S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

AADIVAVRAM - Others

09/14/2019 - 19:43

నిజాం సంస్థానంలో తెలంగాణ మొత్తంలో 10వేల 95 గ్రామాలున్నాయి (1941లో). నిజాంలెవరూ తెలుగు భాషను ప్రోత్సహించలేదు. కుతుబుషాహీలు పార్శీని నెత్తిన రుద్దితే వీరు ఉర్దూను నెత్తిన రుద్దారు. 1918లో ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉర్దూ బోధనా భాషగా ఏర్పడ్డ తర్వాత, తెలుగును అణచివేయడానికి అనేక ప్రయత్నాలు జరిగాయి.

09/14/2019 - 19:39

ఆనాటి వీరోచిత కృత్యాల నిజానిజాలను ఎంతో వ్యయప్రయాసలకోర్చి శ్రీ ఖండేరావు కులకర్ణి ఆ విమోచనద్యోమంలోని వెలుగు చూడని వివరాలను వెలికితీసి హిందీ పుస్తక రూపంలో ‘హైదరాబాద్ ముక్తి సంగ్రామం - కొన్ని అజ్ఞాత పుటలు’ పేరుతో తీసుకువచ్చారు. ఈ పుస్తకాన్ని సరళానువాదం చేసి ‘హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర పుటలు’ పేరుతో తెలుగులోకి తీసుకువచ్చారు నిఖిలేశ్వర్. ఇందులో ఇరవైకి పైగా చారిత్రాత్మక గాథలున్నాయి.

09/14/2019 - 18:32

మనల్ని ఎవరో అంచనా వేయడానికి అవకాశం ఇవ్వకూడదు. మనల్ని మనం అంచనా వేసుకుని అడుగు ముందుకు వేస్తూ ఉండాలి. మన విజయం దీనిపైనే ఆధారపడి ఉంటుంది.
ఈ అంచనా విషయంలో మనకు నిజాయితీ ఉండాలి. నిబద్ధత ఉండాలి.
మనల్ని మనం ఏ విధంగా అంచనా వేసుకుంటాం?
మనల్ని మనం ఏ రకంగా క్రమశిక్షణని అలవర్చుకుంటాం?
దీనికి గడిచిన సమయం మొత్తం అవసరం లేదు.
ఒక్క 24 గంటలు చాలు..

,
09/07/2019 - 20:12

ఆమె కుంచె, కలం గొల్లభామలను, మిడతలను, సీతాకోక చిలుకలను సింగారించింది, వాటికి సరికొత్త వనె్నలద్దింది. అలా సింగారించుకున్నవి శృంగారంలో పాల్గొన్న వైనాన్ని కాన్వాసుపై చిత్రీకరించింది. వాటిల్లోనూ ప్రేమ - ప్రణయం, ఆరాధనా భావం అద్భుతంగా ఉంటాయని కళ్లకు కట్టినట్టు ఆమె చూపారు. ఆమె ఎవరో కాదు చిత్రకారిణి గాయత్రి దంతూరి. వాస్తవానికిది సరికొత్త ఊహా ప్రపంచం..

09/07/2019 - 20:06

ఒకొక్కప్పుడు సమీపార్థాలు ఉన్న రెండేసి మాటలని ఒకేసారి తెలిగిస్తే ఉపయుక్తంగా ఉంటుంది.

09/07/2019 - 20:00

మొహరం వేడుకల వివరాలు...
1-9-2019 ఆదివారము - శ్రీ కుళ్ళాయిస్వామివారి ప్రథమ దర్శనము
2-9-2019 సోమవారము - స్వామివారి నిత్యపూజ నివేదిక
3-9-2019 మంగళవారము - స్వామివారి అగ్నిగుండము ఏర్పాటు
4-9-2019 బుధవారము - స్వామివారిని చావిడిలో నిలుపుట
5-9-2019 గురువారము - స్వామివారి నిత్యపూజ నివేదన
6-9-2019 శుక్రవారము - స్వామివారి ఐదవ సరిగెత్తు

,
09/07/2019 - 19:09

తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లా (ఉమ్మడి వరంగల్ జిల్లా) వెంకటాపురం మండలంలోని పాలంపేటలోని కాకతీయుల శిల్పకళకు కలికితురాయి అపురూప శిల్ప కళావైభవశాల రామప్ప దేవాలయాన్ని యునెస్కో గుర్తిస్తే దానికి మహర్దశ పట్టనున్నట్లు తెలుస్తోంది.
యునెస్కో అంటే ఏమిటి?

09/07/2019 - 19:00

చిగురాకులలో చిలకమ్మవని.. మరుమల్లెలలో మకరందమని..
నువ్వు వస్తావని మనసిస్తావని కలలు కలలుగా
నేగని.. కథలు కథలుగా నే విని..
నిదురపోకుంటిని నీ రాకకై నే వేచి ఉంటిని..
నే కాటుకనై నీ కళ్లనంటుకుని
నే పమిటనై నీ నడుము నంటుకుని
కెంజాయలో విరిసే సంపెంగలో
విరిమల్లెలో విరజాజిలో పువ్వై నవ్వై
నిదురపోకుంటిని.. నీ రాకకై
నే వేచి ఉంటిని

09/07/2019 - 18:36

మైదానమంతా
దుక్కి దున్ని
ఉన్న సారాన్నంతా
పిండేసారు

కొండలూ గుట్టలూ
తొలిచి తొలిచి
నేలమట్టం చేసేశారు

అడవిపై కనే్నశారు
జనం గొంతు పెగలనీయక
ఉన్న ఫలానా ఉరికిస్తున్నారు

09/07/2019 - 18:27

అణువంత
అనురాగం కోసం
ఆకాశమంత
ఆరాటంతో అలమటించి
ఓదార్పు కరువై ఒంటరినై
నేనేమిటో నాకే తెలియక
అక్షరాలలో అనే్వషించి
ఆ అక్షరాలతోనే ఆడుకొని
అనుభూతులను ఆస్వాదించి
భావాలకు రూపమిచ్చి
అందమైన పదాలుగా
మీకందిస్తే
అలవికాని అనురాగాన్ని
మీరు చూపిస్తే
అనుభవించిన ఆనందాన్ని
ఎలా తెలుపను?
ఒక్క కన్నీటి చుక్కను

Pages