S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

08/31/2019 - 20:51

‘విన్నావ యశోదమ్మా/ మీ చిన్ని కృష్ణుడు చేసినట్టి అల్లరి చిల్లరి పనులు.. విన్నావ యశోదమ్మా’ అంటూ మాయాబజార్ సినిమా కోసం పింగళి నాగేంద్రరావు రాసిన పాట నాకు చాలా ఇష్టం. పాటకు తగిన కమనీయ స్వరాలు అందించారు ఘంటసాల మాస్టారు. అంతే శ్రావ్యంగా పాడింది పి లీల బృందం. నిజానికి ఈ పాట సినిమా కథకు అవసరం లేదు. లేకున్నా ఇబ్బందీ లేదు.

08/31/2019 - 20:49

యన్టీఆర్, వాణిశ్రీ కాంబినేషన్‌లో 1976 మార్చి 12న విడుదలైన సినిమా -ఆరాధన. నిరక్షరాస్యుడైన గోపి, విద్యాధికురాలైన రాధల మధ్య నడిచే ప్రేమ కథ. పల్లెటూరికి చెందిన గోపి గాయకుడు. తన మధుర కంఠం, పల్లెటూరి అమాయకత్వంతో రాధను ఆకర్షిస్తాడు. వాళ్ల ప్రేమకు ఎలాంటి అవాంతరాలు ఎదురయ్యాయి, ఇద్దరూ ఒక్కటయ్యారా? అన్నదే అసలు కథ. దర్శకుడు బీవీ ప్రసాద్ తెరకెక్కించిన ఈ చిత్రానికి ఎ పుండరీకాక్షయ్య నిర్మాత.

08/24/2019 - 21:03

ఒక సినిమా విజయం సాధిస్తే తీసిన దర్శకుడినో, చేసిన హీరోనో మెచ్చుకుంటారు. కాని, వాళ్లకు ఆ చాన్స్ ఇచ్చే కథకుడు మాత్రం అజ్ఞాతంలో ఉన్నట్టే ఉంటాడు. అలాగే ఆ కథను తగిన సంభాషణలు అందించి చిత్రానికి ఓ గొప్పదనాన్ని తీసుకొచ్చేవారు, చెప్పాల్సిన కథను సింపుల్‌గా ఓ పాటతో చెప్పేవారు వీళ్లు మాత్రం తక్కువ ఆదరణ నోచుకుంటారు.

08/24/2019 - 20:50

పుంభావ సరస్వతి వేటూరి సుందర రామమూర్తి రాసిన మంచి పాటల్లో ఒకటి చెప్పమని ఎవరినైనా అడిగితే -సమాధానం కరవవ్వడం కష్టం. ఎందుకంటే -ఆయన రాసిన వేలాది పాటల్లో ఒక మంచి పాట అని ఏరడమంటే కష్టమే. రాసిన పాటల్లో మంచి పాటలు, వాటిలో గొప్ప పాటలు, వాటిలో శ్రేష్ఠమైన పాటలు, వాటిలో... ఇలా ఫిల్టర్ చేసుకుంటేపోతే.. అంచుల్లో సైతం మిగిలే ఓ పాట -వేణువై వచ్చాన భువనానికి అన్నది. చిన్ని చిన్ని మాటలతో అనంతార్థాన్ని చెప్పిన మాట.

08/24/2019 - 20:49

గతేడాది పొలిటికల్ యాక్షన్ డ్రామాగా వచ్చిన -్భరత్ అను నేను సినిమా నాకు చాలా ఇష్టం. దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన చిత్రంలో మహేష్‌బాబు, కైరా అద్వానీ, ప్రకాష్‌రాజ్ ముఖ్య పాత్రలు పోషించారు. ఒక విద్యార్థి అనుకోకుండా ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోవాల్సి వస్తు -రాష్ట్రంలో ఎలాంటి సంస్కరణలు తీసుకొచ్చాడు అన్న సందేశంతో సాగే కథ అద్భుతంగా ఉంటుంది.

08/24/2019 - 20:48

‘మాకు దొడ్డిమార్గంగుండా వెళ్లే అలవాటు చిన్నప్పట్నించీ లేదు. ఇపుడు నేర్చుకోమంటారా? మీ బోడి సలహా అవసరంలేదు. రాజమార్గం గుండానే వెళదాం!’ అన్నారు, ఆర్డరు జారీ చేస్తున్నట్లుగా యన్‌టిఆర్..

08/17/2019 - 21:15

టౌను పక్కకెల్లొద్దురా డింగరీ/ డాంబికాలు పోవద్దురా/ టౌను పక్కకెళ్లేవు డౌనైపోతావురో.. రబ్బీ బంగారు సామి. ఘంటసాల, జిక్కి ఆలపించిన ఈ పాట అన్నపూర్ణావారి ‘తోడికోడళ్లు’ చిత్రంలోనిది. పాట రచన కొసరాజు రాఘవయ్యచౌదరి. సంగీత స్వరాలను మాస్టర్ వేణు సమకూర్చారు. చిత్రంలో పాట సందర్భం -ఉమ్మడి కుటుంబంలో తోడికోడళ్ల మధ్య సహజంగా వచ్చే ఈర్ష్యా అసూయల నేపథ్యంగా ఉంటుంది.

08/17/2019 - 21:14

ఇప్పుడొస్తున్న చిత్రాలు గొప్పకాదని చెబితే -ఈతరానికి నచ్చదు. అలాగే -ఈతరం సినిమాను ఆసక్తిగా చూడటం ఆ తరానికి నచ్చదు. అందుకే -ఆనాటి తరం సినిమాలను చూసే అవకాశం దక్కితే, ఆతరం వాళ్లు కళ్లప్పగించి మరీ చూస్తారు. అలాంటి వాళ్లలో నాలాంటివాళ్లు చాలామందే ఉండొచ్చు. కొంగర జగ్గయ్య హీరోగా 1957లో వచ్చిన ఓ గొప్ప చిత్రం -బలే బావ. శ్రీ ధనసాయి ఫిల్మ్ పతాకంపై దర్శకుడు రజనీకాంత్ తెరకెక్కించిన మంచి సినిమా.

08/17/2019 - 21:12

మనసుకవి ఆత్రేయ పాట రాసే విధానం చాలా వింతగా ఉంటుంది. పగలంతా పిచ్చాపాటీతో కాలం గడుపుతారు. డాన్ పీంచ్ సిగరేట్ పేకెట్లూ.. పళ్లెంలో ఆరారగా ప్రూట్సు.. ఇవివుండి తీరాలి. అసిస్టెంట్ డైరెక్టరు పాట రాయించుకోవడం కోసం వస్తాడు, పేపర్లూ పాడ్‌తో. పెన్నుతెరిచి మరీ రెడీగా వుంటాడు. ఆ పెన్ను అలాగే వుంటుంది. ప్రూట్సు ఒకటీ అరా అవుతాయి. సిగరెట్లు మొత్తం ఖాళీ అవుతాయి. ఆయన నిద్రలోకి జారుకుంటాడు.
అంతే!

Pages