S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ప్లాన్ ‘బి’

మన ప్రణాళిక ప్రకారం మన జీవితం గడువకపోవచ్చు.
మనం చేస్తున్న ఉద్యోగంలో అవాంతరాలు రావొచ్చు.
మిత్రులు దూరం కావొచ్చు.
సన్నిహితులు అనారోగ్యానికి దరి కావొచ్చు.
వ్యాపారంలో నష్టాలు రావొచ్చు.
మనం కోరుకున్న అమ్మాయిని మరెవరో వివాహం చేసుకోవచ్చు.
మనకు రావల్సిన ఉద్యోగం మరొకరికి రావొచ్చు.
మనకు రావల్సిన కాంట్రాక్టును మరొకరు తన్నుకుపోవచ్చు.
మనం వేసుకున్న ప్రణాళిక ప్రకారం పనులు జరుగకపోవచ్చు.
మనం అనుకున్న దానికి భిన్నంగా జరగవచ్చు.
ఏం చేద్దాం?
అలాగే వదిలేద్దామా?
మన దురదృష్టాన్ని తిట్టుకుంటూ కాలం గడుపుతామా?
ఏం చేద్దాం?
కొత్త సవాళ్లని ఎదుర్కొంటాం.
కొత్త లక్ష్యాలను నిర్దేశించుకుందాం.
ప్లాన్ ‘ఎ’ అమలు జరుగకపోతే
ప్లాన్ ‘బి’ని అమలుపరచాలి.
అది ఏమవుతుందా?
చూద్దాం!
ప్లాన్ ‘సి’ అవసరం పడకపోవచ్చు.

మంగారి రాజేందర్ ‘జింబో’ 94404 83001