వీక్లీ సీరియల్

డార్క్ అవెన్యూ-2

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ క్షణం పావని దగ్గర కూడా సమాధానం లేదు. ఏ మాత్రం ఊహించని సంఘటన జరిగింది. ఎలా రియాక్ట్ కావాలో కూడా తెలియడంలేదు.
‘నాకూ ఏమీ తోచడం లేదు. ఇంకా భయం తగ్గనే లేదు. అమ్మ ఎక్కడ భయపడుతుందేమోనని భయాన్ని అణచిపెట్టుకున్నాను’ చెప్పింది పావని.
‘నిజమే పావని.. పరిస్థితి అలాంటిది.. కానీ చంద్రలేఖ గురించే ఆలోచిస్తున్నాను. ఆ రోజు చంద్రలేఖ వెళ్తూ అన్న మాటలు గుర్తున్నాయి. మళ్లీ మిమ్మల్ని కలుస్తానో లేదో..’ అన్నది తన పరిస్థితిని చూసి మనం తేలిగ్గా తీసుకున్నాం. కానీ ఆలోచిస్తుంటే...’ ఒక్క క్షణం ఆగిపోయింది భార్గవి.
పావని వెనక్కి ఒరిగి కూచుంది. ఆమె మొహంలో అలసట కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఆ క్షణం ఆమెకు చంద్రలేఖ గుర్తొచ్చింది. ఎమ్మే క్రిమినాలజీ చదివి ఎంతో ధైర్యంగా ఉండే చంద్రలేఖ ఇక్కడే మంచి జాబ్ ఆఫర్‌ను వదులుకుంది. అర్జంట్‌గా ఊరు వెళ్లాలని అంది.
దానికి కారణం చంద్రలేఖ తల్లి అక్కయ్య ఆత్మహత్యా ప్రయత్నం చేయడమే...
దానికి కారణం.. ఆత్మలు తమని చంపేయడానికి ప్రయత్నిస్తున్నాయని.. ఆత్మల చేత చావడంకన్నా తామే ఆత్మహత్య చేసుకోవడం మంచిదని ఆత్మహత్య ప్రయత్నం చేశారు. జనాభా సేకరణ చేసేవాళ్లు ఆ సమయంలో అక్కడికి వెళ్లడం వాళ్ల విషయం బయటకు పొక్కింది. ఆ తరువాత ఎన్నో ఆశ్చర్యకర అనూహ్యమైన సంఘటనలు జరిగాయి.. చివరిసారిగా వారం రోజుల క్రితం తమకు మెయిల్ చేసింది..
అప్పుడే జంగానియాకు సంబంధించిన విషయం బయటకు వచ్చింది.
ఇద్దరూ ఇలా ఆలోచిస్తూ ఉండగానే హాస్పిటల్ ముందు ఓ కారు ఆగింది. మంచి ఎత్తు ఎత్తుకు తగ్గ లావు.. దృఢంగా వున్న వ్యక్తి హాస్పిటల్లోకి ప్రవేశించాడు. రిసెప్షన్‌లో వున్న వ్యక్తి కునికిపాట్లు చూశాడు. డైరెక్ట్‌గా ముందుకు నడిచాడు. అతను ఎక్కడికి వెళ్లాలో అతడికి బాగా తెలుసు. అతను సరాసరి పావని వున్న రూమ్‌లోకి వెళ్లాడు.
తమ గదిలోకి ఒక అపరిచితుడు అందులోనూ పురుషుడు అర్ధరాత్రి సమయంలో రావడంతో ఇద్దరి మొహాల్లోనూ ఆందోళన కనిపించింది.
వెంటనే ముందుగా చేరుకుంది భార్గవి. ‘ఎవరు మీరు లేడీస్ వుండే గదిలోకి అదీ అర్ధరాత్రి అనుమతి లేకుండా రాకూడదని తెలియదా?’ అంది కోపంగా. అంతకన్నా కోపంగా రియాక్ట్ కాలేక పోయింది అతడిని చూశాక.
‘సారీ.. సారీ ఫర్ దట్.. అయినా రాక తప్పలేదు. పరిస్థితి అలాంటిది. బై ది బై.. అయామ్ సమీర్.. సమీర్ ఫ్రమ్ సిబిఐ’ చెప్పాడు వాళ్లిద్దరి వైపు చూస్తూ.
