Others

కొత్త కానె్సప్ట్‌తో కొత్త సినిమా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సినిమా మీదున్న పాషన్‌తో ఫీల్డ్‌కి వచ్చిన నిర్మాత విశ్వనాథ్ తన్నీరు. ఇదివరకే హారర్ సినిమా నిర్మించిన ఆయన, విశ్వనాథ్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై మరో చిత్రానికి సన్నాహాలు చేస్తున్నారు. సినిమామీద కథ ఎలా వుండాలి అన్న చర్చతో తాను ఈ రంగానికి వచ్చాను. దర్శకత్వ శాఖలో అనుభవం కూడా వుండడంతో అనేక సీరియల్స్ చేసి అన్నిటికన్నా కష్టతరమైన పని చిన్న సినిమాలు రూపొందించడమని తెలుసుకున్నా. మా సినిమా విడుదల విషయంలో కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నా. అటువంటి ఇబ్బందులు ఎదురుకాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఇప్పుడు కొత్త తరహా చిత్రాలను రూపొందించే ప్రయత్నంలో వున్నా. ఆ నమ్మకంతోనే కానె్సప్ట్ బేస్డ్ సినిమాకు సన్నాహాలు చేస్తున్నా. ఈ స్క్రిప్ట్‌పై దాదాపు ఆరునెలలపాటు పనిచేశాం. లవ్, కామెడీ సెంటిమెంట్‌తో మెసేజ్ ఓరియెంటెడ్‌గా రూపొందించే చిత్రం త్వరలో ప్రారంభం కానుంది. విశ్వనాథ్ ఫిలిం ఫ్యాక్టరీ, విజరుూభవ ప్రొడక్షన్స్ పతాకాలపై తెరకెక్కించనున్నాం. త్వరలో అన్ని విశేషాలు ప్రకటిస్తా అన్నారు.