S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

AADIVAVRAM - Others

03/09/2020 - 23:44

ప్రతీ వ్యక్తి తన జీవితంలో ఏదో సాధించాలని అనుకుంటాడు.
ఆ విధంగా అనుకోవాలి కూడా.
అవి చాలా పెద్దవి కావొచ్చు.
ఎదుటివాళ్ల దృష్టిలో అసాధ్యమైనవి కూడా కావొచ్చు.
ప్రతీదానికి సమయం ఉంటుంది.
గద్ద విషయం తీసుకుందాం.. గూడు నుంచి బయటకు పిల్లగద్ద తల్లి మాదిరిగా చిన్న పంది పిల్లను ఎత్తుకొని వెళ్లగలదా?
కష్టం.. సాధ్యం కాదు..

03/09/2020 - 23:34

కంప్యూటర్
వైరస్‌ని
మైక్రోస్కోప్‌తో
చూసే మహారాజులు

ఆధునిక యుగంలో
భయాన్ని
నూరిపోస్తూ
ప్రసంగాల హోరు

సందు దొరికితే
మంది తిండిపై
ఏడ్చే హ్రస్వ దృష్టిగాళ్లు

ఏ తిండిలో
ఏమున్నాయో ఎంతెంతపాలున్నాయో
ప్రొటీన్లు విటమిన్లు
ఎరుగని మహాసభాశీనులు

రాజ్యం నిండా
కరోనా విగ్రహాల పూజలు షురూ
మతరాజ్య హుంకారం

03/09/2020 - 23:29

నీకు నాకు మధ్య మాటల యుద్ధం ఎందుకు?
మనకూ మనసుకూ మధ్య రాతిగోడల గురించి చేర్చించుకుందాం!
ఘనీభవించిన శిలాజాలు
గుండె పాత్రలో ఉడికిపోతున్న
విభిన్న ఆమ్లాలు!
టెస్ట్‌ట్యూబ్‌ల నిండా పరీక్షలకు
ఎదురుచూస్తున్న యెర్ర, తెల్ల కణాలు
మళ్ళా మళ్ళా మనదే వంతు
క్షణ క్షణం మారుతున్న తంతు! ఎక్కడుందని వెతుకుతావు రచ్చబండ?
కరిగిపోతోంది నీ నా గుండె కండ!

03/09/2020 - 23:22

నా మదిలో పదిలపరచిన నీ జ్ఞాపకాలన్నీ,
పరులకు పంచక ఒక మూటగా కట్టి,
నిను వెతుకుతూ బయలుదేరిన నాకు..
ఎదురొచ్చిన ఓ నెచ్చెలి

,
03/08/2020 - 23:55

లేపాక్షి.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో ఉన్న ఓ చిన్న ఊరు. ఎన్నో చారిత్రక ఘట్టాలను తనలో ఇముడ్చుకున్న గ్రామం. భారతీయ శిల్ప కళా నైపుణ్యం, అపురూపమైన చిత్రకళల భాండాగారం. ఇక్కడున్న వీరభద్ర ఆలయం శిల్పకళా సంపదకు పెట్టింది పేరు. అక్కడి దుర్గాదేవి అమ్మ వారు విశేష ఆకృతిలో కొలువుదీరి ఉంది.

03/08/2020 - 23:47

రాజ్యాంగం అందరికీ ముఖ్యమైనది కాబట్టి, ఈ పుస్తకంలోని సమాచారం ప్రజలకు అమూల్యమైనదని మేము నమ్ముతున్నాము.
రచయితలు, వారిలో చాలామంది సుప్రీం కోర్టు మరియు హైకోర్టులలో న్యాయవాదులు. వారిలో ఒకరు శాసనసభ్యుడు. మేము రచయితల పరిచయంతో ప్రారంభిస్తాము. తరువాత ప్రభుత్వ అధికారులు మరియు అకాడమీలోని వ్యక్తుల పుస్తక సమీక్షలు ప్రచురిస్తాము.
-ఎడిటర్
*

03/08/2020 - 23:46

తీరానికి ఆవల ప్రాంతంలోంచి
తెలియని దేశంలోంచి
అప్పుడప్పుడూ..
అలలపై తేలియాడుతూ
కలల కాగితమొకటి కొట్టుకొస్తుంది.
పూల రెమ్మలా విచ్చుకుంటూ
మడత మడతలోనూ
మధుర సౌరభాలను వెదజల్లుతూ
మాటల కందని మానవీయ పార్శ్వాల్ని
మహత్తరంగా ఆవిష్కరిస్తుంది
తీరానికి ఆవలి ప్రాంతం..
కంటి ముందు కల్లోల సంద్రం..
అప్పుడప్పుడూ..

03/08/2020 - 23:42

పండగల ప్రాదుర్భావానికి మూడు ముఖ్య కారణాలుగా కనిపిస్తాయి. ఒకటి మహాపురుషుల జన్మదినాలు. రెండవది గొప్ప సంఘటనలకు స్మృతి చిహ్నాలుగా జరుపుకునేవి. మూడవది రుతువులను బట్టి నిర్వర్తించుకునేవి. హోళి రుతుసంబంధ పర్వం. ప్రత్యేకించి వసంత రుతువుకు సంబంధించిన పండగ. మాఘమాసపు కృష్ణపక్ష పంచమి, అంటే వసంత పంచమి దినాలకే, వసంతరుతువు లక్షణాలు పొడసూపుతాయి. కాగా ఫాల్గుణ పూర్ణిమ నాటికి అవి మరింత ప్రస్ఫుటమవుతాయి.

03/08/2020 - 23:38

తెలుగు వారి పెద్ద పండుగ సంక్రాంతి. ఆ పండుగ సందర్భంగా అలంకరించిన గంగిరెద్దులు ఇళ్ల ముందుకు రావడం శోభాయమానంగా ఉంటుంది. చిత్రకారుడు రేవులపల్లి బాలాచారి ఆ గంగిరెద్దుపై మొత్తం సంక్రాంతి పండుగ విశేషాలను పొందుపరచి తన సృజనను చాటుకున్నారు. తెల్లని ఎద్దును కాన్వాసుగా భావించి పండుగ వాతావరణమంతా అందంగా చిత్రీకరించి ఆకట్టుకున్నారు.

03/01/2020 - 23:34

మన ప్రణాళిక ప్రకారం మన జీవితం గడువకపోవచ్చు.
మనం చేస్తున్న ఉద్యోగంలో అవాంతరాలు రావొచ్చు.
మిత్రులు దూరం కావొచ్చు.
సన్నిహితులు అనారోగ్యానికి దరి కావొచ్చు.
వ్యాపారంలో నష్టాలు రావొచ్చు.
మనం కోరుకున్న అమ్మాయిని మరెవరో వివాహం చేసుకోవచ్చు.
మనకు రావల్సిన ఉద్యోగం మరొకరికి రావొచ్చు.
మనకు రావల్సిన కాంట్రాక్టును మరొకరు తన్నుకుపోవచ్చు.

Pages