వీక్లీ సీరియల్
ట్వింకిల్ ట్వింకిల్ వండర్ స్టార్!! -12
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
‘‘సరే. మీ ఇష్టం. మీరెలా అంటే అలాగే కానివ్వండి. బ్యాంక్ అభివృద్ధికి మీతో పాటు నేనూ పాల్పంచుకోవడానికి సంసిద్ధమే!’’ అన్నాడు మనస్ఫూర్తిగా.
‘‘్థంక్స్’’ చెప్పాడు పాండవీయం.
‘‘మిమ్మల్ని కలిశాక నాకు కొన్ని కొత్త విషయాలు తెలిశాయి. బ్యాంక్ గురించి విస్తృతంగా ప్రచారం జరగాలని! దీనికి సంబంధించి ఒక ప్రణాళిక కూడా సిద్ధం చేశాం. ఈలోగా బ్యాంక్‌కి అనుకూలంగా అధికారుల నుండి కొన్ని ప్రకటనలు ఇప్పించాలనే యోచన కూడా ఉంది. ఇవి పూర్తయ్యాక మీ కొలీగ్స్ వెంటపడదాం’’ తన ఆలోనచలో చెప్పాడు పాండవీయం.
‘‘యాజ్ యూ లైక్! ఈలోగా మా వాడి పేర త్వరలో కొంత ఎవౌంట్‌ని మీ బ్యాంక్‌లో డిపాజిట్ చేస్తాను.’’ మాటిచ్చాడు వసంత్.
‘‘ఓకే! ఇందాకటి నుండి మరిచిపోయాను. మీ వాడు అఖిల్ కనిపించడం లేదు. ఎక్కడికి వెళ్లాడు.’’
‘‘ఇంట్లో ఖాళీగా ఉంటే మా బుర్ర తినేస్తున్నాడు. అందుకే టీచర్ బుర్ర తినమని ట్యూషన్ పెట్టాం. రోజూ సాయంత్రం వెళ్తున్నాడు’’ నవ్వుతూ.
‘‘అదేం లేదన్నయ్యగారూ! వాడి క్లాసుకి కొత్తమ్మాయి వచ్చిందట. ఆమె ఫస్ట్ వస్తుందట. అందుకని ట్యూషన్ పెట్టమని తనే అడిగాడు.’’
తను తెచ్చిన ప్లేట్లని వాళ్ల ముందున్న టీపాయ్ మీద సర్దుతూ చెప్పింది నివేదిత.
‘‘ఈ రోజు ఇంటికి తీసుకెళ్లి రేపు స్కూల్ టైమ్‌కి తీసుకువద్దామనుకున్నాను. వాడ్ని చూసి చాల్రోజులయ్యింది. ప్రణిత కూడా ఖుషీ అయ్యేది.’’ అన్నాడు పాండవీయం.
‘‘ఖుషీ కాదు. ఖూనీ అయ్యేది. వాడి గురించి మీకు తెలీదులెండి. ఈమధ్య మహా అల్లరి చేస్తున్నాడు’’ టిఫిన్ ప్లేట్ అందిస్తూ అంది.
‘‘అది సరే గానీ ఇప్పుడివన్నీ ఎందుకు?’’ ప్లేట్ వంక చూస్తూ ఇబ్బందిగా అడిగాడు పాండవీయం.
‘‘మీ కొరకు కాదులెండి. మా దయ్యానికి భయపడి ఇవన్నీ చేశాను. మీరు మా ఇంటికి వచ్చారని దానికి తెలిసి మా ఆయన్ని కాఫీ, టీలతో పంపించావేంటని చీవాట్లు పెట్టకుండా ఉండడానికి’’ చెప్పింది నివేదిత.
‘‘అంటే మీ అన్నయ్యగారి మీదో, నా మీద అభిమానం కొద్దీ కాదన్న మాట’’ వసంత్ కల్పించుకుంటూ భార్యకి చురక అంటించాడు.
ఏమీ మాట్లాడలేదామె.
‘‘అలా అయితే మేం టిఫిన్ నిరాకరణోద్యమం చేపడుతున్నాం’’ తిరిగి వసంత్ అన్నాడు.
‘‘దీన్ని నేను బలపరుస్తున్నాను’’ వంత పాడాడు పాండవీయం.
అప్పుడు రియాక్టయ్యింది నివేదిత.
‘‘అయ్యో! నేనేదైనా పొరపాటుగా మాట్లాడితే క్షమించండి. తినండి’’ అంది.
