Others

బోల్డ్ కాదు.. ఛాలెంజింగ్ పాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యంగ్ సెనే్సషన్ విజయ్ దేవరకొండనుంచి వస్తున్న తాజా మూవీ -వరల్డ్ ఫేమస్ లవర్. రాశిఖన్నా, కేథరిన్ థ్రెస్సా, ఐశ్వర్య రాజేష్, ఇస్‌బెల్లా హీరోయిన్లు. క్రియేటివ్ కమర్షియల్స్‌పై దర్శకుడు క్రాంతిమాధవ్ తెరకెక్కించిన చిత్రం 14న థియేటర్లకు వస్తోంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా హీరోయిన్ రాశిఖన్నా శనివారం మీడియాతో మాట్లాడింది.
* వరల్డ్ ఫేమస్ లవర్ -అన్నది కథకు తగిన టైటిల్. ఎలా అన్నది ఇప్పుడే చెప్పలేం. దర్శకుడు ఈ టైటిల్‌ని పెట్టడానికి ఓ అర్థముంది. అదేంటో -కథను చూసి అర్థం చేసుకోవాల్సిందే.
* హీరో విజయ్ అన్ని కోణాల్లో పర్ఫెక్ట్ ఆర్టిస్ట్. అందుకు -్థయేటర్ బ్యాక్‌డ్రాప్ కారణమని అనుకుంటున్నా. విజయ్‌తో స్క్రీన్ షేరింగ్ చాలా హ్యాపీనిచ్చింది.
* క్రాంతిమాధవ్ కథే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దానికితోడు ఆయన సినిమాలో సంభాషణలూ అంతే స్ట్రాంగ్‌గా ఉంటాయి. పాత్రలతో ఆడియన్స్ బలంగా కనెక్టవుతారన్న నమ్మకముంది. అంత ఇంటెన్సిటీ, ఇన్వాల్వ్‌మెంట్ కథకుంది.
* టీజర్ రిలీజ్ కాగానే వచ్చిన కామెంట్లన్నీ -నా బ్యాక్ న్యూడిటీమీదే. ఇది బోల్డ్ అని అంటున్నారు. ఛాలెంజింగ్ అని నేననుకుంటా. ఇలాంటి రోల్స్ చేసినప్పుడే ఆర్టిస్ట్‌గా నన్న నేను ప్రూవ్ చేసుకోగలను. మూవీ చూసిన తరువాత -టీజర్ చూసినపుడు వచ్చిన కామెంట్లేవీ ఉండవని అనుకుంటున్నా.
* హీరో గడ్డంతో కనిపించినంత మాత్రాన -అర్జున్‌రెడ్డి, డియర్ కామ్రేడ్‌తో పోల్చేస్తే ఎలా? అలా పోల్చొద్దని కోరుతున్నా. ఇదొక వైవిధ్యమైన సినిమా. చూశాక, డిఫరెన్స్ మీకే తెలుస్తుంది.