S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
లోకాభిరామం
అతను నేల మీదకు దిగుతాడు. అంటే ఆకాశంలో నుంచి అన్నమాట. అయిదవ అంతస్తులో ఉండేవాళ్లు నేలకన్నా ఆకాశానికి దగ్గరగా ఉంటారన్నది, అనుభవిస్తే గాని అర్థంగాదు. అయిదవ అంతస్తులో ఉంటే ప్రపంచంతో పనిలేదు. కింద అరటిపండ్ల బండి వచ్చిందని, అరుపు కారణంగా తెలుస్తుంది. పైనుంచి అంత అరుపు అదిని బండిని ఆపాలంటే కిందకు వినిపించదు. పై నుంచి చూస్తే పండ్లు బాగానే ఉంటాయి. దిగి చూస్తే నచ్చవేమో?
లాయిరి నడి సంద్రములోన లంగరుతో పనిలేదోయ్, అని చెప్పిన కవి, కుడి, ఎడమయితే ఫరవాలేదన్నాడు. ఎవరయినా ఆ సంగతి గురించి ఆలోచించారా? అందుకు టైమెక్కడండీ, అంటారేమో! తొందరలో పడితే పగలు, రాత్రి తెలియవు. తిండి రుచి తెలియదు. బతుకులో రుచి అంతకన్నా తెలియదు. కానీ, పద్ధతి అది కాదు! ఆలోచిస్తే ఎంతో బాగుంటుంది?
ఎవరు ఎందుక వస్తున్నారు, ఎందుకు, ఎక్కడికి పోతున్నారు తెలియకుండా జనం కదులుతూ ఉంటే ‘జాతర’లాగ ఉంది, అనడం అలవాటు. యాత్ర అనే మాట నుంచి జాతర పుట్టింది.
ఉన్నట్టుండి రవీందర్ ఫోన్ చేసినడు. ‘ఏమిటి సంగతి?’ అంటే అతను ‘పాప ఏడ్చింది’ అనేవాడా లేదా నాకు తెలియదు. గ్రైప్ వాటర్ ప్రకటనల గురించి తెలియని, తెలీని, తెలువని వారికి క్షమాపణలు. ‘ఏం సంగతులు?’ అన్నట్టున్న. ‘ఏం లేదు. ఊరికెనే గుర్తుకు వచ్చినవు’ అన్నడు. ఈ లోకంలో ఊరికెనే మనలను గుర్తుచేసుకుని, పలకరించే వాండ్లు గూడ ఉన్నరు గదా, అని సంతోషమయింది. ఆ సంగతే చెప్పిన. అతను నిజంగనే ఊరికే ఫోన్ చేసినడు.
ఎందుకో తెలియదుగానీ,
గత కొంతకాలంగా నేను ప్రపంచ సాహిత్యంలోని కథా సంకలనాలను చాలా సేకరించి చదువుతున్నాను. నాకు అక్కడక్కడ నిజంగా ఆశ్చర్యకరమయిన రచనలు ఎదురవుతున్నాయి. నా మనసులోని భావాలను అవి బలపరుస్తున్నాయి. ఒకప్పుడు హైదరాబాద్‌లో, సారస్వత
పరిషత్‌లో అనుకుంటాను, జరిగిన ఒక సమావేశానికి వెళ్లడం
గుర్తుకు వస్తున్నది.
ఇద్దరు మిత్రులు చాలాకాలం తరువాత కలిశారు. వాళ్లలో ఒకతను సంచీ చంకన పెట్టుకుని తలవంచుకుని ఫుట్‌పాత్ మీద నడుస్తున్నాడు. మరొకతను పడవలాంటి కారులో ఎదురుగా వచ్చి ఆగాడు. కారు దిగాడు. నడుస్తున్న మనిషిని గమనించాడు. మిత్రుడే అని తేల్చుకున్నాడు. మాట్లాడుకున్నారు. కలిసి కారెక్కి పోతున్నారు కూడా. ‘క్లాస్‌లో మామూలుగా ఉండేవాడివి, ఈ కారు, ఈ వ్యవహారం ఎలా కుదిరింది?’ అమాయకంగా అడిగాడు ఫుట్‌పాత్ మిత్రుడు.
ఉస్మానియా యూనివర్సిటీలో పరిశోధనలో ఉండగా, పనితీరు చిత్రంగా ఉండేది. నిజంగా పని ఉంటే ఏడు గంటలకు ఉదయాన మెస్‌లో నచ్చీనచ్చని నాష్తా అనే టిఫిన్ అనే ఉపాహారం ముగించుకుని, అక్కడి నుంచే నేరుగా ల్యాబ్‌కు వెళ్లిపోయే వాడిని. మధ్యాహ్నం క్యారియర్ అక్కడికే వచ్చేది. అంటే భోజనం ల్యాబ్‌లోనే అని అర్థం. సాయంత్రం ఆరున్నరకు మళ్లీ రాత్రి భోజనాలు మొదలవుతాయి.
నేను వెతికి వెతికి శ్రీరంగం శ్రీనివాసరావు సాహిత్య సర్వస్వంలో నుంచి ఆయన పాత ఛాదస్తం బయటపెట్టే పుస్తకాన్ని ఒకదాన్ని వెతికి తెచ్చుకున్నాను. అందులో శ్రీశ్రీ రాసిన పద్యాలు, పాత పద్ధతి కవితలు, నాటకాలు మొదలయినవన్నీ ఉంటాయి. ఒకప్పుడు ఒకానొక పత్రికవాళ్లు నన్ను సాహిత్య వ్యాసం రాయమన్నారు. అది వానకాలం. కనుక నాకు మబ్బులను గురించి రాస్తే బాగుంటుంది అనిపించింది.
టీవీ వచ్చింది. ‘దూద’ అనే
దూరదర్శన్ ఒకటే ఛానల్. అందులో వచ్చిన సీరియల్స్ కొన్ని బాగుండేవి. కానీ, అన్నీ బాగున్నాయనుకుని చూడడం తప్పలేదు. అక్కడ ‘ముల్లా నస్రుద్దీన్’ అనే పేరుతో ఈ మేధావి మరోసారి ముందుకు వచ్చాడు. అమన్ అల్లానా అనే ఆయన సీరియల్‌ను అందించినట్లు గుర్తు. రఘుబీర్ యాదవ్ అనే కుర్రనటుడు నస్రుద్దీన్‌గా వేశాడు. సీరియల్‌లో జూహ్‌రా సేగాల్ కనిపించినట్టు గుర్తు. కథలు నవ్వించాయి.
‘పల్లె ఒడిని పెరగాను, పక్కకెలా జరిగాను’ అని కవిత రాసుకున్నానా? ఏం కవిత అది? ఎలా జరిగానని నన్ను నేను ప్రశ్నించుకుంటున్నానా? నాలో నేను ఆలోచిస్తున్నానా? నా తలకాయ! తెలిసి తెలిసి పట్నం చేరుకున్నా గదా!