S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వీక్లీ సీరియల్

11/02/2019 - 20:02

డిసిపి అవినాష్ క్రైమ్ సీన్ ప్రదేశాన్ని నిశితంగా పరిశీలించాడు. డార్క్ అవెన్యూ వైపు చూశాడు. స్మశానంలో కాలుతోన్న చితిలా వుంది ఆ ఇల్లు.
అటువైపు అడుగులు వేశాడు.. మీడియా కూడా అటువైపు పరుగులు పెట్టింది. సరిగ్గా అప్పుడే అక్కడికి ఓ క్యాబ్ వచ్చి ఆగింది. అందులో నుంచి సమీర్ భార్గవి దిగారు. అక్కడ వున్న హడావుడిని చూశారు. అంబులెన్స్‌లోకి దుర్జన్‌కుమార్‌ను స్ట్రెచర్ మీద ఎక్కిస్తున్నారు.

10/26/2019 - 19:03

ఆత్మహత్యలు కానేకాదంటున్న బంధువులు

10/19/2019 - 19:47

ఆ క్షణం పావని దగ్గర కూడా సమాధానం లేదు. ఏ మాత్రం ఊహించని సంఘటన జరిగింది. ఎలా రియాక్ట్ కావాలో కూడా తెలియడంలేదు.
‘నాకూ ఏమీ తోచడం లేదు. ఇంకా భయం తగ్గనే లేదు. అమ్మ ఎక్కడ భయపడుతుందేమోనని భయాన్ని అణచిపెట్టుకున్నాను’ చెప్పింది పావని.

10/12/2019 - 18:40

కొత్త సీరియల్ ప్రారంభం

10/05/2019 - 19:49

శకుని కొడుకుని అక్కున చేర్చుకుని ఆశీర్వదించాడు. అతని మొహంలో దిగుల్లాంటిదేం లేదు. కొడుక్కి ధైర్యం కలిగించేలా కొన్ని ఉపమానాలు చెప్పి నవ్వించాడు. బిక్కమొహంతో చూస్తున్న గౌతమి దగ్గరగా వచ్చి-

09/28/2019 - 19:05

‘మన ప్రభుని చేసుకోవడానికి ఓకే అందా’ అన్నాడు.
‘ప్రభు అంటే ఆమె కిష్టమే! కానీ అది ఆమెనడక్కూడదు. వాళ్లింటికెళ్లి శంకరయ్య గారి ద్వారా అడిగించాలి. ఇవాళ మంచి రోజు. మనం వెళ్లి శంకరయ్య గారితో మాట్లాడి శుభవార్తతో తిరిగొద్దాం’ ఉత్సాహంగా అన్నాడు చంద్ర.
‘ఎస్సర్! మంచి ఆలోచన! ఇప్పుడే వెళ్దాం. ఫోన్ చెయ్యండి’ అన్నాడు నాయక్ మరింత ఉత్సాహంగా.

09/21/2019 - 19:51

పాత నేరాలతో సహా బైటకపడ్డ ధర్మారావు, అనిల్, కాంతారావులకి యావజ్జీవం, వాళ్ళకి సహకరించిన కొందరికి తగిన శిక్షలు పడి కటకటాల వెనక్కి వెళ్లిపోయారు. టీవీలు, పేపర్లు గౌతమి, చందన సాహసాలని అభినందిస్తూ ఆకాశానికెత్తేశాయి. ప్రభు, విజయనాయక్, ప్రయాగలని పట్టువదలని విక్రమార్కుల్లా దొంగలూ, నగలూ, అపురూప విగ్రహాలు దొరికేదాకా వదలకుండా విజయం సాధించినందుకు ప్రశంసించాయి.

09/14/2019 - 19:47

కోటమ్మ మరి కొందరు యువతీ యువకులు తేనె కల్లు లాంటివి పంచారు. తాత్కాలికంగా తమ బాధని మర్చిపోయి ప్రభు, నాయక్ వాళ్లు కూడా వాళ్ల ఉత్సాహంతో పాలుపంచుకున్నారు.
అప్పుడే ఓ చిత్రమైన సంఘటన జరిగిపోయింది. ఎప్పుడు వెళ్లి తయారుచేశారో గానీ, చక్కని అడవి పూలతో అందమై రెండు పూలదండలు తయారుచేసి, ప్రభు గౌతమిల కిచ్చారు చిన్ని, మరి కొంతమంది కనె్నపిల్లలు, ప్రభూ వాళ్లు బిత్తరపోయి చూస్తుంటే-

09/07/2019 - 19:40

ఛ! బావి అంటే నాకు భయమేంటి? గంటల తరబడి సముద్రంలో ఈదినవాణ్ని. నేనా తాచుల గురించే ఆలోచిస్తున్నాను’ అన్నాడు కాంతారావు.
‘దాన్ని గురించి ఆలోచించకు. మన జాగ్రత్తలు మనం తీసుకుంటే ఏ ప్రాబ్లమ్ ఉండదు. ఈశ్వర వేళ్లు మన దొడ్లలోనే వున్నాయి’ నవ్వాడు ధర్మారావు.
‘ఈశ్వర వేరు దగ్గరుంటే పాములు రావా?’ నవ్వుతూ అన్నాడు అనిల్.

08/31/2019 - 19:54

సి.ఎం. చంద్ర పూర్తిగా మరో మనిషైన మరింత ఉత్సాహంగా ఉండడం గమనించిన నగరానికి సంబంధించిన వారు, ప్రతిపక్షాల వారే కాక కుటుంబ సభ్యులు కూడా విస్తుపోయారు అయినా అందుక్కారణం మాత్రం ఎవరూ రాబట్టలేక పోయారు. కానీ విషయం తెలియకపోయినా ధర్మారావు బృందంలో మాత్రం దడ పెరిగిపోయింది.

Pages