Others

అనుబంధాల పండగే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాయితేజ్, రాశీఖన్నా లీడ్‌రోల్స్‌లో దర్శకుడు మారుతి తెరకెక్కిస్తోన్న చిత్రం -ప్రతిరోజూ పండగే. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాస్ రూపొందిస్తున్న చిత్రం డిసెంబర్ 20న విడుదల కానుంది. చిత్రంలోని మైండ్ బ్లోయింగ్ డాన్స్ నెంబర్ సాంగ్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో వేసిన గ్రాండ్ సెట్లో చిత్రీకరణ జరుపుకుంది. ప్రొడక్షన్ డిజైనర్ రవీందర్ అద్భుతమైన థీమ్, కలర్ ప్యాట్రన్‌లో సెట్ వేశారు. థమన్ సంగీతం అందించిన ఎనెర్జిటిక్ పాటకు కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ నృత్యరీతి సమకూర్చారు. రాశిఖన్నా బర్త్‌డే సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అల్లు అరవింద్ మాట్లాడుతూ -్భలే భలే మగాడివోయ్ టీం చేస్తోన్న మరో సినిమా -ప్రతిరోజూ పండగే. కథని ఎంటర్‌టైన్‌మెంట్ యాంగిల్‌లో తీసుకెళ్తూనే, మంచి మెస్సేజ్ ఇచ్చే స్టయిల్ మారుతిది. ఇదొక ఎన్నారై స్టోరీ. ఇక్కడున్న వారితో కనెక్ట్‌కాకుండా ఎలా ఇబ్బంది పడుతున్నారనేది సినిమాలో చూపించారు. సాయితో 2020లోనూ మరో సినిమా ప్లాన్ చేస్తున్నాం అన్నారు. డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ -అరవింద్ ప్రొడక్షన్‌లో చేస్తున్నపుడు వొళ్లు దగ్గర పెట్టుకుని చేయాలన్న స్పృహ ఉంటుంది. నాకొచ్చిన చిన్న థాట్‌ను అరవింద్ ఇచ్చిన నమ్మకంతో ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లాను. గీతాఆర్ట్స్‌లో ఎన్నో మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లు వచ్చాయి. అలాంటి ఒక రెస్పాన్సిబుల్ ఫిలిం -ప్రతిరోజూ పండగే. టెక్నీషియన్లు మంచి సహకారం అందించారు. డిసెంబర్ 20న విడుదలవుతోన్న చిత్రం అన్ని ఏజ్ గ్రూపులకీ నచ్చుతుందన్న నమ్మకం ఉంది. నిజానికి ఇదొక ఎంటర్‌టైన్‌మెంట్ ఫుల్‌మీల్స్ అన్నారు. సంగీత దర్శకుడు థమన్ మాట్లాడుతూ -‘హార్ట్ టచింగ్ స్క్రిప్ట్ ఇది. మారుతి మరో బిగ్ హిట్ అందుకోబోతున్నాడు. మంచి కథకు మంచి ఆర్‌ఆర్ కుదిరింది. ఎంటర్‌టైనర్‌గానే కాదు, ఎమోషనల్‌గానూ అందరినీ కదిలించే సినిమా ఇది అన్నాడు. రాశిఖన్నా మాట్లాడుతూ -ఈరోజుతో షూటింగ్ పూరె్తైంది. అంతా హ్యాపీగా ఉన్నాం. ఈ సినిమా నాకొక బెస్ట్ ఎక్స్‌పీరియన్స్. నా పాత్ర అందరికీ కనెక్టవుతుంది అన్నారు. హీరో సాయితేజ్ మాట్లాడుతూ -గీతాఆర్ట్స్, యువీ క్రియేషన్స్‌లో పని చేయాలన్న నా కోరిక ఈ సినిమాతో ఒకేసారి తీరింది. ప్రతి ఒక్కరూ నా క్యారెక్టర్‌తో కనెక్టవుతారు. ఈ సినిమా నుంచి బయటకు రానున్న మూడోపాట కూడా మీ అందరికీ నచ్చుతుందన్న నమ్మకం ఉంది అన్నారు.