S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

09/28/2019 - 20:26

కామెడీతో క్రాక్ పుట్టించిన జబర్దస్త్ టీంనుంచి సిల్వర్ స్క్రీన్ ఆడియన్స్‌ని మురిపించేందుకు వస్తున్నారు సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, ఆటో రామ్‌ప్రసాద్. సినిమాలపై ఫోకస్ పెట్టిన ముగ్గురూ లీడ్ రోల్స్‌లో వస్తున్న చిత్రం -3 మంకీస్. దర్శకుడు అనిల్‌కుమార్ తెరకెక్కిస్తోన్న చిత్రానికి నాగేశ్ నిర్మాత. తాజాగా సీనియర్ హీరో వెంకటేశ్ చేతుల మీదుగా సినిమా టీజర్ రిలీజైంది.

09/28/2019 - 20:24

రోహిత్‌చంద్ర, డా.ఎ.పి.చారి, విజయలక్ష్మి ప్రధాన తారాగణంగా రూపొందిస్తున్న చిత్రం ‘అమ్మలగన్న అమ్మ మూలపుటమ్మ’. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియోను ప్రతాని రామకృష్ణగౌడ్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ విడుదల చేశారు. నిర్మాత ఎ.పి.చారి మాట్లాడుతూ -సంప్రదాయాలు గొప్పవని చాటిచెప్పే ప్రయత్నమే సినిమా అన్నారు. భారతదేశం ఒక దేవాలయమైతే ప్రాచీన దేవతలు శక్తివంతమైనవారని, ముగ్గురమ్మల మూలపుటమ్మ అంటే ఎవరూ ఆమె శక్తి ఏమిటి?

09/28/2019 - 20:23

మొత్తానికి సినిమాను మార్జిన్ దాటించేసిన ఆనందంలో ఉన్నారు హీరో వరుణ్‌తేజ్, దర్శకుడు హరీశ్ శంకర్. ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన తాజా ఊరమాస్ చిత్రం -గద్దలకొండ గణేశ్. వాల్మీకి టైటిల్‌తో సినిమా వచ్చివుంటే రిజల్ట్ ఎలా ఉండేదో తెలీదుకానీ, గద్దలగొండ గణేశ్‌లాంటి బరువైన మాస్ టైటిల్‌తో.. కలిసొచ్చిన సెలవుల్లో సినిమా బాగానే దూసుకుపోతోంది.

09/28/2019 - 20:22

అనుష్క -ఓకే అనాలేగానీ ఆమెతో సినిమాలు చేయడానికి తెలుగు, తమిళ భాషల్లో పెద్ద దర్శకులే ఉన్నారు. ప్రాజెక్టుకు ఆమె సై అంటే -ఆమె కోసం కథలు పుట్టించడానికీ రచయితలు రెండు భాషల్లోనూ ఉన్నారు. సెలెక్టెడ్‌గానే సినిమాలు చేస్తున్నా -సూపర్‌స్టార్ ఇమేజ్ మాత్రం అనుష్కవెంటే ఉంది. అనుష్క తాజా ప్రాజెక్టు -సైలెన్స్. బహుభాషా చిత్రమైన సైలెన్స్ -తెలుగులో నిశ్శబ్ధంగా వస్తోంది.

09/28/2019 - 20:21

ప్రపంచ దేశాల్లోనే అత్యధికంగా తుపాకులు కలిగివున్న దేశాల జాబితాలో మొదటిస్థానంలో ఉన్న దేశం అమెరికా. ఆ దేశంలో జరిగే తుపాకి కాల్పుaల్లో అధికంగా బలైపోతున్నవారు భారతీయులేనని ఇటీవలి గణాంకాలు చెబుతున్నాయి. ఈ అంశాన్ని ప్రధానంగా తీసుకుని కిక్ ఫేమ్ శ్యామ్ హీరోగా సారథి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన చిత్రం వాడొస్తాడు.

09/21/2019 - 20:38

నీతో ప్రతిక్షణం ఓహో/ ఎంతో మనోహరం ఓహో -అంటూ ప్రారంభమై నడిచే ప్రతి బాట/ నడపాలి మనవెంట బ్రహ్మోత్సవం’ అనే పల్లవితో సాగే బ్రహ్మోత్సవం చిత్రంలోని టైటిల్ సాంగ్ ఎంతో అర్ధవంతంగా హృదయాన్ని తాకుతుంది. పాటలోని ప్రతి పదం ఓ అద్భుతం. సిరివెనె్నల సీతారామశాస్ర్తీ కలం పదును, మిక్కీ జే మేయర్ బాణీ, మైనంపాటి శ్రీరామచంద్ర వాణి త్రివేణీ సంగమంలా సాగి శ్రోతల్ని ఓలలాడిస్తాయి.

09/21/2019 - 20:36

యన్టీఆర్, ఏయన్నార్ బావ బావమరదులుగా నటించిన మహాభారత నేపథ్య చిత్రం -శ్రీకృష్ణార్జున యుద్ధం. 1963 జనవరి 1న జయంతి పిక్చర్స్ బ్యానర్‌పై విడుదలైంది. కృష్ణుడిగా యన్టీఆర్, అర్జునుడిగా ఏఎన్నార్ నటనా వైదుష్యానికి పట్టంగట్టిన సినిమా. నిర్మాత, దర్శకుడు కెవి రెడ్డి అత్యంత శ్రద్ధతో నిర్మించిన చిత్రం.

09/21/2019 - 20:34

బాబూ చూడూ. ఈ సినిమాలో చెయ్యడం నీ అదృష్టం. కాదంటే ఓ కోతి పిల్లని హీరో చేసి.. బొమ్మతీసి వందరోజులాడిస్తా’ అన్నాడు రాఘవ. ఆయన తరహాలో లౌడ్ ఛాలెంజ్ విసురుతూ. ‘మీ సినిమా వంద రోజులు కాదు రెండొందలు ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ నమ్రంగా చెప్పి పంపించాడు శోభన్ బాబు.

09/14/2019 - 20:44

ఈనాడే బాబూ నీ పుట్టినరోజు
ఈ ఇంటికే కొత్త వెలుగు వచ్చినరోజు
ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మాత రాఘవ నిర్మించిన ‘తాత-మనవడు’ చిత్రంలోనిది ఈ పాట. మనవడి (రాజబాబు) బాల్యంలో పుట్టినరోజు సందర్భంగా నానమ్మ (అంజలీదేవి) మనవడిని ఆశీర్వదిస్తూ పాట పాడే సన్నివేశం.
తండ్రి మాటకై కానకు తరలిపోయె రాఘవుడు
అందుకే ఆ మానవుడు అయినాడు దేవుడూ

09/14/2019 - 20:44

ఊహాజనితమైన టైంమెషీన్ నేపథ్యంలో వర్తమానంనుండి భూత భవిష్యత్ కాలాలను స్పృశిస్తూ జనరంజకంగా మలచిన చిత్రరాజం ‘ఆదిత్య 369’. బ్యాక్ టు ఫ్యూచర్ అనే ఆంగ్ల చిత్రం మరియు హెచ్‌జి వెల్స్ నవల టైం మెషీన్ స్ఫూర్తితో రూపొందిన చిత్ర కథకు సైన్స్‌ఫిక్షన్, చరిత్ర, ప్రేమ, క్రైమ్ అంశాలను జోడించి ప్రేక్షకులకు ఆద్యంతం ఆసక్తికరంగా ఉండేలా చిత్రీకరించారు.

Pages