వాళ్లు తినకపోయేసరికి ‘‘సారీ చెబుతున్నాగా! మరో మాట లేకుండా ఈ టిఫిన్స్ పూర్తి చేయండి’’ అంటూ రెండు చేతులూ జోడించింది.
‘‘అయితే ఇందుకు పనిష్‌మెంట్‌గా ఈ రోజు రాత్రికి ముగ్గురికీ మీల్స్ రెడీ చేయాల్సి ఉంటుంది’’ అన్నాడు వసంత్.
‘‘శిరసా వహిస్తాను’’ అందామె.
‘‘అమ్మో! వద్దులెండి. ఎరక్కపోయి నోరు జారాను.’’ ఇప్పటికి నన్ను వదిలేయండి’’ అన్నాడు పాండవీయం బిగ్గరగా నవ్వుతూ.
అతనితో పాటు మిగతా ఇద్దరూ శృతి కలిపారు.
కానీ-
వసంత్‌తో తన సమావేశం ఓ అనుహ్యమైన మలుపుకు దారి తీయబోతోందని...
తనకి తెలియకుండానే మనీ మనీ బ్యాంక్ మానేజర్‌గా తన లక్ష్యం నెరవెరబోతోందని...
పాండవీయానికి క్షణంలో తెలీదు.
అలా పావులు కదిపే ఘడియకి అత్యంత వేగంగా శ్రీకారం చుట్టబడింది.
9
పోలీస్ జీప్ నగర వీధుల్లో రొటీన్‌గా పెట్రోలింగ్ జరుపుతోంది. ఆలోచనల్లో ఉన్న యస్సై వేదవ్యాస్ దృష్టి సడెన్‌గా ఒక బోర్డుపై పడింది. వెంటనే జీప్‌ని రివర్స్ తీసుకొమ్మని చెప్పాడు డ్రైవర్‌కి.
డ్రైవర్ జీప్‌ని వెనక్కి తీసుకెళ్లాక తన కళ్లబడిన బోర్డుకి ఎదురుగా రోడ్‌కి, అవతలవైపున పార్కింగ్ ప్లేస్‌లో జీప్‌ని స్టాండింగ్ చేయించాడు. షాప్‌కి తగిలించబడిన బోర్డ్ వైపు దృష్టి సారించాడు.
వేద భృకుటి ముడిపడింది.
‘‘గృహలక్ష్మీ ఏజెన్సీస్. సగం దరలకే గృహోపకరణాలు’’ అనే పెద్ద పెద్ద అక్షరాలు ఆకర్షణీయంగా రాయబడి చూపరులని ఇట్టే ఆకర్షించేలా ఉన్నాయి.
ఆ అక్షరాల్ని మరోసారి చదువుతూ ఉలిక్కిపడ్డాడు.
ఎక్కడో... ఎప్పుడో విన్నట్టనిపించిందా మ్యాటర్. కాసేపు ఆలోచనల్లో పడ్డాడతను. అయితే గుర్తుకు రాలేదు. వెంటనే హెడ్‌కానిస్టేబుల్‌ని పిలిచి ఆ ఏజెన్సీ వాళ్లకి సంబంధించిన ఏదైనా పబ్లిసిటీ మ్యాటర్ ఉంటే పట్రమ్మని పంపాడు.
అయిదు నిముషాల్లో వెళ్లి వచ్చి కొన్ని పేపర్స్‌ని వేదవ్యాస్‌కి అందజేశాడా కానిస్టేబుల్.
అక్షరం పొల్లు పోకుండా ఒకటికి రెండుమార్లు చదివాడు వాటిని.
అప్పుడు గుర్తుకు వచ్చిందతనికి. అందులో ఒక పాంప్లెట్‌ని ఓ రోజు ఇంట్లోనే చూసినట్టు.
ప్రస్తుతానికి అది కాదు అతనికి కావాల్సింది.
అలాంటిది సేమ్ మ్యాటర్ ఎక్కడో విన్నట్టు. పైగా చదివినట్టు బాగా గుర్తు. అదే గుర్తుకు రావడం లేదు.
తిరిగి ఆలోచనల్లో పడ్డాడు.
అలా అయిదు నిముషాలు గడిచాయి.
అనంతరం స్ఫురణకు వచ్చిందతనికి.
అంతే! కోపంతో మొహం ఎర్రబడింది. శ్వాస వేగం హెచ్చింది.
ఒకసారి మనసులో రివైండ్ చేసుకున్నాడా వార్తని.
