Others

వరుణ్.. వెరీ హ్యాపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొత్తానికి సినిమాను మార్జిన్ దాటించేసిన ఆనందంలో ఉన్నారు హీరో వరుణ్‌తేజ్, దర్శకుడు హరీశ్ శంకర్. ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన తాజా ఊరమాస్ చిత్రం -గద్దలకొండ గణేశ్. వాల్మీకి టైటిల్‌తో సినిమా వచ్చివుంటే రిజల్ట్ ఎలా ఉండేదో తెలీదుకానీ, గద్దలగొండ గణేశ్‌లాంటి బరువైన మాస్ టైటిల్‌తో.. కలిసొచ్చిన సెలవుల్లో సినిమా బాగానే దూసుకుపోతోంది. తొలివారంలో సినిమా తెలుగు రాష్ట్రాల షేర్ 17.56 కోట్లుంటే, వరల్డ్ వైడ్ షేర్ 20.31 కోట్లు దాటిందని చెబుతున్నారు. ‘సైరా’ వచ్చేవరకూ పెద్ద చిత్రాలు లేకపోవడం, సెలవులు కలిసిరావడంతో -సినిమాను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రమోషనల్ టూర్లతో బిజీగా ఉంది చిత్రబృందం. వెళ్లిన ప్రతిచోటా సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటున్న వరుణ్- అనుకున్న మార్క్ దాటి వెళ్లడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాడు. నేనెక్కడికెళ్లినా ‘గద్దలకొండ గణేశ్’గా సంభోదిస్తున్నారంటూ చెబుతున్నాడు. టైటిల్ రోల్ జనంలో చర్చకు రావడం పెద్ద విషయం కాకున్నా -మారిన టైటిల్‌ను మాత్రం ఈకోణంలో ప్రచారంలోకి తేవడంలో వరుణ్ తనవంతు కృషి చేస్తూనే ఉన్నాడు. ‘పెదనాన్న (చిరంజీవి)కు కథ వివరించి, ఆయనిచ్చిన ప్రోత్సాహంతో చేసిన సినిమా.. ఆయన చెప్పినట్టే మంచి రిజల్టిచ్చింది. ఆయన చెప్పినట్టే మంచి గుర్తింపు తెచ్చింది’ అంటూ ‘సైరా’ క్రేజ్‌తోవున్న చిరు ఇమేజ్‌ను సమర్థంగా మ్యాచ్ చేయడం వరుణ్‌కి కలిసొచ్చిన విషయం. ‘హరీశ్, నేనూ పడిన కష్టానికి ఫలితం దక్కింది’ అంటూ వరుణ్‌తేజ్ హ్యాపీ మూడ్‌లో టూర్ కంటిన్యూ చేస్తున్నాడు.