Others

ఆవిరి హీట్ టీజర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హారర్, థ్రిల్లర్ కానె్సప్ట్‌ల్లో దర్శకుడు రవిబాబు ట్రాక్ వేరు. అతని చిత్రాలన్నీ ఈ కోణం నుంచి వచ్చినవే ఎక్కువ. టైట్ స్క్రీన్ ప్లే -సింపుల్ బడ్జెట్ కానె్సప్ట్‌తో కథను తెరకెక్కించే రవిబాబు నుంచి వస్తోన్న మరో హీట్ సెనే్సషన్ -ఆవిరి. ఈ సినిమా నుంచి ఓ టీజర్‌ను బయటకు వదిలాడు రవిబాబు. ‘ఇంట్లో తిరిగే ఆత్మలు.. వాటి యాక్టివిటీస్’ కోణంలో ఆవిరి కథ చెప్పనున్నాడన్న విషయం టీజర్ చూస్తే అర్థమవుతోంది. ఆవిరిపట్టిన అద్దంపై ‘ఆవిరి’ ఇంగ్లీష్ టైటిల్ రాస్తూ చిన్న పిల్ల ఫేస్‌ను రివీల్ చేసిన సీన్‌తో టీజర్ కట్‌చేసి -సినిమాపై ఆసక్తి పెంచాడు. నేహాచౌహాన్ లీడ్‌రోల్ పోషిస్తోన్న సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘అదుగో’ అంటూ ఏదో చూపించడానికి ప్రయత్నించి గత ప్రాజెక్టులో విఫలమైన రవిబాబు, ఈ ‘ఆవిరి’తో ఆత్మలకథను ఎంత భయపెట్టేలా చూపిస్తాడో చూడాలి.