S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

10/05/2019 - 20:53

తారకలో మంచి ఫైర్ వుంది. అది ఒక రోజుండి పోయేదికాదు. తాతకు తగ్గ మనవడనిపించుకోవాలన్న దృఢమైన కాంక్ష వుంది. చూసే చూపులోనూ డైలాగులు పలికే తీరులోనూ యన్‌టిఆర్‌ని తలపింప చేయడం ఖాయం. అన్నిటికీ మించి ఇంప్రొవైజేషన్... ఒక డైలాగుని ఎలాచెబితే బావుంటుందో ఎలాచెబతే కనెక్ట్ అవుతుందో ఆ వయసులోనే తెలుసుకోగలిగాడు. చాలా చురుగ్గా వున్నాడు...

10/05/2019 - 20:43

క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాకేశ్ వర్రె, గార్గేయి ఎల్లాప్రగడ హీరో హీరోయిన్లుగా బసవ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం -ఎవ్వరికీ చెప్పొద్దు. శ్రీ వెంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై దిల్‌రాజు తెలుగులో అక్టోబర్ 8న విడుదల చేస్తున్నారు. సినిమా విడుదల సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో దిల్‌రాజు మాట్లాడుతూ -మా జోష్ సినిమాలో రాకేష్ వర్క్ చేశాడు.

10/05/2019 - 20:40

స్మెల్లింగ్ సెన్స్‌లేని ఓ అమ్మాయి పాత్ర చేయడం ఓ కొత్త అనుభూతి ఇస్తోందని అంటోంది కేథరిన్ థ్రెసా. సిద్దార్థ్, కేథరిన్ థ్రెసా హీరో హీరోయిన్లుగా దర్శకుడు సాయిశేఖర్ తెరకెక్కించిన చిత్రం -వదలడు. విడుదలకు సిద్ధమవుతోన్న సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా శనివారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడింది థ్రెసా.

09/28/2019 - 20:43

మబ్బులో ఏముంది?.. నా మనసులో ఏముంది? అంటూ కథానాయిక అడిగితే, మబ్బులో కన్నీరు. నీ మనసులో పన్నీరు.. అవునా? అంటూ కథానాయకుడు సమాధానమిస్తాడు. ‘తోటలో ఏముంది.. మాటలో ఏముంది.... నా మాటలో ఏముంది?’ అని ఆమె అడిగితే -‘తోటలో మల్లియలు/ మాటలో తేనెయలు/ నీ మాటలో తేనెయలు’ అంటాడతను. ప్రశ్న -జవాబుగా సాగే ఈ పాట లక్షాధికారి చిత్రంలోది. అప్పట్లో ఈ స్టయిల్ సాంగ్ ఓ గొప్ప ప్రయోగం.

09/28/2019 - 20:42

శ్రీరామ్ అనే రచయిత పాత్రతో సాహిత్యానికి ప్రాధాన్యతనిచ్చి సహజ కవిగా ఒక పల్లెటూరు యువకుని పాత్రను సృష్టించి, కవిత్వాన్ని అన్నాచెల్లెళ్ల అనుబంధాలను మేళవించి సినారె, దేవులపల్లి, కొసరాజు, దాశరథి రాసిన పాటలతో కళాతపస్వి కె విశ్వనాథ్ దర్శకత్వంలో ఎం బాలయ్య నిర్మాతగా అమృతా ఫిలింస్ బ్యానర్‌పై నిర్మించిన ఉదాత్తమైన కుటుంబ కథాచిత్రం -చెల్లెలి కాపురం.

09/28/2019 - 20:41

‘తెలుగు సినీ పరిశ్రమ పచ్చగా పదికాలాలు వుండాలంటే నిర్మాత పచ్చగా వుండాలి. చెట్టు పచ్చగా వుంటేనే దానికింద నీడ దొరుకుతుంది. దాని ఫలాలూ పదిమందికి అందుతాయి. అదే చెట్టు మోడువారిపోతే? ఆ మోడు కింద ఎవరు తలదాచుకుంటారు? అక్కడ తినడానికి ఏంమిగుల్తుంది బూడిద!’

09/28/2019 - 20:32

వి త్రి ఫిలిమ్స్, సుబ్రమణ్యం మలాసిని ప్రెజెంట్స్ డబ్‌స్మాష్ సాంగ్ సినీ ప్రముఖుల సమక్షంలో విడుదలైంది. ఇండస్ట్రీ లెజెండ్స్ మీద పాట ఉండడం విశేషం. పాటను నిర్మాతలు రాజ్ కందుకూరి, దామోదర్‌ప్రసాద్, రామసత్యనారాయణ విడుదల చేశారు. కార్యక్రమంలో చిత్ర నటీనటులు, టెక్నీషియన్లు పాల్గొన్నారు. నిర్మాత ఓంకారలక్ష్మి మాట్లాడుతూ -నా సోదరుడు సినిమాలో నటిస్తుండటం హ్యాపీ. హ్యాపీడేస్ తరహా సినిమా ఇది అన్నారు.

09/28/2019 - 20:31

సైరా తరువాతి ప్రాజెక్టులో చిరుతో జోడీకట్టే హీరోయిన్ పేరు రోజుకొకటిగా వినిపిస్తోంది. తాజాగా -త్రిషాకృష్ణన్ పేరు తెరపైకి వచ్చింది. టాలీవుడ్, కోలీవుడ్‌లో కొనే్నళ్లు టాప్ హీరోయిన్ స్టేటస్‌ను ఎంజాయ్ చేసింది త్రిష. బక్కపల్చని అందాలతో స్టార్ హీరోలందరి సరసనా మెప్పించింది.

09/28/2019 - 20:30

పూరి జగన్నాథ్ పుట్టినరోజు సందర్భంగా దర్శకత్వ శాఖలో ఆర్థిక ఇబ్బందుల్లోవున్న 30మందికి ‘హెల్పింగ్ హ్యాండ్స్’ పేరిట ఒక్కొక్కరికీ రూ. 50వేలు చొప్పున 15 లక్షల ఆర్థికసాయం అందించారు పూరి కనెక్ట్స్ నిర్మాత ఛార్మికౌర్. ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రసాద్ లాబ్స్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఛార్మి మాట్లాడుతూ -పూరికి దర్శకరత్న దాసరి ఇచ్చిన ఇన్‌స్పిరేషన్‌తో ఈ కార్యక్రమం మొదలైంది.

09/28/2019 - 20:28

సుమన్ రంగనాథన్, ముమైత్‌ఖాన్, బెనర్జీ, వెంకట్, సంజీవ్‌కుమార్ కీలక పాత్రధారులుగా కెటి నాయక్ దర్శకత్వం వహించిన సినిమా -దండుపాళ్యం 4. నవంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రంపై తెలుగు, కన్నడలోవున్న ఆసక్తిని దృష్టిలో పెట్టుకుని థియేట్రికల్ ట్రైలర్‌ను నేరుగా సోషల్ మీడియా నుంచి విడుదల చేశారు.

Pages