Others

హెల్పింగ్ హ్యండ్ కొనసాగుతుంది..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పూరి జగన్నాథ్ పుట్టినరోజు సందర్భంగా దర్శకత్వ శాఖలో ఆర్థిక ఇబ్బందుల్లోవున్న 30మందికి ‘హెల్పింగ్ హ్యాండ్స్’ పేరిట ఒక్కొక్కరికీ రూ. 50వేలు చొప్పున 15 లక్షల ఆర్థికసాయం అందించారు పూరి కనెక్ట్స్ నిర్మాత ఛార్మికౌర్. ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రసాద్ లాబ్స్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఛార్మి మాట్లాడుతూ -పూరికి దర్శకరత్న దాసరి ఇచ్చిన ఇన్‌స్పిరేషన్‌తో ఈ కార్యక్రమం మొదలైంది. పూరి ఇచ్చిన ధైర్యంతో ఇస్మార్ట్ శంకర్ ప్రాజెక్ట్ స్టార్ట్‌చేశాం. ఈరోజు మేము హెల్పింగ్ హ్యాండ్‌గా కనిపించొచ్చు. కానీ పూరిని నమ్మి సినిమా చేసిన రియల్ హీరో రామ్ పోతినేని. అతను మాకు హెల్పింగ్ హ్యాండ్. అతనిచ్చిన సపోర్ట్‌తోనే ఈరోజు ఈ సాయం చేయగలుగుతున్నాం అన్నారు. పూరి పుట్టినరోజు ఏటా ఇక ఇలాగే జరుగుతుందన్నారు.
‘నీకు ఇష్టమైన పనికోసం కష్టంవచ్చినా నష్టంవచ్చినా దానికోసం చావడమే దాని గెలుపు’ అని పూరి మెసేజ్ చేసినట్టు చార్మి ప్రకటించింది. కార్యక్రమంలో కాశి విశ్వనాథ్, నటుడు ఉత్తేజ్, డైరెక్టర్స్ యూనియన్ సెక్రటరీ రామ్‌ప్రసాద్, సుబ్బారెడ్డి, భాస్కర్‌రెడ్డి, విష్ణువర్ధన్, ఆదుర్తి రమణ తదితరులు పాల్గొన్నారు.