‘సిబిఐ’ పావని భార్గవి షాకింగ్‌గా అన్నాడు ఒకేసారి.
‘అవును..’ చెప్పాడు చిన్నగా నవ్వి.
సమీర్ వాళ్లిద్దరి వైపు చూసి ‘కూచోవచ్చా?’ అని అడిగాడు.
వెంటనే భార్గవి వైపు చూసి ‘మీ ఇంటికి వెళ్లి వస్తున్నాను.. మీరు లేరని తెలిసింది.. పావని యాక్సిడెంట్ విషయం కూడా తెలిసింది. వెంటనే ఇక్కడికి వచ్చాను’ అన్నాడు.
అంతా అయోమయంగా వుంది ఆ ఇద్దరికీ.. సిబిఐకి తమతో పని ఏమిటి? అసలు ఇదంతా ఏమిటి? కన్‌ఫ్యూజన్‌లో ఉండిపోయాను.
‘సారీ మిమ్మల్ని కన్‌ఫ్యూజన్‌లో ఉంచడం ఇష్టం లేదు. మీకు చంద్రలేఖ తెలుసు కదా? అదే మీ ఫ్రెండ్’ సమీర్ ఇద్దరి వైపు చూసి అన్నాడు.
‘తెలుసు తనకేమైంది?’ ఆదుర్దాగా అడిగారు ఒకేసారి ఇద్దరూ.
‘తను మీకు మెయిల్ చేసిందిగా తను ప్రమాదంలో ఉన్నట్టు’
‘అవును.. కానీ ఆ విషయం మీకెలా తెలిసింది?’ భార్గవి అడిగింది.
సమీర్ చెప్పడం మొదలుపెట్టాడు.
‘మా సిబిఐకి ఒక మెయిల్ వచ్చింది. ఆ మెయిల్ చంద్రకళ పేరుతో వుంది.. తాను తన కుటుంబం ప్రమాదంలో ఉందని రాసింది. అలాగే తన ఫ్రెండ్స్ అయిన పావని భార్గవిలకు ఈ విషయం తెలియజేశానని.. ఈలోగా వాళ్ల నుంచి రెస్పాన్స్ లేదని వాళ్లకు కూడా ఏమైనా ప్రమాదం జరిగి ఉంటుందేమోనని ఆ మెయిల్‌లో.. మీ అడ్రస్‌లు ఇచ్చింది.. నేను వెంటనే ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని ఎంక్వయిరీ మొదలు పెట్టాను. చంద్రలేఖ ఉంటున్న ఇల్లు నగర శివారు ప్రాంతంలో ఉండాలి. దానికి డార్క్ అవెన్యూ అని పేరు వుంది... ఆ ఇంట్లోని ముగ్గురు ఆత్మహత్యా ప్రయత్నం చేశారు. ఆ ఇంటి ఛాయలకు వెళ్లడానికి భయపడుతున్నారు. ఒక టీవీ ఛానెల్ ఆ ఇంట్లో వాళ్లను ఇంటర్వ్యూ చేసింది. తమ ఇంట్లో ఆత్మలు తిరుగుతున్నాయని ముగ్గురూ చెప్పడం విశేషం. ఆ ఇంటర్వ్యూ తాలూకు క్లిప్ తెప్పించుకుని చూశాను. ఆ ఇంటి గోడల నుంచి కూడా ఆత్మలు వస్తాయని వాళ్ల భయం.. చంద్రకళ అనే అమ్మాయి తన మొబైల్‌తో ఎప్పుడూ ఫొటోలు తీసు సేవ్ చేసుకుంటుంది. కాకపోతే అదే చంద్రకళ ఎందుకిలా చేస్తుంది అన్నది మిస్టరీ.. మిగతా విషయాలు మీరే చెప్పాలి.. చంద్రకళ ఇచ్చిన ఇంటి అడ్రస్ ప్రకారం మీ దగ్గరికి వచ్చాను’ సమీర్ చెప్పడం ఆపి ఆ ఇద్దరి వైపు చూశాడు.
