Others

నవంబర్ 1న దండుపాళ్యం 4

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుమన్ రంగనాథన్, ముమైత్‌ఖాన్, బెనర్జీ, వెంకట్, సంజీవ్‌కుమార్ కీలక పాత్రధారులుగా కెటి నాయక్ దర్శకత్వం వహించిన సినిమా -దండుపాళ్యం 4. నవంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రంపై తెలుగు, కన్నడలోవున్న ఆసక్తిని దృష్టిలో పెట్టుకుని థియేట్రికల్ ట్రైలర్‌ను నేరుగా సోషల్ మీడియా నుంచి విడుదల చేశారు. నిర్మాత వెంకట్ మాట్లాడుతూ -తెలుగు, కన్నడలో దండుపాళ్యం-4 థియేట్రికల్ ట్రైలర్ విడదలైన కొద్ది సమయానికే అనూహ్య స్పందన వచ్చింది. షార్ట్ టైంలో సోషల్ మీడియా ట్రెండింగ్ కావడం -చిత్ర విజయంపై నమ్మకాన్ని పెంచుతోంది. సినిమా కచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తుంది. సినిమాకు సెన్సార్ పూరె్తైంది. జైల్లోని సహచరులను తప్పించేందుకు ఓ దండు పన్నిన వ్యూహం? అది ఫలించిందా? పోలీసుల ఎత్తుగడను చిత్తుచేసి ఎలా విజయం సాధించారు? అన్న ఆసక్తికరమైన అంశాలతో దండుపాళ్యం-4 ఉండబోతోంది. ఇందులో ఏడుగురి గ్యాంగ్‌కు లీడర్‌గా సుమా రంగనాథన్ కనిపిస్తారు అన్నారు. దర్శకుడు కెటి నాయక్ మాట్లాడుతూ -దండుపాళ్యం పార్టులతో ఈ కథకు సంబంధం లేదు. కథనం కొత్తగా ఉంటుంది. సినిమాపై పూర్తి నమ్మకంతో ఉన్నాం అన్నారు.