S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
వీక్లీ సీరియల్
తీశ్మార్ గొంతులో నుంచి క్షుద్ర మంత్రాలు ఆ స్మశాన ప్రాంతంలో ప్రతిధ్వనిస్తున్నాయి.
తీశ్మార్ లేచాడు.. అతని చేతిలో మంత్రదండం లాంటిది ఉంది.. దాని పిడిభాగం పుర్రె గుర్తు ఉంది.
దానిని చంద్రకళ తల మీద పెట్టి
కారు వెళ్తోంది. భార్గవి సమీర్ వంక చూసి అడిగింది.
‘శివప్రసాద్ వర్మ ఎక్కడున్నాడో కచ్చితంగా తెలిసినట్టే కదా?’
శివప్రసాద్ వర్మ ఎక్కడున్నాడో చెప్పాడు సమీర్.
‘అక్కడా? పెద్ద కోటీశ్వరుడు.. అలాంటి హోటల్లో?’
సిఐ దుర్జన్‌కుమార్ ఎట్టకేలకు నోరు విప్పారు. తాను నోరు విప్పకపోతే తన నోరు శాశ్వతంగా మూతపడుతుందన్న భయం అతనిలో మొదలైంది. ఎప్పుడైతే భయం మనిషిలో మొదలవుతుందో అప్పుడే మనిషిలో మార్పు మొదలవుతుంది. ఆ మార్పు ఎలాంటిదైనా కావచ్చు. ముందు డబ్బు కావాలనుకున్నాడు. డబ్బు కావాలా? నిజాయితీగా డ్యూటీ చేయడం కావాలా? అన్న ప్రశ్నకు డబ్బే ముఖ్యం అనుకున్నాడు.. నిజాయితీని అమ్ముకున్నాడు.
‘కనిపిస్తారు. కానీ మీరు కొద్దిగా ఓపిక పట్టాలి. మీ వారు వచ్చాక వెంటనే మా గురించి చెప్పకూడదు’ చెప్పాడు సమీర్.
‘ఎందుకు?’ అనుమానంగా ప్రశ్నించింది చంద్రకళ.
‘మేము తనకు బాగా పరిచయం లేము కదా.. భయంతో వెళ్లిపోవచ్చు’ చెప్పాడు సమీర్.
కొద్దిగా కన్విన్స్ అయినట్టు మొహం పెట్టి సరేనన్నట్టు తలూపింది.
సమీర్ చంద్రలేఖ చెబుతున్నది వింటున్నాడు. భార్గవి ఒక విధమైన షాక్‌లో వున్నది. చెబుతున్నది తన స్నేహితురాలు.. ఒక క్రిమినాలజీ చదివిన వ్యక్తి. కానీ ఎక్కడో లాజిక్ మిస్సవుతోంది.
ఆ లాజిక్‌ను వెతుకుతున్నాడు సమీర్.
‘నేను చెప్పింది మీరు నమ్మట్లేదు కదూ’ చిన్న అనుమానంతో అడిగింది చంద్రలేఖ.
డిసిపి అవినాష్ క్రైమ్ సీన్ ప్రదేశాన్ని నిశితంగా పరిశీలించాడు. డార్క్ అవెన్యూ వైపు చూశాడు. స్మశానంలో కాలుతోన్న చితిలా వుంది ఆ ఇల్లు.
అటువైపు అడుగులు వేశాడు.. మీడియా కూడా అటువైపు పరుగులు పెట్టింది. సరిగ్గా అప్పుడే అక్కడికి ఓ క్యాబ్ వచ్చి ఆగింది. అందులో నుంచి సమీర్ భార్గవి దిగారు. అక్కడ వున్న హడావుడిని చూశారు. అంబులెన్స్‌లోకి దుర్జన్‌కుమార్‌ను స్ట్రెచర్ మీద ఎక్కిస్తున్నారు.
ఆ క్షణం పావని దగ్గర కూడా సమాధానం లేదు. ఏ మాత్రం ఊహించని సంఘటన జరిగింది. ఎలా రియాక్ట్ కావాలో కూడా తెలియడంలేదు.
‘నాకూ ఏమీ తోచడం లేదు. ఇంకా భయం తగ్గనే లేదు. అమ్మ ఎక్కడ భయపడుతుందేమోనని భయాన్ని అణచిపెట్టుకున్నాను’ చెప్పింది పావని.
శకుని కొడుకుని అక్కున చేర్చుకుని ఆశీర్వదించాడు. అతని మొహంలో దిగుల్లాంటిదేం లేదు. కొడుక్కి ధైర్యం కలిగించేలా కొన్ని ఉపమానాలు చెప్పి నవ్వించాడు. బిక్కమొహంతో చూస్తున్న గౌతమి దగ్గరగా వచ్చి-