భార్గవి సమీర్ వైపు చూస్తూ ఉండిపోయింది. చాలా హ్యాండ్సమ్‌గా వున్నాడు. అంతకన్నా స్మార్ట్‌గా కనిపిస్తున్నాడు. ఆమె ప్రస్తుతం ఆ విషయం గురించి ఆలోచించడం లేదు. సిబిఐ గురించి కథల్లో చదవడం, సినిమాల్లో చూడడం తప్పితే ఇలా మొదటిసారి సిబిఐ ఆఫీసర్‌ను చూస్తుంది. ఒక చిన్న మెయిల్‌కు ఇలా ప్రతిస్పందిస్తారా?
‘మీ ఫ్రెండ్ చంద్రకళ గురించి చెప్పగలరా?’ అడిగాడు సమీర్.
వెంటనే భార్గవి పావని వైపు చూసి చెప్పడం మొదలు పెట్టింది.
‘చంద్రకళ మాతోపాటు మా రూమ్‌లోనే ఉండేది. వాళ్ల అక్కయ్య బీటెక్ చదివింది. వాళ్ల అమ్మ కూడా బాగానే చదువుకుంది. వాళ్ల నాన్న చనిపోయాడు. ఎవరో చేతబడి చేసి చంపేశారని వాళ్ల అనుమానం. చంద్రకళ చాలా తెలివైన అమ్మాయి. క్రిమినాలజీ చదివింది. ఒకరోజు అకస్మాత్తుగా హైద్రాబాద్ వూరు నుంచి ఫోన్ వచ్చింది. వాళ్ల అమ్మ అక్కయ్య గత కొద్ది రోజులుగా బయటకు రాకుండా వున్నారుట. ఇరుగు పొరుగు సమాచారం అందించారు. చంద్రకళ హుటాహుటిన హైద్రాబాద్ వెళ్లింది. ఇంటి తలుపులు బద్దలు కొట్టి చూస్తే ఇల్లంతా దుర్గంధంతో నిండి వుంది. ఆ తర్వాత ఏమైందో కొన్ని రోజులు చంద్రకళ నుంచి ఎటువంటి సమాచారం లేదు. తర్వాత టీవీ ఛానెల్‌లో పత్రికల్లో డార్క్ అవెన్యూ గురించి వార్తలు వచ్చాయి. చంద్రకళ ఇంటికి మీడియా పెట్టిన పేరు అది.. ఆ చీకట్లో ఏం జరుగుతుందో తెలియదు.. ఒకరోజు చంద్రకళ మొబైల్ నుంచి మెయిల్ వచ్చింది.
తమ కుటుంబానికి హాని చేయడానికి ఏదో ప్రయత్నం జరుగుతుందని మెయిల్‌లో తెలియజేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో తను కూడా వాళ్లతో పాటే వాళ్లను నమ్ముతూ ఉండక తప్పనిసరి పరిస్థితి అని.. జంగానియా అనే తాంత్రిక ప్రాంతం గురించి చెప్పింది.. అదే సమయంలో పావనికి యాక్సిడెంట్ అయ్యింది’ చెప్పింది భార్గవి.
‘తీశ్మార్ కనిపించడం.. ఇంట్లో జరిగిన సంఘటనలు చెప్పలేదు. ఒక సిబిఐ ఆఫీసర్‌కు ఇలాంటి క్షుద్ర విద్యల గురించి చెబితే కొట్టిపారేస్తాడు. పైగా తమను తక్కువ అంచనా వేస్తాడని’ ఆమె భయం.
‘ఇపుడు చంద్రలేఖ కుటుంబం ప్రమాదంలో వుంది. ఇదంతా ఒక హెలుసినేషన్.. భ్రమ.. లేదా నిజం కూడా కావచ్చు..’ ఆ కుటుంబానికి పొంచి వున్న ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకుని అన్నాడు సమీర్.
‘అంటే మీరు కూడా ఇలాంటివి నమ్ముతున్నారా?’ అడిగింది భార్గవి.
‘నమ్మడమా. నమ్మకపోవడమా అన్నది సమస్య కాదు. ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి.. ఢిల్లీలోనే అలాంటి సంఘటన జరిగింది. ఒకే కుటుంబంలో పదకొండు మంది మృతి చెందారు.. దానికి సంబంధించిన వార్త ఇది. తన స్మార్ట్ ఫోన్‌లో ఆ వార్త చూపించాడు. పత్రికలోని వార్త అది.. దానిని చదవసాగారు. భార్గవి పావని..
