S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

10/26/2019 - 20:40

అల్లు అర్జున్ కథానాయకుడుగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘అల వైకుంఠపురంలో’. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి జనవరి 12న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన ‘సామజవరగమన’ విడుదలై అందర్నీ ఆకట్టుకుంది. ఇప్పుడు తాజాగా ‘రాములో రాముల..’ అన్న పాటను శనివారం సాయంత్రం విడుదల చేశారు.

10/26/2019 - 20:32

కార్తి కథానాయకుడుగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో కె.కె.రాధామోహన్ శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై విడుదలైన చిత్రం ఖైదీ. ఈ చిత్రానికి అన్ని కేంద్రాలనుంచి మంచి ఆదరణ లభిస్తోందని హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో సినిమా యూనిట్ తెలిపింది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో కె.కె.రాధామోహన్ మాట్లాడుతూ.. దీపావళికి విడుదల చేసిన ఈ చిత్రం డిఫరెంట్ కథనంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోందని తెలిపారు.

10/26/2019 - 20:29

బ్రోచేవారెవరురా వంటి డీసెంట్ హిట్ తర్వాత శ్రీవిష్ణు హీరోగా నటించిన చిత్రం -తిప్పరా మీసం. అసుర ఫేమ్ విజయ్‌కృష్ణ ఎల్ దర్శకత్వంలో రిజ్వాన్ ఎంటర్‌టైనె్మంట్స్, కృష్ణవిజయ్ ఎల్ ప్రొడక్షన్స్ పతాకాలపై శ్రీ హోమ్ సినిమాస్ సమర్పణలో యువ నిర్మాత రిజ్వాన్ నిర్మించిన చిత్రమిది. చిత్రం టీజర్, ట్రైలర్స్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. సురేష్ బొబ్బిలి అందించిన సంగీతం శ్రోతలని అలరిస్తోంది.

10/26/2019 - 20:27

సినిమా అంటే పిచ్చి. ఆ ఫీల్డ్‌లో ఇదే చేయాలన్న రూల్సేంలేవు. కాకపోతే -దర్శకత్వంపై ఆసక్తి అంతే. ఒకవేళ నేను చేసిన సినిమాలు ఫ్లాపైతే క్యారెక్టర్ ఆర్టిస్టుగానైనా చేస్తా. అదీకాకుంటే చాయ్ అమ్ముకుని బతుకుతా. బట్, నచ్చిందే చేస్తా -అంటున్నాడు దర్శకుడు, హీరో తరుణ్ భాస్కర్.

10/26/2019 - 20:26

శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్ బ్యానర్‌లో తల్లాడ శ్రీనివాస్ నిర్మాతగా సాయికృష్ణ దర్శకత్వం వహిస్తూ నటించిన సినిమా -బ్లాక్‌బోర్డ్. సినిమా ట్రైలర్‌ని హీరో ప్రిన్స్ విడుదల చేశాడు. ఈ సందర్భంగా ప్రిన్స్ మాట్లాడుతూ -బ్లాక్‌బోర్డ్ ట్రైలర్ బాగుంది. సినిమాలో డ్యూయల్ రోల్ చేయడం మరింత ఆసక్తికరంగా ఉంది అన్నాడు.

10/26/2019 - 20:25

సినిమాలు, సోషల్ మీడియా పోస్టింగులతో సంచలనం రేపే రాంగోపాల్‌వర్మ బయోపిక్‌లు, యదార్థ సంఘటనల ఇతివృత్తంతో సినిమాలు రూపొందించాడు. శివ మొదలుకొని ఇప్పటివరకు వైవిధ్యభరిత చిత్రాలను తెరకెక్కిస్తూ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన అగ్ర దర్శకుడు వర్మ. ఆయన నుంచి వస్తోన్న తాజా సంచలనం -కమ్మరాజ్యంలో కడప రెడ్లు. టైటిల్ చూస్తే ఇది రెండు బలమైన సామాజిక వర్గాల మధ్య జరిగే కథ అనుకుంటాం.

10/19/2019 - 21:00

ఎన్నో బాధలు, కష్టాలకోర్చి పెంచి పెద్దచేసిన తల్లిదండ్రుల్ని నిర్లక్ష్యం చేసేవారికి.. వారి పిల్లలు ఎలాగ గుణపాఠం నేర్పించారో తెలియచేసే సినిమాను నిర్మాత రాఘవ 1973లో నిర్మించారు. దాసరి నారాయణరావుని దర్శకుడుగా పరిచయం చేసిన ‘తాతమనవడు’ సినిమా అది. కథాసారాంశాన్ని ఒక పాటలో చెబుతూ, కుటుంబ నియంత్రణ ఎంత అవసరమో తెలియచెబుతూ రాసిన గీతమిది. అధిక సంతానంతో వారికి రోజుల పేర్లు పెట్టుకుని పిలుస్తూ..

10/19/2019 - 20:59

1971లో విడుదలైన ‘తాసిల్దారుగారి అమ్మాయి’ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సత్య చిత్ర.. కెఎస్ ప్రకాశరావు దర్శకత్వంలో నిర్మించింది. రచయిత్రి కావలిపాటి విజయలక్ష్మి ‘విధి విన్యాసాలు’ నవలకు సినిమా రూపమే ఈ సినిమా. కండక్టర్ కొడుకు కలెక్టర్ అవుతాడా? అనే ప్రశ్నకు జవాబే ఇతివృత్తం. బస్సు కండక్టర్‌గా పనిచేస్తున్న ఒక యువకుడిని తాసిల్దారుగారి అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది.

10/19/2019 - 20:51

ఎప్పుడైనా ఎక్కడైనా క్రమశిక్షణ, కట్టుబాటు మనిషికి అవసరం. తమకి తాము నియంత్రణలో ఉండగలగాలి. నటుడు రాజనాల కాస్త దురుసుగా ఉండేవాడు. ఇండస్ట్రీలో తలబిరుసు మనిషిగా పేరుబడ్డాడు. ఆయనకున్న కొన్ని దుర్వ్యసనాల వల్ల ఆరోగ్యం చెడింది. వేషాలు తగ్గాయి. అంతకుముందు ఆయన వెనుక నిర్మాతలు పడేవారు. పరిస్థితులు మారాక -ఆయనే నిర్మాతల చుట్టూ తిరగడం మొదలెట్టాల్సి వచ్చింది. సినిమా లోకంలో ఇలాంటి సహజమే.

10/12/2019 - 20:31

‘ఓహో మేఘమాల నీలాల మేఘమాల’ పాట ‘్భలేరాముడు’ చిత్రానికి సదాశివబ్రహ్మం వ్రాయగా.. సాలూరి రాజేశ్వరరావు స్వరపర్చారు. పి.లీల ఆలపిస్తే.. సావిత్రి, నాగేశ్వరరావు, గిరిజలపై చిత్రీకరించారు దర్శకుడు వేదాంతం రాఘవయ్య. చిత్రంలో పాటను చెల్లెల్ని (గిరిజ) నిద్రపుచ్చుతూ అక్క (సావిత్రి) పాడటం జరిగింది.

Pages