S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

AADIVAVRAM - Others

03/16/2019 - 22:01

చాలామందిలో సృజనాత్మకత ఉంటుంది.
కొంతమందిలో కథలో రాసే నేర్పు, మరి కొంతమంది కవిత్వం రాసే ఉత్సాహం ఇలా ఎన్నో..
బొమ్మలు కావొచ్చు.
పాటలు పాడటం కావొచ్చు.
ఇట్లా ఎన్నైనా చెప్పవచ్చు.
వారిలో వున్న ఉత్సాహాన్ని చాలా మంది తొక్కివేస్తారు. అణచివేస్తారు.

03/16/2019 - 19:59

తెలంగాణలో కాన్వాసుపై కన్నా ముందు సిల్క్ వస్త్రంపై దేశీయ రంగులతో చిత్రాలు గీశారు. రాచరికం రోజుల నుంచి ఈ మాధ్యమంలో చిత్రకళ పరిఢవిల్లింది. ఇప్పటికీ ఆ వారసత్వం హైదరాబాద్ పాత నగరం (ఓల్డ్ సిటీ) దూద్‌బౌలి (పాలబావి) ప్రాంతంలోని ఓ వీధిలో కొంత కనిపిస్తుంది. ఆ వీధి పేరే ‘నక్కాశీగల్లీ’. నాజూకుతనం, నయనానందకరం, సృజనాత్మకత, నాణ్యత, నైపుణ్యం ఆ చిత్రాల్లో దర్శనమిస్తుంది.

03/16/2019 - 19:43

కొత్త మాటలని పుట్టించటం అనేది నేనిప్పుడు కొత్తగా సృష్టించిన ప్రక్రియ ఏమీ కాదు. కొత్త పదాల అవసరం అలా పుట్టుకొస్తూనే ఉంటుంది. ఈ విషయం గురించి నేను ఇది వరలో - వ్యాసాలలోను, బ్లాగులలోను - ఎన్నో కోణాల నుండి చర్చించాను. ఇప్పుడు మరొక కోణం నుండి పరిశీలిద్దాం. ఉదాహరణకి ఈ దిగువ జాబితాలో తెలుగు పేర్లు చూడండి. మిరప, సపోటా, సీతాఫలం, రామాఫలం, బొప్పాయి, జామ, మొక్కజొన్న, పొగాకు, బంగాళాదుంప మొదలైనవి.

03/16/2019 - 19:36

ఎలా లీకయిందో, ఎవరో హెచ్చరించినా ప్రభుత్వం పట్టించుకోలేదన్న వార్త కూడా వ్యాపించింది. ఇదంతా చంద్రకి తలనొప్పిగా తయారైంది. కొందరు శంకరయ్య క్కూడా దోపిడీతో సంబంధం ఉందని గుసగుస లాడుకుంటున్నారు. దీంతో గౌతమి కూడా కృంగిపోయి కొండ దిగడం కూడా మానేసింది.

03/16/2019 - 18:37

‘చిటపట చినుకులు పడుతూ వుంటే
చెలికాడే పక్కన వుంటే
చెట్టాపట్టగ చేతులు కలిపి
చెట్టునీడకై పరుగెడుతుంటే
చెప్పలేని ఆ హాయి ఎంతో
వెచ్చగ ఉంటుందోయి’ అన్నారో
మనసు కవి మనసారా ‘ఆనాడు’
నీడనిచ్చే చెట్టెక్కడుంది?
గొంతు తడిపే చినుకెక్కడుంది?
చెప్పలేని ఆ హాయి ఇంకెక్కడుంది - నీడ
‘్ధనమేరా అన్నిటికీ మూలం’
అన్న భావన నరనరాన నరునికి

03/16/2019 - 18:06

గోడపై కాలాన్ని మోస్తూ
క్యాలెండర్
కాలాన్ని మేస్తూ
గడియారం

* కనె్నతల్లి
కన్నతల్లయింది
చంటి బిడ్డ చేరింది
చెత్తకుండీ ఒడికి

* మూన్నాళ్లుగా వాన
మునకలేసింది
ఊరంతా
అభ్యంగన స్నానం

* ఆత్మాభిమానం ఓడి
ఆకలి గెలిచింది...
ఎంగిలిస్తర్లలో
ఎన్ని రుచులో...!!

03/09/2019 - 22:47

ఈ మధ్య రెండు కొటేషన్స్ చూశాను. అవి బాగా నచ్చాయి. మొదటిది జపాన్ కొటేషన్ - ఏడుసార్లు క్రిందపడినా పర్వాలేదు. ఎనిమిదో సారికి లేచి నిల్చో. రెండవది - కన్ఫూజియస్ చెప్పిన మాట. ‘ఓడిపోయిన ప్రతిసారీ తిరిగి ప్రయత్నం చేయడంలోనే కీర్తి ఉంటుంది.’
ఎన్నో ఉద్యోగాలకి అప్లై చేస్తాం. అవి రావు. ఏడుసార్లు అలా జరిగినా పర్వాలేదు. ఎనిమిదవ సారి విజయం సాధిస్తాం. ఈ ఏడు, ఎనిమిది అనేవి ఉదాహరణలు మాత్రమే.

03/09/2019 - 22:30

చిత్రకారులు తమ చుట్టూ ఉన్న జీవితాన్ని తమ ‘కళ’లో ప్రతిఫలింపజేస్తారు. ఈ లక్షణాన్ని బలంగా జీర్ణించుకున్న కొత్త తరం చిత్రకారుడు రమావత్ శ్రీనివాస్ నాయక్. లంబాడా సామాజిక వర్గం నుంచి వచ్చిన శ్రీనివాస్ నాయక్ లంబాడా మహిళల అందచందాలను, వారి జీవన సౌందర్యాన్ని, ఆహార్యాన్ని, కాన్వాసు పైకి సృజనాత్మకంగా, రసరమ్యంగా అద్దుతున్నారు. అద్భుత నైపుణ్యంతో ఎందరినో ఆకర్షిస్తున్నారు.

03/09/2019 - 22:23

(గత సంచిక తరువాయి)
*

Pages