నిజామాబాద్‌లోని ఆర్మూర్‌లో ‘బాలాజీ ఏజెన్సీస్’ సంస్థ సగం డబ్బు చెల్లిస్తే చాలు. పదిహేను రోజుల్లో కస్టమర్లు కోరిన వివిధ గృహోపకరణాలు ఇస్తామని ప్రకటించింది. అది నిజమని నమ్మిన జనం తండోపతండాలుగా ఆ ఏజెన్సీ మీద పడ్డారు. సగం డబ్బు చెల్లించి, తమ పేర్లని వస్తువుని ఆ ఏజెన్సీలో నమోదు చేసుకున్నారు. ప్రజల్లో పూర్తిగా విశ్వాసం కలిగించడానికి ఆ ఏజెన్సీ వాళ్లు ముందుగా పేరు నమోదు చేసుకున్న కొందరికి సగం సొమ్ముకే వారు కోరుకున్న వస్తువుని అందజేశారు. దాంతో జనానికి ఆ ఏజెన్సీ మీద గురి కుదిరింది. అతి తొందర్లోనే వాళ్లు ప్రజల విశ్వాసాన్ని పొందగలిగారు. అలా ఏజెన్సీ వాళ్లు విసిరిన ఉచ్చులో అనేమంది చిక్కుకున్నారు.
చివరికి దాదాపు ఇరవై లక్షల పై చిలుకు సొమ్ము తమ చేతులు మారాక ఆ ఏజెన్సీ వాళ్లు గుట్టుచప్పుడు కాకుండా ఉడాయించారు.
మోసపోయిన మిగిలిన జనం వచ్చి స్టేషన్లో కంప్లయింట్ ఇచ్చేదాకా ఆ విషయం పోలీసులకు కూడా తెలియదు.
ఇప్పుడా కేసుని ఆర్మూర్ టౌన్ యస్సై విక్టర్ ఇనె్వస్టిగేషన్ చేస్తున్నాడు. తన సజెషన్ తీసుకోడానికి ఒక రోజు స్వయంగా వచ్చి కలిశాడు కూడా.
అదే ఘటన, అదే పద్ధతిలో తిరిగి నేడు నగరం నడిబొడ్డున పునరావృతం కాబోతోందన్న మాట.
నెవ్వర్! అలా జరగడానికి వీల్లేదు. ఎలాగైనా ఈ మోసాన్ని ఆపాలి. కానీ, ఎలా...ఎలా?
ఆ ఆర్మూర్ గ్రూపు ముఠావాళ్లే ఇక్కడ ‘గృహలక్ష్మి’ పేరుతో ఏజెన్సీ ఓపెన్ చేశారా? లేక ఆ ముఠా వేరా?
ఈ ముఠా వేరా?
ముందీ మిస్టరీ ఛేదించాలి. వేదవ్యాస్ బుర్ర వేడెక్కిపోతోంది.
చివరికో నిర్ణయానికి వచ్చినవాడిలా ఆ ఏజెన్సీ వైపు కదిలాడు. వెంట రాబోతున్న సిబ్బందిని అక్కడే ఆపేసి.
ఆ ఏజెన్సీ ముందర జనం కుప్పలు తెప్పలుగా ఉన్నారు. మధ్యతరగతి ప్రజల బలహీనతల్ని ఆసరాగా చేసుకొని మోసాలు చేసే వారు బయల్దేరారు. సామాన్యుల అమాయకత్వాన్ని ఓపెన్‌గా క్యాష్ చేసుకుంటున్నారు వాటే వండర్? లేకపోతే సగం ధరకే వస్తువులు దొరకడమేమిటి? ట్రాష్!
ఎంత వెర్రిగా నమ్ముతున్నారీ జనం. ఎంత గ్రుడ్డిగా వాళ్ల ప్రకటనల్ని ఫాలో అవుతున్నారు. ప్రజలు కించిత్ కూడా నిజానిజాలు తెలుసుకోకుండా గొర్రె దాటుడులా మోస కూపంలో పడిపోతున్నారెందుకని.
ఆ సమయంలో దీపపు కాంతి ఆకర్షణకి లోనై అందులో పడి కాలిపోయే శలభాలు గుర్తుకు వచ్చాయ్ వేదవ్యాస్‌కి.
మధ్య తరగతి మానవుడు ఆశామోహాల్లో పడి, ప్రలోభాలకి లొంగిపోనంత కాలం ఇలాంటి బూటకపు ఏజెన్సీలు పుట్టక మానవు. ప్రజలు బోల్తా పడక మానరు.
ఆలోచిస్తూనే ఆ ఏజెన్సీ లోపలకు ఎంటరయ్యాడు.
పోలీసుల వాసన తగిలి యస్సై వస్తున్నాడనే వార్త తెలియగానే తన గదిలోంచి బయటకు వచ్చింది శకుంతల.
