Others

అదిరే ఐటమ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెప్పడానికి తెలుగమ్మాయే గానీ తెలుగులో మాత్రం అవకాశాలు రావడం లేదు. ముంబాయిలో సైటిల్ అయిన భామ మున్నామైఖేల్ సినిమాతో తెరంగేట్రం చేసింది. తొలి సినిమాతోనే డాన్స్ పెర్ఫార్మెన్స్ అద్భుతంగా చేసి, టైగర్ ష్రాఫ్‌తో సమానంగా గుర్తింపు పొందింది. ఈ సినిమాలో నిథి అగర్వాల్‌ను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. భవిష్యత్ అంతా నిథిదే అంటూ జోస్యం కూడా చెప్పారు. కానీ ఎందుకో ఆమెకు అవకాశాలు ఒక్కటీ కలిసి రాలేదు. ఇక లాభం లేదని టాలీవుడ్‌కి ఏం చేసినా నిథికి సవ్యసాచి సినిమా స్వాగతం చెప్పింది. అందులో నాగచైతన్య సరసన కథానాయికగా నటించింది. కానీ ఆ సినిమా సరైన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో ఈసారి తమ్ముడితో జతకట్టి మిస్టర్ మజ్నులో కనిపించింది. అది కూడా బాక్సాఫీస్‌వద్ద బోల్తా కొట్టింది. ఇక తెలుగు హిందీలలో అవకాశాలు రావేమో అనుకున్న సమయంలో పూరి జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో అవకాశం ఇచ్చాడు. ఆ సినిమా హిట్ అవడంతో నిథికి ఊపిరి దొరికినట్లయింది. ఈ చిత్రంలో ఆమె అందాల ఆరబోత ఓ మోస్తరులో దాటిపోయింది. ఏకంగా జిల్లేలమ్మజిట్ట పాటలో ఆమెను చూసినవాళ్లెవరూ మరిచిపోలేరు. ఆ డాన్స్ మూమెంట్స్ అన్నీ ఐటమ్‌సాంగ్ చేయడానికి కూడా అద్భుతంగా పనికొస్తాయని ప్రేక్షకులు కామెంట్ చేశారు. అందుకు తగ్గట్టుగానే ప్రస్తుతం నిథి ఐటమ్ పాటలో నటించానికి సిద్ధమైంది. హీరోయిన్‌గా దాదాపు నెల రోజులపాటు పనిచేస్తే రెండుమూడు రోజులకే ఐటమ్‌పాట పూర్తవుతుంది. రెండిటికి పారితోషికం దాదాపు దగ్గర్లోనే ఉంటుంది. అయినా కానీ మొదట్లో ససేమిరా అన్నా ఆ తర్వాత టెమ్‌టింగ్ ఆఫర్‌తో నిథి ఓకే అన్నది. విశేషమేంటంటే తాను ఐటమ్‌సాంగ్‌లో నటించే సినిమాలో హీరోయిన్‌గా తనతోపాటు నటించిన నభానటేష్ నటిస్తుండడమే! అయితే ఈ సినిమాలో ఇద్దరు భామలు కథానాయకుడు బెల్లంకొండ శ్రీనివాస్‌తో కలిసి నటించనున్నారు. ఎవరు ఎంత అందాన్ని ఆ పాటలో ఆవిష్కరిస్తారో వేచి చూడాల్సిందే!