించారు. ఈ పాట నాకు చాలా ఇష్టం.
తను వలచిన ప్రియుడు వచ్చేదాక మురిసి చెలులతో ఆడి పాడే పాటలో భానుమతి చక్కని అభినయం ఆకట్టుకుంటారు. ఈ పాటకు సముద్రాల రాఘవాచార్య చక్కని పదాలతో సాహిత్యాన్ని అందించారు. సంగీతం సమకూర్చిన ఘంటసాల భీంపలాస్ రాగంలో పాటకు బాణీ కడితే.. నటి, గాయని భానుమతి రసానుభూతితో పాటను ఆలపించటం.. ఓ గొప్ప అనుభూతి కలిగిస్తుంది. ఈ పాట ఆమె స్వర జీవితంలో ఓ మచ్చుతునకగా చెప్పుకోవచ్చు. సాహిత్యపరంగా సముద్రల చరణాలలో ప్రదర్శించిన గమ్మత్తు మదికి ఆనందం కలిగిస్తుంది. -మదిలో మెదిలే దేవుడు కనిపించెను కన్నులకే/ వ్రతము ఫలించె బ్రతుకు తరించే వరుడరుదెంచెనుగా.. అంటూ పాత్ర ఆనందాన్ని మొదటి చరణంలో ప్రకటించారు. ఇక రెండో చరణంలో ‘నీ రూపురేఖ.. నీ యవ్వన శోభ.. సఫలమాయె శుభవేళ సమకూరెనుగా..’ అంటూ -పాత్ర తన రూప లావణ్యాలపై కించిత్ గర్వాన్ని చూపినట్టు.. రచనలో సమర్థత చూపించారు. మూడో చరణంలో ‘నీ చెలికానిని దోచుకునేనని అలుగకుమా పావురమా/ నీ ఉపకృతికి బహుకృతిగా గైకోనుమా నా ప్రేమా’ అని పావురంతో చుతరతలాడి పరవశించే పదాల కూర్పు సముద్రాలకే చెల్లింది. సన్నివేశానికి తగిన పాట రచన వారి నేర్పు. ఘంటసాల స్వర రచనలో భానుమతి గాత్రంలో గమకాలు ఎంత హాయి కలిగిస్తాయి. ఇది భానుమతి పాట అనేలా ఉంటుంది. హిందుస్థానీ సంప్రదాయంలో గల సాకీల ప్రయోగం రెండు, మూడు చరణాలను మలచుకొని పాటకు కొత్త సొగసులు సమకూర్చారు.
-పి లక్ష్మీసుజాత, అద్దంకి