ఎదురు వెళ్లి తనని తాను పరిచయం చేసుకుంటూ అతన్ని తన వెంట గదిలోకి తీసుకు వెళ్లింది.
ఆమెని చూడగానే ఎందుకనో వేదవ్యాస్‌కి ఒక రకమైన అపూజ్యభావం ఏర్పడింది. ఒక స్ర్తిని చూడగానే అలాంటి అభిప్రాయం ఏర్పడడం బహుశా వేద జీవితంలో తొలిసారామో?
అయినా తన భావాల్ని బయటపడనీయకుండా ఆమె వెంట నడిచాడతను.
గదిలో కూర్చున్నారిద్దరూ.
‘‘ఆ... చెప్పండి... నేను మీకే విధంగా సాయం చేయగలను?’’ అని అడిగింది.
‘‘ప్రజలకి చేస్తున్నారుగా బోల్డంత సేవ. అది చాలు’’ అన్నాడు నవ్వుతూ.
‘‘్థంక్స్ ఫర్ యువర్ నైస్ కాంప్లిమెంట్’’ బదులిచ్చింది.
అతడి వ్యంగ్యం అర్థం కాలేదామెకి.
‘‘ఇట్స్ ఓకే! కెన్ ఐ చెక్ యువర్ రికార్డ్స్ ఇమీడియట్లీ?’’
‘‘వై నాట్. ష్యూర్. బట్ వై ఇఫ్ దెరీజ్ ఎనీ కంప్లైంట్ ఫ్రమ్ ఎనీ కస్టమర్. ఆర్ ఎనీ ప్రాబ్లమ్స్ ఆర్ ఫేస్డ్ ఫ్రమ్ అవర్ సైడ్?’’ చాలా తెలివిగా అడిగిందామె.
ఆ ప్రశ్న చాలు. అతన్ని ఇరకాటంలో పెట్టడానికి.
తాను ఏ ఆధారంతో ఏజెన్సీ సోదా చేయడానికి వచ్చాడో తెలియపరచమని ఇన్‌డైరెక్ట్‌గా ప్రశ్నిస్తోంది.
సో షి ఈజ్ నాట్ ఓన్లీ పర్సన్ ఇన్‌సైడ్ ఆఫ్ దిస్ గ్రూప్. ఎవరో పెద్ద హస్తమే ఉండి ఉండాలి. లేదా తనని ఒక ట్రయల్ వేసైనా ఉండాలి. ఏదైతేనేం తొందరపడకూడదు.
చాలా తెలివిగా, ప్లాన్డ్‌గా డీల్ చేయాలి. ఇలాంటి వ్యవహారాల్ని. లేకపోతే ప్రత్యర్థులు జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది. ఆ ఛాయిస్ తనకు తానుగా రానీయకూడదు.
వేదవ్యాస్ ఆలోచన్లకి బ్రేక్ ఇచ్చి
‘‘నోనో నథింగ్ జస్ట్ ఫర్ క్యూరియాసిటీ. మిమ్మల్ని అనుమానిస్తున్నానని మీరనుకుంటున్నట్లున్నారు. అదేం కాదు’’ అంటూ మాట మార్చాడు.
‘‘్ఫర్వాలేదు. మీరు మమ్మల్ని శంకించినా, యు ఆర్ వెల్‌కమ్! ఆఫీసులో అణువణువూ గాలించి మరీ చెక్ చేసుకోవచ్చు. మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే మా నిజాయితీని శంకించడం మా సంకల్పాన్ని వెక్కిరించడమే అవుతుంది గనక’’ అంటూ ఆగింది. యస్సై నుండి ఎలాంటి సమాధానం వస్తుందోనని.
‘‘సారీ మేడమ్ మీరు అపోహ పడుతున్నారు. ఎలాంటి నెగెటివ్ థింక్స్‌తో నేనిక్కడికి రాలేదు’’ అన్నాడతను.
ఇంతలో ట్రేలో రెండు కప్పుల కాఫీ, రెండు కూల్ డ్రింక్స్ వచ్చాయి.
‘‘తీసుకోండి. కూల్ కావాలో, హాట్ కావాలో’’ అంది అతనికి ఆఫర్ చేస్తూ.
‘‘మీ అతిథి మర్యాదలకు థాంక్స్. విధి నిర్వహణలో ఉన్నప్పుడు ఇతరుల నుండి పచ్చి మంచినీళ్లు కూడా ముట్టను. దట్స్ మై ఓన్ ప్రిన్సిపుల్. సారీ’’ అంటూ తిరస్కరించాడు.
