Others

మీకు తెలుసా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కెవి రెడ్డి దర్శకత్వం వహించిన ‘యోగివేమన’ (1947)లో హీరో పాత్రధారి నాగయ్య. ఈ చిత్రం ఆఖరి సన్నివేశంలో వేమన గెటప్‌లో నాగయ్య జీవసమాధి అయ్యేందుకు బిలంలోకి వెళ్లిపోతారు. ఆ సీన్ చిత్రీకరణలో దర్శకులు కెవి రెడ్డి ‘యాక్షన్’ అన్నారు. కెమెరా స్టార్ట్ అయింది. నాగయ్య జనంమధ్యలోంచి నిరామయంగా చూసుకుంటూ బిలంలోకి వెళ్లిపోయారు. అక్కడున్న వారందరూ నాగయ్య నట సమ్మోహనాస్త్రంలో పడిపోయారు. దర్శకుని దగ్గర్నుంచి లైట్ బాయిస్ వరకు ప్రతి ఒక్కరూ కన్నీరు మున్నీరుగా విలపించారట. ‘అయ్యా కెవి రెడ్డిగారూ! షాట్ ఓకేనా? మీరు ఓకె చెప్పలేదు. నాకు లోపల గాలి ఆడటం లేదు. నేను నిజంగానే చచ్చిపోయేటట్లున్నాను’ అని నాగయ్య బిలం సెట్‌లోంచి గట్టిగా అరిచారట. అంతవరకు అక్కడ ఎవ్వరికీ నాగయ్య గురించిగాని, సినిమా షూటింగ్ గురించిగాని ధ్యాసే లేదట. వేమన పాత్రలో నాగయ్య లీనమై నటించిన తీరు ఈనాటి సినిమా ప్రపంచంలో మచ్చుకైనా కనబడదు.
-పూజారి నారాయణ