S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాసిలి వాకిలి

10/20/2018 - 19:19

నేను-
ఒక వర్తమాన చిరునామా!
ఒక శాశ్వత చిరునామా!
వర్తమానం ఒక రూపావిష్కరణ.. భౌతికం.
శాశ్వతం ఒక అరూపావిష్కరణ.. అధిభౌతికం.
భౌతిక చిరునామా దేహానిది, మనసుది.
అధిభౌతిక చిరునామా దేహాతీతం, మానసాతీతం.
అసలు -
వర్తమాన చిరునామా జనన మరణాల మధ్యన.
శాశ్వత చిరునామా మరణ జననాల మధ్యన.

09/29/2018 - 19:23

నేను...
భూగ్రహం పైన ఒక పటిష్టమైన జీవ వ్యవస్థను.
నేను...
జీవ వ్యవస్థలోనే గరిష్ఠమైన జీవన వ్యవస్థను.
నేను-
మానవ అస్తిత్వంలా అనిపించే విశ్వ వ్యవస్థను.
జీవన ప్రయాణంలో అవస్థల మాటున దాగిన జీవ వ్యవస్థను.
ప్రతీ క్షణం కణం కణం సంయోగించే మానవ వ్యవస్థను.

09/15/2018 - 19:35

‘నేను’
- నిన్నటిదాకా త్రీడైమెన్షనల్!
- నేడు ఫోర్త్ డైమెన్షనల్!!
రూపం ‘అరూపం’ అవుతూ ‘అపురూపం’ అయ్యే స్థితే ఈ ఫోర్త్ డైమెన్షన్. భౌతికంలో ఉంటూ అభౌతికం అయ్యే స్థితి ఫోర్త్ డైమెన్షన్.
ఈ ఫోర్త్ డైమెన్షన్ సాధ్యమయ్యేది ధ్యాన మార్గంలో.

09/08/2018 - 19:13

నేను..
కణం, కణం.. + క్షణం, క్షణం..
నేను కణం క్షణం + క్షణం కణం
నేను
- ఆకాశంలోని నక్షత్రాలను లెక్కించలేను!
- దేహంలోని కణాల సంఖ్యనూ చెప్పలేను!
- జీవితకాలాన్నీ క్షణాలలోకి తర్జుమా చేయలేను!!
ఇలా ‘నేను’ది వాస్తవానికి ఉజ్జాయింపుల పర్వం. అయినా-
‘నేను’ మూడు వందల కోట్ల క్షణాలను ఒక జీవిత కాలంలో వొడిసి పట్టుకుంటానని ఒక లెక్క.

08/14/2018 - 18:52

నేను
కొందరికి పెద్ద ప్రశ్న.. చిరు సమాధానం
ఇంకొందరికి చిన్న ప్రశ్న.. పెను సమాధానం
మరి కొందరికి ప్రశ్నా కాదు, సమాధానమూ కాదు
... పరిశోధన, నిరంతర శోధన.
ఈ శోధన బహిర్గతమూ, అంతర్గతమూను.
పరిశోధనకు కనిపించేదంతా వేదికనే.. అయితే కనిపించని అంతరంగమే శోధనకు పీఠిక.
అగుపించే విశ్వమంతా ప్రయోగశాలనే పరిశోధనకు.
అగుపించని విశ్వమూలాలన్నీ యోగభూమికలే శోధనకు.

08/14/2018 - 18:47

నేను..
జీవం + ప్రాణం + చైతన్యం
జీవ ప్రాణ చైతన్య సంయోగమే జీవితం.
జీవం ఉన్నంతవరకు, ప్రాణం ఉన్నంతవరకు, చైతన్యం ఉన్నంత వరకు నేను దేహమే.. ఈ దేహానిదే జీవితం. జీవ ప్రాణ చైతన్యాలు ఈ దేహం నుండి తప్పుకుంటే శరీరం శవమే అవుతుంది. ‘నేను’ మాత్రం ‘మాస్టర్’ అవుతుంది.
* * *
జీవం కోల్పోవటమే నిర్జీవం.. అదే మరణం. ఆ మరణానికి రూపమే శవం.

08/14/2018 - 18:41

నేను...
దృశ్య, అదృశ్య మేలు కలయికను.
భౌతికమంతా విజిబుల్.. అధిభౌతికమంతా ఇన్విజిబుల్.
దృశ్య సౌందర్యానికి పదార్థ వనరులే మూలం.. అదృశ్య అందాలకు పదార్థేతర అంశలే భూమిక.

08/14/2018 - 18:40

నేను..
విశ్వ ప్రతీకను.
చారిత్రక పరిణామ ప్రతిమను.
అస్తిత్వ ఆరాట పటిమను.
వెరసి... వైయక్తిక సంస్కృతీ పరిణామ ప్రతిబింబాన్ని.
అయినా.. అన్ని వ్యవస్థలలోను ఇండిపెనె్డన్ట్.
ఈనాటి పరిభాషలో-
నేను - Man - is the measure of all things అన్నిటికీ కొలమానాన్ని.

Pages