S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

,
02/01/2020 - 22:31

దర్శకుడు ఎస్‌వి కృష్ణారెడ్డి ఉగాది చిత్రంలో హీరోగా పరిచయమయ్యారని, దానికిముందు ‘కిరాతకుడు’ చిత్రంలో గెస్ట్‌గా నటించారన్నది అందరికీ తెలిసిందే. అయితే అంతకుముందే హరినాథ్, కృష్ణారెడ్డిలు కలసి ‘పగడాల పడవ’ అనే చిత్రంలో హీరోలుగా నటించారు. అయితే ఆ చిత్రం మధ్యలోనే ఆగిపోయింది.
అలనాటి హాస్య నటుడు రాజ్‌బాబు డ్రింక్ చేసేటప్పుడు కొబ్బరి పచ్చడి నంజుకునేవారట.

02/01/2020 - 22:22

కాలం ఎలా మారినా మనిషిలో మానవత్వం మాత్రం మారదు. ఈ విషయానే్న సంగీత లయాత్మకంగా చెప్పే ప్రయత్నం చేస్తుంది పూర్ణోదయావారి శంకరాభరణం. ఈ సినిమా 40 ఏళ్ళ క్రితం ఫిబ్రవరి 2న విడుదలవడం మరో విశేషం. శాస్ర్తియ సంగీతానికి ఆదరణ తగ్గిపోతున్న సమయంలో ఈ సినిమా ప్రజల్లో చైతన్యమైంది. ఈ సినిమా తరువాత పుట్టిన పిల్లలందరూ సంగీత తరంగాలలో ఓలలాడేలా ముద్రవేసింది కె.విశ్వనాథ్ రూపొందించిన ఈ చిత్రం.

02/01/2020 - 22:21

1971లో విడుదలైన ‘రాజకోట రహస్యం’ చిత్రం కోసం సి నారాయణరెడ్డి కలం నుంచి జాలువారిన హొయలొలికే సొగసు పాట ఇది. ఓ యువ జంట విడదీయలేని అనుబంధాన్ని ఒకరికొకరు వ్యక్తం చేసుకుంటూ.. పరవశించి పాడుకునే వలపు పాట. అత్యంత హృద్యమైన ఈ గీతాన్ని విజయా కృష్ణమూర్తి సంగీత సారథ్యంలో అమర గాయకుడు ఘంటసాల, కోకిలమ్మ సుశీల ఆలపించారు.

,
01/25/2020 - 22:40

వచ్చిన నటీనటులందరినీ దర్శకుడు ఒకచోట సమావేశ పరిచి ఆయా పాత్రధారులను డైలాగులు చెప్పమని అడిగేవారు. అంటే నాటక ప్రదర్శనకు ముందు జరిగే ఫైనల్ రిహార్సల్స్‌లా జరిగేదన్నమాట. తర్వాత అందరిచేత వేషాలు వేయించేవారు. ఆర్టిస్ట్‌లకు టైమింగ్స్ ఉండేవి కావు. ప్రతిరోజూ ఉదయం అందరూ మేకప్ వేసుకుని తయారై ఉండేవారు.

01/25/2020 - 22:33

అక్కినేని, సావిత్రి జోడీగా వచ్చిన ఎన్నో అద్భుత చిత్రాల్లో -అర్ధాంగి ఒకటి. 1955లో విడుదలై విజయాన్ని సొంతం చేసుకున్న చిత్రం. అర్ధాంగి చిత్రం కోసం ఆత్రేయ కలం నుంచి -నవ్వేవాళ్ల అదృష్టమేమని ఏడ్చేవాళ్లని ఏడవనీ అంటూ ఓ పాట జాలువారింది. ఆత్రేయ చెప్పిన అక్షర సత్యానికి పి లీల తన గళంతో ప్రాణం పోసింది. బి నరసింహారావు, అశ్వత్థామలు -ఆ అద్భత బాణీకి స్వరకర్తలు. మన’సుకవి అనిపించుకున్న ఆత్రేయ..

01/25/2020 - 22:31

శ్రీకృష్ణార్జున యుద్ధం. 1963లో జయంతి పిక్చర్స్ పతాకంపై విడుదలైన సినిమా. దర్శక పితామహుడు కెవి రెడ్డి నిర్మాణ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ అద్భుత కావ్యమంటే నాకు చాలా ఇష్టం. గయుడు అనే గంధర్వుడు పుష్పకయానం చేస్తుండగా తాను ఉమ్మిన తాంబూలం సంధ్యావందనం చేస్తున్న శ్రీకృష్ణుని దోసిలిలో పడుతుంది. దానికి ఆగ్రహించిన శ్రీకృష్ణుడు -గయుడిని సంహరిస్తానని శపథం చేస్తాడు.

01/18/2020 - 23:05

శివ కందుకూరి, వర్ష, మాళవిక ప్రధాన తారాగణంగా శేష సింధూరావు దర్శకత్వంలో రాజ్ కందుకూరి రూపొందించిన చిత్రం చూసీ చూడంగానే. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఈనెల 31న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

01/18/2020 - 23:03

అశోక్‌రెడ్డి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘మిస్టర్ అండ్ మిస్’. జ్ఞానేశ్వరి కాండ్రేగుల, శైలేష్ సన్ని జంటగా నటించిన ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్ హైదరాబాద్‌లో విడుదల చేశారు.

01/18/2020 - 23:01

పాటలతోనే సినిమాను సక్సెస్‌వైపు నడిపించగల సత్తా -దేవీశ్రీ ప్రసాద్‌ది. గతంలో ఎన్నో సినిమాలకు -్ఫల్ ఆల్బమ్ హిట్టు రిక్డార్డునిచ్చి ప్రాజెక్టులను సక్సెస్‌వైపు నడిపించాడు. అలాంటి దేవిశ్రీ నుంచి ఇటీవలి కాలంలో చర్చించుకోతగినంత గొప్ప ఆల్బమ్స్ ఏమీ రాలేదు. ఎలాంటి మ్యాజిక్‌లేని రొటీన్ మ్యూజిక్ ఇస్తున్నాడన్న అపవాదు ఎదుర్కొంటున్నాడు దేవిశ్రీ.

01/18/2020 - 22:58

ఒకప్పుడు రజనీ సినిమా గురించి -విడుదలకు రెండునెలలు ముందు, రెండు నెలలు తరువాత మాట్లాడుకునే పరిస్థితి ఉండేది. కాని వరుస ఫ్లాపుల కారణంగా రజనీ ఇమేజ్ దెబ్బతినడంతో ఆయన్నుంచి వస్తోన్న చిత్రాలను మరుసటి రోజుకే మర్చిపోతున్న వైనం కనిపిస్తోంది. కాలా, పేటలాంటి చిత్రాలు విడుదలకు ముందు ఎంత బజ్ క్రియేట్ చేశాయో, తరువాత అంతే వేగంగా మాయమైపోయాయి. స్టార్ డైరెక్టర్లు సైతం రజనీకి ఒక్క హిట్టూ ఇవ్వలేకపోతున్నారు.

Pages