Others

దటీజ్ అనుష్క?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనుష్క -ఓకే అనాలేగానీ ఆమెతో సినిమాలు చేయడానికి తెలుగు, తమిళ భాషల్లో పెద్ద దర్శకులే ఉన్నారు. ప్రాజెక్టుకు ఆమె సై అంటే -ఆమె కోసం కథలు పుట్టించడానికీ రచయితలు రెండు భాషల్లోనూ ఉన్నారు. సెలెక్టెడ్‌గానే సినిమాలు చేస్తున్నా -సూపర్‌స్టార్ ఇమేజ్ మాత్రం అనుష్కవెంటే ఉంది. అనుష్క తాజా ప్రాజెక్టు -సైలెన్స్. బహుభాషా చిత్రమైన సైలెన్స్ -తెలుగులో నిశ్శబ్ధంగా వస్తోంది. అనుష్క రేంజ్‌కు తగ్గట్టే -మణిరత్నం నుంచి పిలుపొచ్చిందట. మణి చిత్రాన్ని ఎవ్వరూ వదులుకోనట్టే -అనుష్క కూడా ఆయనకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేసింది. ఇంతవరకూ కథ బాగానే ఉంది. అయితే, ఓ చిన్న విషయంలో తన వ్యక్తిత్వాన్ని వదలుకోలేక -మణి చిత్రాన్ని అనుష్క వదిలేసుకుందట. ఇదీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్. ఆ చిన్న విషయమేంటంటే -మణి టీంలో లిరిసిస్ట్ వైరముత్తు ఉన్నాడు. అదీ అనుష్క సినిమానుంచి తప్పుకోడానికి కారణమని అంటున్నారు. వైరముత్తు తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ గాయని చిన్మయి ఉద్యమాన్ని లేపటం తెలిసిందే. తొలిసారి ఆమె గొంత విప్పటంతో -బాధితులు ఎంతోమంది వైరముత్తు ఓ ఉన్మాధి అంటూ తమ అనుభవాలను బయటపెట్టారు. వైరముత్తుపై ఆరోపణలకు ఆధారాలు లేకున్నా, చిన్మయి మాత్రం పోరాటం ఆపలేదు. తమిళ ఇండస్ట్రీ పెద్దలు ఆయనకు అండగా నిలవటం అనేక సందర్భాల్లో చర్చకు తావిస్తోంది కూడా. లైంగిక ఆరోపణల ఉద్యమానికి పరోక్షంగా మద్దతు పలుకుతున్న అనుష్క -ఈ కారణంగానే మణిరత్నం సినిమానుంచి తప్పుకున్నట్టు తెలుస్తోంది. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి పనిచేస్తున్న బృందంలో తానుండలేనంటూ మణిరత్నంకు అనుష్క నేరుగా చేప్పేసిందని అంటున్నారు. అనుష్క గొంత విప్పితే తప్ప అసలు నిజం బయటకు పొక్కే అవకాశం లేదు.