S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లోకాభిరామం

12/19/2015 - 18:33

వసు చరిత్రలో ప్రవరుడికి కొండలలో తిరుగుతూ ఉంటే ఆడమనిషి వాసన తగిలిందట! అదెట్లాగో నాకు అర్థం కాలేదు. ఒకానొక సినిమా పేరు సెంట్ ఆఫ్ ఎ వుమెన్! ఆశ్చర్యమేమంటే ఈ సినిమాలో హీరో లేడు, హీరోయిన్ అంతకన్నాలేదు. ఒక గుడ్డి ముసలతను, ఒక కుర్రవాడు కథను ముందుకు నడిపిస్తారు.

12/12/2015 - 18:30

నాకు భాష మీద, పుస్తకాల మీద తెలియకుండానే ప్రేమ ఉందని మిగతా వాళ్లు చెపుతారు. చిన్నప్పటి నుంచి ఉన్న కొన్ని పుస్తకాలతోనే సతమతమవుతుండేవాడిని. ఇప్పుడు కూడా ఉన్నవి తక్కువే. కానీ, అన్నీ నాకు ఇష్టమయినవి. అసలు నాకు పుస్తకం అంటేనే ఇష్టం. కాగితం మీద అచ్చయిన అక్షరాలంటేనే ఇష్టం. ఈ సంగతి వల్ల అప్పుడప్పుడు పేచీలు కూడా వస్తుంటాయి. కొంతమంది కాగితాలను నలిపి ముద్దచేసి పడేస్తారు. నాకు చచ్చే కోపం వస్తుంది.

12/05/2015 - 18:10

ఈ ప్రపంచంలో శాశ్వతంగా జరిగేది మార్పు ఒక్కటే. ఇటువంటి మాటలను విరోధాభాసం అంటారు. నాకు మార్పు చాలా ఇష్టం. చివరికి వీలయితే ఏడాదికొకసారి ఇల్లు మార్చుకుందామని ఉంటుంది. కానీ అది కుదరదు. కనుక, ఉన్న ఇంట్లోనే పదేళ్లయినా ఉంటున్నాను. నమ్మండి, నమ్మకపోండి, ఈ మధ్యన ఉన్న ఇంట్లోనే నేను నా గదిని మార్చుకున్నాను. అది నా మనస్తత్వం. నా బతుకు కూడా నాకు తగిన అవకాశాలనే ఇచ్చిందనాలి.

11/28/2015 - 16:50

పెళ్ళిళ్ళలో ఒక తంతు జరుగుతుంది. స్నాతకం అని ఒక కార్యక్రమాన్ని జరిపి, బ్రహ్మచారికి గోచీ పెట్టి ధోవతీ కట్టిస్తారు. దారి బత్తెం, పుస్తకాలు, గొడుగు పుచ్చుకుని అతను ఇక కాశీకి వెళతానని బయలుదేరతాడు. కాబోయే బావమరిది అడ్డం వచ్చి మా ఇంటి అల్లుడివి కావయ్యా అని అడుక్కుని పెళ్లిపీటల మీదకు తీసుకుపోతాడు. స్నాతకానికి, పెళ్లికి సంబంధం లేదు. యూనివర్సిటీల్లో జరిగే పట్టా ప్రదాన ఉత్సవాన్ని స్నాతకం అంటారు.

11/21/2015 - 22:15

చచ్చీచెడీ చాయంగల విన్నపములై గయకు చేరుకున్నాము. నేను మా గుంపుతో బయలుదేరడానికి ఇది ముఖ్యమయిన ఆకర్షణ. గతించిన పెద్దల పేరున అక్కడ కొంత కర్మకాండ చేయవచ్చునన్నది ఆ ఆకర్షణలోని వివరం. తల్లిదండ్రుల పట్ల కొడుకు నిర్వహించవలసిన బాధ్యతలుగా ధర్మశాస్త్రంలో మూడు అంశాలను చెప్పారు. వారు బతికి ఉన్నంత కాలం వారి మాట వినాలి. పోయిన తరువాత ఏటా ఒకసారి వారి పేరున అన్నదానం చేయాలి.

Pages