Others

ఈనాటి ఈ హారుూ.. (నాకు నచ్చిన పాట )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సినిమాల్లోని మధురమైన పాటలను వింటున్నపుడు శారీరక, మానసిక అలసట నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆ పాటల్లోని తియ్యని రాగాలే ఆరోగ్యాన్నిస్తాయి. మన తెలుగు సినిమాలలోని నాటి పాటలను తియ్యనివి కొన్నింటిని గుర్తు చేసుకుందాం.
‘‘ఈనాటి ఈ హారుూ/ కలకాదోయి నిజమోయి -అంటూ జయసింహ చిత్రానికి ఘంటసాల, సుశీల పాడారు. నందమూరి తారకరామారావు, అంజలీదేవి నటించారు. ఈ పాటకు మధురానుభూతి ఖాయం.
‘ఎచటనుండి వీచెనో ఈ చల్లని గాలీ
తీవెలపై వూగుతూ.. పూవులపై తూగుతూ..
ఈ పాట అప్పుచేసి పప్పుకూడు సినిమాలోనిది. ఈ పాటకు సావిత్రి నటన అద్భుతం. ఈ పాటను వింటుంటే ఎంతటి ఆందోళనలోనున్న వారైనా ఆహ్లాదం పొందుతారు.
‘‘జీవితమె సఫలము/ రాగసుధా భరితము
ఈ పాట అనార్కలి సినిమాలో జిక్కి పాడింది. పాటకు తగిన నటన అంజలీదేవిది. పాటను వింటూంటే తన్మయత్వంలోకి వెళ్తాం.
విరిసింది వింతహాయి.. మురిసింది నేటి రేయి
అందాల చందమామ.. చెంతనుంది అందుకే
ఈ పాట బాలనాగమ్మ చిత్రంలోనిది. యన్టీఆర్, అంజలీదేవి ఈ పాటలో కనిపిస్తారు. ఈ పాట కూడా మనలను ఎంతగానో రంజింపచేస్తుంది.
భారతీయ సంస్కృతిలో సాహిత్యం, సంగీతం, గేయము ఎంతో ప్రాముఖ్యతగలవి. ఓలలాడించే సంగీతాన్ని వింటే ఔషధాలకు బాగుకాని వ్యాధులు నయవౌతున్నాయని నేటి శాస్తజ్ఞ్రులు వెల్లడిస్తున్నారు. ఇలాంటి మంచి స్వరకల్పనలతో నాటి సినిమాలను ఇప్పటికీ మరిచిపోలేక పోతున్నామంటే వాటిలోని మాధుర్యమైన పాటలే. అందుకే కాబోలు నాటి సినిమా రంగాన్ని స్వర్ణయుగంతో పోల్చుకుంటున్నారు. వాటి మాధుర్యాన్ని నేటితరం చవిచూడాలనుకుంటే రేడియోలో మీరుకోరిన పాటలు కార్యక్రమాల్లో, సీడీల్లో చూడవచ్చును.

-తోట సదానందం