Others

వెంకీ చేతుల మీదుగా 3 మంకీస్ టీజర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కామెడీతో క్రాక్ పుట్టించిన జబర్దస్త్ టీంనుంచి సిల్వర్ స్క్రీన్ ఆడియన్స్‌ని మురిపించేందుకు వస్తున్నారు సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, ఆటో రామ్‌ప్రసాద్. సినిమాలపై ఫోకస్ పెట్టిన ముగ్గురూ లీడ్ రోల్స్‌లో వస్తున్న చిత్రం -3 మంకీస్. దర్శకుడు అనిల్‌కుమార్ తెరకెక్కిస్తోన్న చిత్రానికి నాగేశ్ నిర్మాత. తాజాగా సీనియర్ హీరో వెంకటేశ్ చేతుల మీదుగా సినిమా టీజర్ రిలీజైంది. ముగ్గురు స్నేహితుల కథగా 3 మంకీస్ ఉండనుందన్న విషయం టీజర్‌ని చూస్తే అర్థమవుతుంది. టైమింగ్ డైలాగ్స్‌కు అవకాశం కల్పించే -బ్యాచిలర్స్ బ్యాచ్‌గా కథతో సినిమా రూపొందించినట్టు తెలుస్తోంది. షకలక శంకర్ ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. విడుదలకు సిద్ధమవుతోన్న సినిమా -3 మంకీస్‌లో ఏ మంకీని పైకి లేపుతుందో చూడాలి.