Others

తాజాగా త్రిష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సైరా తరువాతి ప్రాజెక్టులో చిరుతో జోడీకట్టే హీరోయిన్ పేరు రోజుకొకటిగా వినిపిస్తోంది. తాజాగా -త్రిషాకృష్ణన్ పేరు తెరపైకి వచ్చింది. టాలీవుడ్, కోలీవుడ్‌లో కొనే్నళ్లు టాప్ హీరోయిన్ స్టేటస్‌ను ఎంజాయ్ చేసింది త్రిష. బక్కపల్చని అందాలతో స్టార్ హీరోలందరి సరసనా మెప్పించింది. తరువాత హారర్, మహిళా ప్రాధాన్య చిత్రాలవైపు దృష్టిపెట్టడం, కొత్త హీరోయిన్ల పోటీముందు నిలబడలేకపోవడంతో -క్రమంగా తెలుగు ఇండస్ట్రీ త్రిష పేరు మర్చిపోయింది. అయితే, తమిళంపై ఫోకస్ పెట్టిన త్రిష, అక్కడింకా టాప్ హీరోయిన్ స్టేటస్‌ని మాత్రం దూరం చేసుకోలేదు. ఇప్పుడు తెలుగులో ఆమెకు వచ్చిన అవకాశంతో మళ్లీ బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం లేదన్న టాక్ వినిపిస్తోంది. చిరంజీవి -కొరటాల ప్రాజెక్టు కోసం చిరుకు జోడీగా త్రిషను ఎంపిక చేసుకున్నారన్నది తాజా టాక్. అక్టోబర్ 2న చిరంజీవి ‘సైరా’ విడుదలవుతోంది. తర్వాత కొరటాల శివతోనే చిరు ప్రాజెక్టు ఉంది. ఇప్పటికే ప్రీప్రొడక్షన్స్ పూర్తి చేసుకుని -చిరు రాకకోసం శివ ఎదురు చూస్తున్నాడు. ఈ ప్రాజెక్టు కోసం చిరుతో జోడీ కట్టేది నయనతార, అనుష్క, ఐశ్వర్యరాయ్, శృతిహాసన్, కాజల్.. ఇలా రకరకాల పేర్లు వినిపిస్తూ వచ్చినా.. తాజాగా తెలుగు స్క్రీన్‌కు చాలాకాలంగా దూరంగావుంటోన్న త్రిషాకృష్ణన్ పేరు వినిపిస్తోంది. ఈ పేరును చిరు ఫైనల్ చేశారన్నది మరో కథనం. షాకింగ్ న్యూసే అయినా, స్టాలిన్ చిత్రంలో చిరుతో మంచి రొమాన్స్ పండించిన త్రిష -గొప్ప చాన్స్ కొట్టినట్టే.