Others

వీణలోన... తీగలోన (నాకు నచ్చిన పాట )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘వీణలోన... తీగలోన... ఎక్కడున్నది నాదము...’’ ఈ గీతం ‘చక్రవాకం’లోనిది. డి.రామానాయుడు అఖిలాంధ్ర ప్రేక్షకుల్ని మెప్పించే తీరున నిర్మించారు.
గీత రచయిత ఆచార్య ఆత్రేయ. చక్రవాక రాగంలో సాగే ఈ గీతానికి సంగీతం కె.వి.మహదేవన్. సాహిత్యం రసస్ఫూర్తి నింపితే, స్వరకీర్తి సంగీతం చేసిన తీరు హృదయాన్ని అలరిస్తుంది. ఇక వాణిశ్రీ అభినయం మది స్వాంతన కలిగిస్తుంది. ఫీల్‌తో కూడిన పాటను సుశీలమ్మ పాడింది.
వీణలోన తీగలోన ఎక్కడున్నది నాదము, అది ఎలాగైనది రాగము/ మాటలోన మనసులోన ఎక్కడున్నది భావము అది ఎప్పుడౌను గానము / నాదమునకు స్వరమే రాగము మనసులోని మాటే భావము రాగభావములేకమైనదే రమ్యమైన గానము-
మరో చరణము: గత జన్మశృతి చేసుకున్నది... అది ఈ జన్మ సంగీతమైనది. సరిగమ పదనిస సనిదప మగరిస... రాగాల ఆరోహణ అవరోహణైనది అనురాగ హృదయాల అనే్వషణైనది/
మలి చరణము: గుండెలోన గొంతులోన ఎక్కడున్నది ఆవేదన... అది ఎలాగౌను సాధన/ గీతమునకు బలమే వేదన... రాగమునకు మెరుగే సాధన... గుండె గొంతులేకమైనది నిండు రాగాలాపన- ఇది రెండవ పార్శ్వము (విషాదంతో కూడిన వియోగం).
వీణలోన తీగలోన ఎక్కడున్నది అపశృతి... అది ఎలాగైనది విషాద గీతి/ వెతికి వచ్చిన తీగతో నా వీణనే ముడి వేసుకుంటిని/ వెలికిరాదని కలిసి పాడితిని/ నేడీ విఫల వీణగా మిగిలిపోతిని/ గానము ఒక స్వరము మారినా... వలపు పాటే కలత పాటగును/ అనురాగమున అపశృతి పలికిన కన్నీటిలో కల కరిగిపోవును/ గాలిలోన గాలినై కలిసిపోతాను నీ గానమై నేనందులోనే నిలిచిపోతాను/ మట్టిలోన మట్టినై మాసిపోతాను/ నీ మనసులోన మమత గానే బ్రతికి ఉంటాను.
శారీరకంగా తను తనువుచాలించి విశ్వంనుంచి నిష్క్రమించినా- వ్రాయగలరా ఇంతకన్నా ‘‘అమరప్రేమని’’. ఎవరు ఎలా స్వరపరచగలరు... ఏ గొంతుక ఆలపించగలదు... పై చెప్పిన కళావతంసులు తప్ప. అందుకే ఈ పాట ఎన్ని శతాబ్దాలైన అంతర్లీనంగ మనసు వాహినిలో ప్రవహిస్తూనే వుంటుంది.

-క్రిష్ణోదయ, హైదరాబాద్