‘‘డ్యూటీలో లేనప్పుడు ఐ మీన్ ప్రైవేట్‌గా వచ్చి కలిస్తే ఏదైనా స్వీకరిస్తారన్న మాట’’ అంది నర్మగర్భంగా నవ్వుతూ.
ఆమె మాటల చాతుర్యానికి వేదవ్యాస్ తడబడ్డాడొక్క క్షణం.
‘‘నా ఉద్దేశాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఏ కాలంలోనైనా నిప్పు నిప్పే! అయినా నాకు ప్రైవసీ ఏంటి? ఈ దేహంలో జీవం ఉన్నంత కాలం ఈ వేదవ్యాస్ పోలీస్ డ్యూటీ నిర్వహిస్తున్నట్టే!’’ అన్నాడు.
‘‘ఎంతటి అగ్నిజ్వాలయినా ఎప్పుడో ఒకప్పుడు చల్లారక తప్పదు. అది ప్రకృతి ధర్మం.’’
ఆమెతో వాదం పెంచుకోదలచుకోలేదతను. వౌనమే సమాధానమయ్యింది.
‘‘మా ఏజెన్సీకి ఎందుకు వచ్చారో చెప్పడం లేదు.’’
వేద వాలకాన్ని గమనించి మాట మార్చేసింది.
‘‘మా అమ్మ కలర్ టీవీ కావాలని అంది. వివరాలు తెలుసుకుందామని వచ్చాను’’ చెప్పాడు కామ్‌గా.
ఒక్క క్షణం స్టన్నయ్యింది. అతను చెబుతున్నది నిజమో కాదో తేల్చుకోలేకపోయింది. అయినా తను బయటపడదలచుకోలేదామె.
‘‘కొంత ఎవౌంట్ పే చేసి వెళ్లండి. మీ ఇంటికో ఫారమ్ వస్తుంది. దానిలో టీవీ కంపెనీ, మోడల్, కలర్ తదితర వివరాలుంటాయి. దాన్ని ఫిలప్ చేసి మాకు పంపండి. మోడల్‌కి అనుగుణంగా డబ్బు సర్దుబాటుంటే మిగతా ఎవౌంట్ పే చేసి వస్తువు పట్టుకుపోవచ్చు. ఇదీ ప్రొసీజర్’’ చెప్పిందామె.
కానీ ఆ సమయంలో శకుంతలకి ఒక విషయం స్ఫురణకి రాలేదు. విధి నిర్వహణలో వచ్చి మంచినీళ్లు కూడా ముట్టనని చెప్పిన ఆ పోలీసాఫీసర్ తన సొంత పని మీద వచ్చానని చెప్పాడెందుకని?
దాని గురించి పెద్దగా పట్టించుకోలేదామె. సీరియస్‌గా తరచి చూస్తే, ప్లాన్డ్‌గా వ్యవహరించిందేమో! కానీ మిస్సయిపోయింది.
డేగ జాడ దూరం నుండే చూచాయిగా కనిపిస్తున్నా నాగుపాము తగు జాగ్రత్తలు పడడం లేదంటే అది ప్రమాదాన్ని కోరి తెచ్చుకుంటున్నట్టేగా.
వాస్తవానికి శకుంతల తన మస్తిష్కంలో మరో రకపు ఆలోచనలకి రూపకల్పన చేసుకుంటోంది.
‘‘ఒకటి రెండు రోజుల్లో ఎవౌంట్ పంపిస్తాను.’’
‘‘వెల్‌కమ్.’’
‘‘అడిగిన వెంటనే స్వయంగా వివరాలందజేసినందుకు థాంక్స్’’ అన్నాడు వేద కుర్చీలోంచి లేస్తూ.
మర్యాదపూర్వకంగా తనూ లేచి నిలబడిందామె.
‘‘మళ్లీ కలుస్తాను.’’
‘‘నైస్ టు మీట్ యూ.’’
అదే క్షణంలో ఆ ప్రత్యర్థులిద్దరూ ఎవరికి వారే తమ తమ మనసుల్లో విరుద్ధ భావాల్ని ఆవిష్కరించుకుంటున్నారు.
జరగబోయే ఆర్థికపరమైన ప్రమాదాన్ని ఆపి, ఏ రకంగా ఈవిడిని దెబ్బతీయాలా అనే ఆలోచనతో యస్సై వేదవ్యాస్ బయకు వెళ్లిపోయాడు.
తను ఊహించినట్లు పోలీసు నీడ పడనే పడింది. అయితే ఇంత తొందరగా తమ ఉనికిని పసిగడతారనుకోలేదు.
(ఇంకా వుంది)