S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాసిలి వాకిలి

03/21/2020 - 23:55

సూర్య గురులు శుభగ్రహాలు. పారదర్శక గ్రహాలు. శుద్ధ గ్రహాలు. అంటే అశుద్ధతకు అవకాశమివ్వని గ్రహాలు. ఒకవిధంగా ఈ రెండు గ్రహాలను పవిత్ర గ్రహాలుగాను పరిగణిస్తున్నాం. ఇక్కడ పవిత్రం అంటే అపవిత్రతకు తావులేని గ్రహాలని అర్థం. పైగా సూర్య గురులు మంచి స్నేహితులు. అంటే సఖ్య గ్రహాలు. ఈ కారణంగా సూర్య గురులు యోగ కారకులు. అంటే యోగ సాధకులకు, ధ్యానులకు హితులు, అనుకూలురు.

03/15/2020 - 23:31

సూర్యుడు అన్న వెంటనే మన కళ్ల ముందుకొచ్చేది సౌర కుటుంబం. భగభగ మండే అగ్ని గోళం మన ముందు కదలాడుతుంది. ఇంకా చెప్పుకోవాలంటే సూర్యోదయాలు, సూర్యాస్తమయాలు, సూర్యగ్రహణాలు మన ముందు నిలుస్తాయి. ప్రాతః సంధ్యన భానోదయ రేఖలు, సాయం సంధ్యన ఆకాశం నుండి భూమిలోకి జారిపోతున్న కెంజాయ రంగు సూర్యగోళం నేత్రానందంగా కనుపాపలలో మెదలుతుంది.

03/09/2020 - 00:03

మాస్టర్ సి.వి.వి. ఆవిష్కరించిన ‘‘్భృక్త రహిత తారకరాజ యోగం’’ అంటేనే సంపూర్ణంగా ‘డైరెక్ట్ లింక్’. అంటే విశ్వంలోని ఏ అంశతోనైనా మాస్టర్ యోగసాధన ద్వారా ప్రత్యక్ష సంబంధ బంధాలే తప్ప ఎటువంటి డొంక తిరుగుడు వ్యవహారాలకు, షార్ట్ కట్స్‌కి అవకాశం లేదు. అందుకే మాస్టర్ యోగాన్ని ‘డైరెక్ట్ లైన్’ అనీ అంటుంటాం.
* * *

03/01/2020 - 22:58

‘ఆది’లో శుద్ధంగా ఉన్న ‘అంశ’ ప్రాణ మండలం నుండి సృష్టికి సమాయత్తమవుతుంది. ఆ పరిణామంలో తొలిగా కాంతి, కాల ప్రమేయాలతో భూమండలం వైపుగా తన ప్రయాణం ప్రారంభిస్తుంది. అంటే మానవరూపాన్ని సంతరించుకునే దిశగా ప్రాణ అంశ కాలమానానికి లోబడిన అంశగా పరిణమిస్తుంది. ఇక్కడే మానవ ఆయుష్షు అనేది నిర్ణయమైపోతోంది. ఇక్కడి నుండి ప్రాణాంశ జ్యోతిర్మండలాన్ని చేరుకుని తేజస్సును తోడు తెచ్చుకుంటోంది.

02/23/2020 - 23:05

శని గ్రహంతో మనం స్నేహంగా ఉండాలనుకుంటున్నాం సరే... మరి శని గ్రహం కూడా మనతో స్నేహించాలని అనుకుంటుండాలి కదా! స్నేహానికి కావాల్సింది రెండువైపుల నుండి సమాన స్పందన. కాబట్టి స్నేహించాలని మనం అనుకుంటే సరిపోదు.. శని కూడా మనతో స్నేహించాలని అనుకోవాలి. సామాన్యంగా స్నేహానికి కావల్సిన లక్షణాలు మనలో కొన్ని ఉండాలి. శనిలోను కొన్ని ఉండాలి. అప్పుడే ఇద్దరి మధ్యా స్నేహం నెలకొంటుంది.

02/16/2020 - 22:40

చీకటి వెలుగుల సంయోగ గ్రహం శని. కాబట్టే యోగ సాధకులమైన మనం శనిగ్రహంతో స్నేహించే విషయంలో అత్యంత పట్టుదలతో సాధన సాగించవలసి ఉంటుంది. భౌతికం నుండి దృష్టి మరలితేనే శని విషయంలో సాధన మునుముందుకు సాగేది. భౌతిక ఒత్తిడులకు తలవంచకుండా తల ఎత్తుకు తిరగగలిగితేనే శని యోగ సాధనలో మనకు చేరువ అయ్యేది.

02/09/2020 - 23:23

...కాలం గుప్పిట్లోకి జారుకోకూడదు...
శని అంటే కాలానికి కళ్లెం వేసేవాడు... కాలాన్ని దాటిన వాడు. అందుకే కాలాతీతం కావాలనుకునే యోగులకు శని ఆప్తుడు. శనిని సాధనతో స్నేహించగలిగితే కాలజ్ఞానం యోగుల సొంతమే. అంటే యోగ సాధకులు కాలజ్ఞానులైపోవటమే.

02/02/2020 - 22:11

మన జీవిత ప్రయాణం పనె్నండు రాశుల మధ్య సాగుతుంటుంది. ఒక్కో గ్రహం ఒక్కో రీతిన ఒక్కో రాశిలో ప్రయాణిస్తుంటుంది. అంటే వాటి ప్రయాణ కాలంలో మార్పు అన్న మాట. చంద్రుడి ప్రయాణకాలం ఒక్క నెల మాత్రమే అయితే సూర్యుడిది సంవత్సర కాలం. అంగారకుడు రెండేళ్లు ప్రయాణం కొనసాగిస్తుంటే బృహ్పతికి పనె్నండేళ్లు కావాలి. ఇక, శనికయితే దాదాపు ఇరవై ఎనిమిదేళ్లు. అంటే సగం జీవితమో, మూడో వంతు జీవితమో శని ప్రభావంతోనే సాగుతుంది.

01/19/2020 - 22:43

నాకూ మీకూ మధ్య దూరం ఎంతయినా కావచ్చు.. సాన్నిహిత్యం ఎంతయినా కావొచ్చు.. ఇలా దూరం, సాన్నిహిత్యాలే కాక అనేక అంశాలు వివిధ సందర్భాలలో వివిధ రకాలుగా సంయోగం చెంది మనపై ప్రభావం చూపుతుంటాయి. నాపైన మీ ప్రభావం ఉన్నట్టుగానే, మనపై భూగోళ ప్రభావం, భూగోళంపై ఇతర గోళాల ప్రభావమూ ఉంటున్న సంగతి మనందరికీ తెలిసిందే..

01/12/2020 - 23:18

‘ఆరిజన్ ఒన్’ నుండి ఉనికిలోకి వచ్చిన మనం కానీ, ఏ ఇతర అంశాలు కానీ రూపంలోను, లక్షణాలలోను, వర్తనంలోను, వికసనంలోను మార్పులకు లోనవుతూనే ఉన్నాయి. ఇలా మార్పులు చెందుతున్న మనం కానీ, మనతోపాటు సృష్టిలో భాగస్వాములైన ఏ ఇతర అంశాలు కానీ ‘ఆరిజన్ సెకండ్’ క్రింద లెక్క. అంటే మార్పు చెందుతున్న సృష్టి అంశాలు మార్పు చెందకుండా ‘ఆరిజన్ ఒన్’లా స్థిరంగా ఉండగలగాలి.

Pages