Others

విలనిజభూషణం!( అలా.. అన్నమాట)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మామూలు విలన్లలా వికటాట్టహాసం చెయ్యకుండా వ్యంగ్యధోరణిలో, సెటైర్ సంభాషణలతో ప్రేక్షకులను కవ్వించి, పాలిష్డ్ విలన్ పాత్రలను తన అభినయంలో ప్రాణప్రతిష్ట చేసిన అరుదైన నటుడు సి నాగభూషణం. ‘అడవిరాముడు’ (1977)లోని ‘చరిత్ర అడక్కు...చెప్పింది విను’ డైలాగ్ రుూనాటికి అందరినోటా వినిపిస్తూంటుంది. అటు సినిమాల్లోను, రంగస్థలం మీదా ఒకే కాలంలో బిజీ స్టార్ అనిపించుకున్న యేకైక నటుడు నాగభూషణం. రవి ఆర్ట్స్ థియేటర్ పతాకంపై ‘రక్తకన్నీరు’ నాటకాన్ని దేశవ్యాప్తంగా అయిదువేల ప్రదర్శనలిచ్చి రికార్డు నెలకొల్పారు. తమిళంలో అత్యంత ప్రజాదరణ పొందిన ‘రక్తకన్నీరు’ నాటకాన్ని పాలగుమ్మి పద్మరాజుచేత తెలుగులో వ్రాయించుకొని, మూల నాటకంలోని యం.ఆర్.రాధా స్టైల్‌ను పట్టుకొని తన సంభాషణలతో ప్రేక్షకులను దడ దడ లాడించాడు. ‘రక్తకన్నీరు’ నాటకంలో నటించిన వాణిశ్రీ, శారద, రేవతి, మీనాకుమారి, ఆదోని లక్ష్మి వంటి నటీమణులు తెలుగు, కన్నడ, తమిళ చిత్ర రంగాలలో స్థిరపడ్డారు. పదేళ్లపాటు ప్రజానాట్యమండలి అధ్యక్షుడిగా కొనసాగారు.
నాగభూషణం నటించిన తొలి చిత్రం కోన ప్రభాకరరావు నిర్మించిన ‘రూపవతి’(1951), జ్యోతి (1954), చిన్నకోడలు (1952) చిత్రాలలో చిన్న వేషాలువేసి యన్.టి.ఆర్. హీరోగా నటించిన ‘పల్లెటూరు’ (1952)లో ప్రాధాన్యతగల పాత్ర ధరించారు. ‘పెంకిపెళ్లాం’ (1956)లో తాగుబోతుగా, ‘అమర సందేశం’ (1954)లో దుష్టుడిగా నటించారు. నాగభూషణం నటజీవితాన్ని మలుపుతిప్పిన హీరోగా నటించిన చిత్రం ‘ఏది నిజం’(1956), ‘ప్యూజిటివ్’అనే ఇటాలియన్ చిత్రం ఆధారంగా దీన్ని నిర్మించారు. దర్శకుడు వైణిక విద్వాంసుడు బాలచందర్. బాలచందర్ ‘సంఘం’ (1954) చిత్రంలో యన్.టి.ఆర్ స్నేహితుడిగా నటించాడు. అదే చిత్రంలో ‘పెళ్లీ పెళ్లీ’అంటూ పాట పాడుతూ కన్పిస్తాడు. ‘ఏది నిజం’లో కుండలు, బండలు, జట్కాలపై, గంగిరెద్దులపై, మైలురాళ్లపై టైటిల్స్ చూపించి తన ప్రత్యేకతను చాటుకున్నారు. నాగభూషణం సరసన షావుకారు జానకి నటించింది. సుంకర రచన చేయగా, మాస్టర్ వేణు సంగీతం నిర్వహించారు. ఈ చిత్రానికి రాష్ట్రపతి ప్రశంసాపత్రం లభించింది. ఈ చిత్రం తర్వాత ఆయన నట జీవితం మందగించినా ‘మంచి మనసులు’ (1962), తమిళ చిత్రం కుముదంలో యం.ఆర్.రాధా పాత్ర)తో మంచి గుర్తింపు వచ్చింది.
మహమ్మద్ బీన్ తుగ్లక్, చెల్లెలికాపురం, విచిత్ర కుటుంబం, అదృష్ట జాతకుడు, కలెక్టర్ జానకి వంటి చిత్రాలలో విభిన్న పాత్రలు పోషించారు. ‘కథానాయకుడు’(1969)లోని నాగభూషణం పాత్రను యెవ్వరూ మరచిపోలేరు. రవి ఆర్ట్స్ థియేటర్ పతాకంపైనే నాటకాలరాయుడు (1969), ఒకే కుటుంబం (1970) చిత్రాలు నిర్మించారు. నాటకాలరాయుడికి అల్బేలా హిందీ చిత్రం మూలమైతే ఒకే కుటుంబానికి పావమన్నిప్పు మూలం. ‘టైమ్ రావాలి నాయనా, యెంతటి వాడైనా టైమ్‌వచ్చేవరకు ఆగాలి. టైమ్ వస్తే మాత్రం యెవ్వరూ యెవర్ని ఆపలేరు. ఆ టైమ్ వచ్చి బిజీ అయితే దేనికీ టైమ్ వుండదు’అని చెప్పేవారట నాగభూషణం.

- పూజారి నారాయణ