Others

పాన్.. తుపాకి 2

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాన్ ఇండియా -టాగ్ లైన్‌తో భారీ వసూళ్లు రాబట్టే వ్యాపార సూత్రానికి మేకర్లు మరింత పదును పెడుతున్నారు. భారీ బడ్జెట్ నిర్మాతలంతా -రెండడుగులు ముందుకేసి ‘పాన్ ఇండియా’ మూవీలకు ప్లాన్ చేస్తుండటం కొద్దికాలంగా కనిపిస్తోన్న సీన్. ఇప్పుడు సౌత్‌లోనే పాన్ ఇండియా స్థాయి సినిమాలుగా పది పదిహేను వరకూ రెడీ అవుతున్నాయి. కలైపులి థానులాంటి పెద్ద నిర్మాతలు తలచుకుంటే -పాన్ ఇండియా ప్రాజెక్టుల్ని ప్లాన్ చేయడం పెద్ద కష్టమైన పనేంకాదు. ఇప్పుడు అదే జరగబోతోందట. ‘వి క్రియేషన్స్’ నుంచి తుపాకి సీక్వెల్‌ను పాన్ ఇండియా మూవీగా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. 2012లో తమిళ స్టార్ హీరో విజయ్ -ఏస్ డైరెక్టర్ మురుగదాస్ కాంబినేషన్‌లో వి క్రియేషన్స్‌పై తెరకెక్కిన సినిమా -తుపాకి. ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన తొలి సినిమా సెనే్సషన్ సృష్టించింది. ఇటు తెలుగులోనూ విజయ్‌కి ఒకింత మార్కెట్ క్రియేట్ చేసిన సినిమా తుపాకి. ఆ తరువాత ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన కత్తి, సర్కార్ సైతం హిట్లుకొట్టాయి. హ్యాట్రిక్ హిట్ సాధించిన కాంబోతో పాన్ ఇండియా మూవీకి ‘వి క్రియేషన్స్’ రెడీ అవుతోందన్నది తాజా సమాచారం. క్రిటిక్స్ నుంచీ మంచి అప్లాజ్ అందుకున్న తుపాకి కథకు యూనివర్శల్ అప్పీల్ ఉండటంతో -సీక్వెల్‌ను పాన్ ఇండియా మూవీగా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. మురుగదాస్ సైతం ప్రాజెక్టు విషయంలో ఆసక్తి చూపటంతో -ఇప్పటికే విజయ్‌తో కథా చర్చలు పూర్తి చేశాడట. హిట్టు సినిమా తుపాకికి సీక్వెల్ రావొచ్చంటూ చాలాకాలంగా వినిపిస్తోన్న కథనాలను నిజం చేస్తూ -పాన్ ఇండియా ప్రాజెక్టుగా దీన్ని తెరకెక్కించే ఆలోచన చేస్తున్నారట. అదే నిజమైతే, వి క్రియేషన్స్‌నుంచి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడొచ్చన్న మాట. తుపాకి సీక్వెల్‌పై సౌత్‌లోనే ఒకింత ఆసక్తి ఉండటం, హ్యాట్రిక్ హిట్ కాంబినేషన్ రిపీట్ అవుతుండటంతో -ప్రాజెక్టుపై భారీ అంచనాలు నెలకొనటం ఖాయం.