Others

తనీష్.. ‘మహాప్రస్థానం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తనీష్ కొత్త సినిమా -మహాప్రస్థానం. ‘జర్నీ ఆఫ్ ఏన్ ఎమోషనల్ కిల్లర్’ అనేది ఉప శీర్షిక. ‘అంతకుమించి..’ లాంటి హారర్ థ్రిల్లర్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న దర్శకులు జాని తెరకెక్కిస్తోన్న రెండో చిత్రాన్ని ఓంకారేశ్వర క్రియేషన్స్ నిర్మిస్తోంది. కబీర్ దుహాన్‌సింగ్, అమిత్, కంచెరపాలెం రాజు తదితర ప్రముఖ నటీనటులు ఇతర పాత్రల్లో నటించనున్నారు. క్రైమ్ నేపథ్యంలో హృదయానికి హత్తుకునే ప్రేమకథతో మహాప్రస్థానం తెరకెక్కనుంది. డిసెంబర్ తొలి వారంనుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టనున్నట్టు చిత్రబృందం చెబుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు జాని మాట్లాడుతూ -ఇదొక యాక్షన్ ఎమోషనల్ లవ్‌స్టోరీ. కథానాయకుడి కోణంలో కథ సాగుతుంది. ఈ భావోద్వేగ ప్రేమకథకు తనీష్ సరిగ్గా సరిపోతాడు. కథానాయకుడి ప్రేమ, బాధ, కోపం సినిమా చూస్తోన్న ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. కథలో మనల్ని లీనం చేస్తుంది. డిసెంబర్ తొలివారం నుంచి హైదరాబాద్‌లో రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభించబోతున్నాం. నిరవధికంగా షూటింగ్ చేయాలని సన్నాహాలు చేస్తున్నాం అన్నారు. సునీల్ కశ్యప్ సంగీతం, బాల్‌రెడ్డి సినిమాటోగ్రఫీ సమకూరుస్తున్నారు.