S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

09/28/2019 - 20:41

‘తెలుగు సినీ పరిశ్రమ పచ్చగా పదికాలాలు వుండాలంటే నిర్మాత పచ్చగా వుండాలి. చెట్టు పచ్చగా వుంటేనే దానికింద నీడ దొరుకుతుంది. దాని ఫలాలూ పదిమందికి అందుతాయి. అదే చెట్టు మోడువారిపోతే? ఆ మోడు కింద ఎవరు తలదాచుకుంటారు? అక్కడ తినడానికి ఏంమిగుల్తుంది బూడిద!’

09/28/2019 - 20:32

వి త్రి ఫిలిమ్స్, సుబ్రమణ్యం మలాసిని ప్రెజెంట్స్ డబ్‌స్మాష్ సాంగ్ సినీ ప్రముఖుల సమక్షంలో విడుదలైంది. ఇండస్ట్రీ లెజెండ్స్ మీద పాట ఉండడం విశేషం. పాటను నిర్మాతలు రాజ్ కందుకూరి, దామోదర్‌ప్రసాద్, రామసత్యనారాయణ విడుదల చేశారు. కార్యక్రమంలో చిత్ర నటీనటులు, టెక్నీషియన్లు పాల్గొన్నారు. నిర్మాత ఓంకారలక్ష్మి మాట్లాడుతూ -నా సోదరుడు సినిమాలో నటిస్తుండటం హ్యాపీ. హ్యాపీడేస్ తరహా సినిమా ఇది అన్నారు.

09/28/2019 - 20:31

సైరా తరువాతి ప్రాజెక్టులో చిరుతో జోడీకట్టే హీరోయిన్ పేరు రోజుకొకటిగా వినిపిస్తోంది. తాజాగా -త్రిషాకృష్ణన్ పేరు తెరపైకి వచ్చింది. టాలీవుడ్, కోలీవుడ్‌లో కొనే్నళ్లు టాప్ హీరోయిన్ స్టేటస్‌ను ఎంజాయ్ చేసింది త్రిష. బక్కపల్చని అందాలతో స్టార్ హీరోలందరి సరసనా మెప్పించింది.

09/28/2019 - 20:30

పూరి జగన్నాథ్ పుట్టినరోజు సందర్భంగా దర్శకత్వ శాఖలో ఆర్థిక ఇబ్బందుల్లోవున్న 30మందికి ‘హెల్పింగ్ హ్యాండ్స్’ పేరిట ఒక్కొక్కరికీ రూ. 50వేలు చొప్పున 15 లక్షల ఆర్థికసాయం అందించారు పూరి కనెక్ట్స్ నిర్మాత ఛార్మికౌర్. ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రసాద్ లాబ్స్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఛార్మి మాట్లాడుతూ -పూరికి దర్శకరత్న దాసరి ఇచ్చిన ఇన్‌స్పిరేషన్‌తో ఈ కార్యక్రమం మొదలైంది.

09/28/2019 - 20:28

సుమన్ రంగనాథన్, ముమైత్‌ఖాన్, బెనర్జీ, వెంకట్, సంజీవ్‌కుమార్ కీలక పాత్రధారులుగా కెటి నాయక్ దర్శకత్వం వహించిన సినిమా -దండుపాళ్యం 4. నవంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రంపై తెలుగు, కన్నడలోవున్న ఆసక్తిని దృష్టిలో పెట్టుకుని థియేట్రికల్ ట్రైలర్‌ను నేరుగా సోషల్ మీడియా నుంచి విడుదల చేశారు.

09/28/2019 - 20:27

హారర్, థ్రిల్లర్ కానె్సప్ట్‌ల్లో దర్శకుడు రవిబాబు ట్రాక్ వేరు. అతని చిత్రాలన్నీ ఈ కోణం నుంచి వచ్చినవే ఎక్కువ. టైట్ స్క్రీన్ ప్లే -సింపుల్ బడ్జెట్ కానె్సప్ట్‌తో కథను తెరకెక్కించే రవిబాబు నుంచి వస్తోన్న మరో హీట్ సెనే్సషన్ -ఆవిరి. ఈ సినిమా నుంచి ఓ టీజర్‌ను బయటకు వదిలాడు రవిబాబు. ‘ఇంట్లో తిరిగే ఆత్మలు.. వాటి యాక్టివిటీస్’ కోణంలో ఆవిరి కథ చెప్పనున్నాడన్న విషయం టీజర్ చూస్తే అర్థమవుతోంది.

09/28/2019 - 20:26

కామెడీతో క్రాక్ పుట్టించిన జబర్దస్త్ టీంనుంచి సిల్వర్ స్క్రీన్ ఆడియన్స్‌ని మురిపించేందుకు వస్తున్నారు సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, ఆటో రామ్‌ప్రసాద్. సినిమాలపై ఫోకస్ పెట్టిన ముగ్గురూ లీడ్ రోల్స్‌లో వస్తున్న చిత్రం -3 మంకీస్. దర్శకుడు అనిల్‌కుమార్ తెరకెక్కిస్తోన్న చిత్రానికి నాగేశ్ నిర్మాత. తాజాగా సీనియర్ హీరో వెంకటేశ్ చేతుల మీదుగా సినిమా టీజర్ రిలీజైంది.

09/28/2019 - 20:24

రోహిత్‌చంద్ర, డా.ఎ.పి.చారి, విజయలక్ష్మి ప్రధాన తారాగణంగా రూపొందిస్తున్న చిత్రం ‘అమ్మలగన్న అమ్మ మూలపుటమ్మ’. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియోను ప్రతాని రామకృష్ణగౌడ్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ విడుదల చేశారు. నిర్మాత ఎ.పి.చారి మాట్లాడుతూ -సంప్రదాయాలు గొప్పవని చాటిచెప్పే ప్రయత్నమే సినిమా అన్నారు. భారతదేశం ఒక దేవాలయమైతే ప్రాచీన దేవతలు శక్తివంతమైనవారని, ముగ్గురమ్మల మూలపుటమ్మ అంటే ఎవరూ ఆమె శక్తి ఏమిటి?

09/28/2019 - 20:23

మొత్తానికి సినిమాను మార్జిన్ దాటించేసిన ఆనందంలో ఉన్నారు హీరో వరుణ్‌తేజ్, దర్శకుడు హరీశ్ శంకర్. ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన తాజా ఊరమాస్ చిత్రం -గద్దలకొండ గణేశ్. వాల్మీకి టైటిల్‌తో సినిమా వచ్చివుంటే రిజల్ట్ ఎలా ఉండేదో తెలీదుకానీ, గద్దలగొండ గణేశ్‌లాంటి బరువైన మాస్ టైటిల్‌తో.. కలిసొచ్చిన సెలవుల్లో సినిమా బాగానే దూసుకుపోతోంది.

09/28/2019 - 20:22

అనుష్క -ఓకే అనాలేగానీ ఆమెతో సినిమాలు చేయడానికి తెలుగు, తమిళ భాషల్లో పెద్ద దర్శకులే ఉన్నారు. ప్రాజెక్టుకు ఆమె సై అంటే -ఆమె కోసం కథలు పుట్టించడానికీ రచయితలు రెండు భాషల్లోనూ ఉన్నారు. సెలెక్టెడ్‌గానే సినిమాలు చేస్తున్నా -సూపర్‌స్టార్ ఇమేజ్ మాత్రం అనుష్కవెంటే ఉంది. అనుష్క తాజా ప్రాజెక్టు -సైలెన్స్. బహుభాషా చిత్రమైన సైలెన్స్ -తెలుగులో నిశ్శబ్ధంగా వస్తోంది.

Pages