ఢిల్లీలో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది మృతి
తాంత్రిక పూజలు చేస్తున్న ముగ్గురు కుటుంబ సభ్యులు
తాము ఆత్మహత్య చేసుకోవాలని తొలుత నిర్ణయం
ఇంటిల్లిపాదినీ చంపేసేందుకు ఆ తర్వాత ప్రణాళిక
ఆహారంలో మత్తు మందు కలిపి దారుణం
చేతులు కట్టి.. నోటికి వస్త్రాలు చుట్టి ఏడుగురికి ఉరి
మరో మహిళ గొంతు కోసి చంపిన వైనం
మృతుల్లో ఏడుగురు మహిళలు.. ఇద్దరు పిల్లలు
చనిపోయిన వారిలో ఒకరికి ఇటీవలే నిశ్చితార్థం
న్యూఢిల్లీ: చేతులు వెనక్కి కట్టేసి, నోటికి, కళ్లకు వస్త్రాలు చుట్టేసిన స్థితిలో.. ఉరితాళ్లకు వేలాడుతున్న పది శవాలు.. ఒకే గదిలో! గొంతు కోసేయడంతో చనిపోయిన వృద్ధురాలి మృతదేహం మరో గదిలో!! రాత్రి దాకా అందరితో నవ్వుతూ మాట్లాడిన వారు తెల్లవారేసరికి అలా నిర్జీవులై కనిపించారు. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. 11 మంది కుటుంబ సభ్యులు.. ఏడుగురు మహిళలు, నలుగురు పురుషులు అనుమానాస్పద స్థితిలో మరణించారు. మృతుల్లో ఇద్దరు మైనర్లు. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన విషాదమిది. ఆదివారం ఉదయానే్న వెలుగు చూసిన ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్‌లోని చిత్తోడ్‌గఢ్‌కు చెందిన నారాయణ్ దేవి (75), ప్రతిభ (60) ఇరవై రెండేళ్ల క్రితం ఉత్తర ఢిల్లీ బురారీ ప్రాంతంలో ఉన్న సంత్‌నగర్‌కు వచ్చి స్థిరపడ్డారు. అక్కడ వారు ఒక కిరాణా దుకాణాన్ని నడుపుతూ ప్లైవుడ్ వ్యాపారం కూడా చేస్తున్నారు. నారాయణ్ దేవికి.. పెద్ద కుమారుడు భవనేశ్ భాటియా (46), కోడలు సవిత (42), మనవలు నీతు (24), మీను (22), ధీరు (12), చిన్న కుమారుడు లలిత్ భాటియా (42), చిన్న కోడలు టీనా (38), వారి కుమారుడు శివమ్ (15) ఉన్నారు. ఇక, ప్రతిభా దేవికి ప్రియాంక (33) అనే కుమార్తె ఉన్నది. వీరంతా ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఇంటి కింది భాగంలో కిరాణా దుకాణం ఉండగా.. మొదటి అంతస్తులో వీరు నివాసం ఉంటున్నారు. రోజూలాగానే శనివారం రాత్రి 11.45 గంటలకు కిరాణా దుకాణాన్ని మూసేసి పైకి వెళ్లారు. ఆదివారం ఉదయం 6 గంటలకు దుకాణం తెరవాల్సి ఉండగా తెరవలేదు.
ఉదయం 7.30 గంటలు అవుతున్నా షాపు తెరవకపోవడంతో.. పాల కోసం వచ్చిన పొరుగింటి వ్యక్తి పైకి వెళ్లి చూశాడు! చూసేసరికి.. ఇంటిల్లిపాదీ శవాలై కనిపించారు. వెంటనే అతడు కిందికి వచ్చి చుట్టుపక్కల వారికి విషయం తెలియజేశాడు. అందరూ కలిసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు.
తాంత్రిక కోణం...
