Others

ఉత్సాహంగా డబ్‌స్మాష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వి త్రి ఫిలిమ్స్, సుబ్రమణ్యం మలాసిని ప్రెజెంట్స్ డబ్‌స్మాష్ సాంగ్ సినీ ప్రముఖుల సమక్షంలో విడుదలైంది. ఇండస్ట్రీ లెజెండ్స్ మీద పాట ఉండడం విశేషం. పాటను నిర్మాతలు రాజ్ కందుకూరి, దామోదర్‌ప్రసాద్, రామసత్యనారాయణ విడుదల చేశారు. కార్యక్రమంలో చిత్ర నటీనటులు, టెక్నీషియన్లు పాల్గొన్నారు. నిర్మాత ఓంకారలక్ష్మి మాట్లాడుతూ -నా సోదరుడు సినిమాలో నటిస్తుండటం హ్యాపీ. హ్యాపీడేస్ తరహా సినిమా ఇది అన్నారు. డైరెక్టర్ కేశవ్‌దేవుర్ మాట్లాడుతూ -సినిమా లెజెండ్స్ మీద పాట మా సినిమాలో ఉండటం అదృష్టం. స్టూడెంట్స్ బేస్డ్ సినిమాలను ఆడియన్స్ ఎప్పుడూ ఆదరిస్తున్నారు. డబ్‌స్మాష్‌లో పరిచయమై పాపులరైన జంట కథగా వస్తున్న ఈ చిత్రాన్నీ ఆదరిస్తారన్న నమ్మకంతో ఉన్నాం. హీరో పవన్‌కృష్ణ మాట్లాడుతూ -మంచి సినిమాతో హీరోగా పరిచయమవ్వడం హ్యాపీ అన్నారు. హీరోయిన్ సుప్రజ మాట్లాడుతూ -తిరుపతిలో ఎక్కువ సినిమా చిత్రీకరణ జరిగిందని, అవకాశమిచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు తెలిపారు. నిర్మాత దామోదర్ మాట్లాడుతూ -క్వాలిటీపై ఫోకస్ పెట్టాం. ఆర్టిస్టులు, టెక్నీషియన్ల సహకారంతో మంచి అవుట్‌పుట్ వచ్చింది. సినిమాపై నమ్మకం ఉంది అన్నారు. నిర్మాత రామసత్యనారాయణ మాట్లాడుతూ -ఇటీవల విజయం సాధించిన చిన్న సినిమాల బాటలోనే ఈ సినిమా సైతం విజయం సాధించాలని ఆకాంక్షించారు.