నారాయణ్ దేవి ఇంట్లో అణువణువూ శోధించిన పోలీసులకు కొన్ని కాగితాలు లభ్యమయ్యాయి. ‘(చావడానికి) మీరు బల్లను ఉపయోగిస్తే మీ చేతుల్ని వెనక్కి కట్టేసుకోండి. కళ్లను మూసుకోండి. అప్పుడే మీకు మోక్షం లభిస్తుంది’ అని ఆ కాగితంలో ఉన్నట్టు సమాచారం. ఒక్క ప్రతిభా దేవి మృతదేహం మినహా మిగతా వారందరి మృతదేహాలూ అదే స్థితిలో కనిపించడంతో దీని వెనుక తాంత్రిక కోణం ఉన్నట్టు పోలీసులు విశే్లషిస్తున్నారు. చనిపోయిన మహిళల శరీరాలపై ఉన్న బంగారు నగలన్నీ యథాతథంగా ఉండడం.. ఇంట్లో ఉన్న విలువైన వస్తువులూ ఎక్కడివక్కడ ఉండడం.. ఇంటిపైన ఉన్న కుక్క గట్టిగా మొరిగిన దాఖలాలు లేకపోవడం.. ఇంటి తలుపులను బలవంతంగా విరగ్గొట్టి ఎవరూ చొరబడినట్టు లేకపోవడంతో పోలీసులు తాంత్రిక కోణం పైనే ఎక్కువగా దృష్టి సారించారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలిందంటంటే.. ఇంటి సభ్యుల్లోనే తాంత్రిక పూజలు చేస్తున్న ముగ్గురు.. ఆత్మహత్య చేసుకుని చనిపోవాలని నిశ్చయించుకున్నారు. అంతలోనే ఏమైందో ఏమో.. ఇంటిల్లిపాదినీ చంపేయాలనే నిర్ణయానికి వచ్చారు. శనివారం రాత్రి ఆహారంలో మత్తు మందు కలిపి.. అందరూ మత్తులోకి జారుకున్నాక వారిని చంపేసి ఉంటారని, మధ్యలో నారాయణ దేవికి మెలకువ రావడంతో ఆమె గొంతు కోసి చంపి ఉంటారని పోలీసులు విశే్లషిస్తున్నారు.
కాగా.. మృతుల్లో ఒకరైన ప్రియాంకకు ఇటీవలే నిశ్చితార్థం జరిగింది.. ఆమె వివాహం నవంబర్‌లో జరగాల్సి వుంది. కానీ ఇంతలోనే ఇంత ఘోరం జరిగిపోయిందని స్థానికులు వాపోయారు. వారి కుటుంబానికి ఎవరితోనూ శత్రుత్వం లేదని వారు పేర్కొన్నారు. అయితే, వారంతా హత్యకు గురయ్యారని రాజస్థాన్‌లో ఉంటున్న మృతుల బంధువు ఒకరు ఆరోపించారు. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.’
అదంతా చదివాక ఒక్క క్షణం ఊపిరి బిగపట్టారు... దేశ రాజధానిలో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయా? చంద్రకళ గురించి ఆలోచిస్తూ ఈ వార్తను గమనించలేదు. ఈ ఘోరాన్ని గుర్తించలేదు.

సమీర్ మరో వార్తను కూడా చూపించాడు.ఒక పత్రిక రాసిన కథనం ఢిల్లీ ఆత్మహత్యల వెనుక గుర్తు తెలియని బాబా?

న్యూఢిల్లీ: ఢిల్లీలో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది ఆత్మహత్యల వెనుక గుర్తు తెలియని ‘బాబా’ ఉన్నట్టు ఢిల్లీ పోలీసులు అనుమానిస్తున్నారు. కుటుంబ సభ్యులందరి కాల్ డేటాను విశే్లషించిన అనంతరం పోలీసులు ఈ కోణంలో కూడా విచారణ చేపట్టారు. వీరంతా ఆత్మహత్య చేసుకునేలా ఎవరైనా ప్రేరేపించారా లేక వారంతట వారే ఈ ఘోరానికి ఒడిగట్టారా అనేది తేల్చేందుకు ఇంటర్నెట్‌లో కూడా పోలీసులు విస్తృతంగా పరిశోధిస్తున్నారు.
ఒకవేళ ఇది మూఢ నమ్మకాల వల్లే జరిగినట్టు తేలితే.. దీని వెనుక ఎవరున్నారో తేల్చాలని క్రైం బ్రాంచ్ పోలీసులు భావిస్తున్నారు. ఢిల్లీలోని బురారీ ప్రాంతంలో నిన్న ఒకే కుటుంబానికి చెందిన 11 మంది బలవన్మరణానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ‘మోక్షం’ వస్తుందన్న మూఢ నమ్మకంతోనే వీరంతా ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రాథమిక విచారణలో తేలడంతో కలకలం రేగింది. ఇంట్లో లభించిన రిజిస్టర్లలో పోలీసులకు వీరి నమ్మకాలపై కీలక ఆధారాలు లభించాయి. ఈ నేపథ్యంలో మూఢ నమ్మకాలు, క్షుద్ర పూజలు సమాజాన్ని ప్రభావితం చేస్తుండటంపై మరోసారి తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
11 పైపుల మర్మమేంటి?
భాటియా కుటుంబానివి ఆత్మహత్యలే
ఇంట్లో దొరికిన కాగితాల్లో ఆధారాలు
ఇంకా వేధిస్తున్న అనుమానాలెన్నో..
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో సంచలనం సృష్టించిన భాటియా కుటుంబ మరణోదంతంలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మోక్షం పొందడమే లక్ష్యంగా కుటుంబ సభ్యులంతా సామూహిక ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. అయితే, ఈ కేసులోని పలు చిక్కుముడులు ఇంకా వీడలేదు. అనుమానాలు పూర్తిగా తొలగిపోలేదు. దర్యాప్తు కొనసాగే కొద్దీ ఆశ్చర్యకర అంశాలు బయటకొస్తున్నాయి. ఉత్తర దిల్లీలోని బురారీ ప్రాంతంలోగల ఓ ఇంట్లో భాటియా కుటుంబానికి చెందిన 11 మంది ఆదివారం విగతజీవులై కనిపించిన సంగతి తెలిసిందే.
భాటియా కుటుంబ సభ్యుల్లో ఎక్కువ మంది మరణించే ముందు ఎలాంటి పెనుగులాటకు లోను కాలేదని శవపరీక్ష నివేదికలు తేల్చాయి. మృతులందరి శవ పరీక్షలు సోమవారం పూర్తయ్యాయి. వృద్ధురాలు నారాయణ్ దేవి, ఇద్దరు బాలురు సహా ఎనిమిది మంది మరణించే ముందు పెనుగులాటకు లోనైన సంకేతాలేవీ లేవని వైద్యులు తెలిపారు. వారంతా ఉరి వల్లే మరణించారని స్పష్టం చేశారు. బలవంతంగా ఇతరులు గొంతు నులమడంతో మృత్యువాత పడ్డ దాఖలాలేవీ లేవని తెలిపారు.
వృద్ధురాలికీ ఉరి
వృద్ధురాలిని గొంతు నులిమి చంపిన అనంతరం కుటుంబ సభ్యులు ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు తొలుత భావించారు. అయితే, ‘పాక్షిక ఉరి’ కారణంగా ఆమె మరణించినట్టు వైద్యులు శవపరీక్ష నివేదికలో పేర్కొన్నారు. వృద్ధురాలి మృతదేహం సమీపంలో ఓ తాడు వేలాడుతూ ఉండటం తాము గుర్తించినట్టు పోలీసులు చెప్పారు.
భాటియా కుటుంబ మరణోదంతాన్ని దర్యాప్తు చేస్తున్న పోలీసులకు.. 11 పైపులు పెద్ద చిక్కు ప్రశ్నగా మారాయి. మృతుల ఇంటి గోడ నుంచి ఆ పైపులు కాస్త బయటకు చొచ్చుకొని వచ్చాయి. నీటిని బయటకు పంపే సదుపాయమేదీ అటువైపు లేకపోయినా పైపులను ఎందుకిలా అమర్చారో అంతు చిక్కడంలేదు. పది పైపులు దగ్గర దగ్గరగా ఉండి.. ఒకటి మాత్రం కాస్త దూరంగా ఉంది. ఈ పైపుల వెనుక తాంత్రిక కోణముందని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఇతర కుటుంబ సభ్యులకు దూరంగా వృద్ధురాలి మృతదేహం పడి ఉండటాన్ని... దూరంగాఉన్న పైపు సూచిస్తోందని పలువురు చెవులు కొరుక్కుంటున్నారు.
ఆ రాతలు.. మరణ శాసనాలు
భాటియాల ఇంట్లో దొరికిన రెండు రిజిస్టర్లల్లోని రాతలు.. వారి మరణం వెనుక మత విశ్వాస/ తాంత్రిక కారణాలను బలపరుస్తున్నాయని పోలీసు అధికారి ఒకరు సూచించారు. వాటిలోని పలు విషయాలను బయట పెట్టారు. అందులో కొన్ని...
* మంగళవారం లేదా గురువారం లేదా శనివారాన్ని ఎంచుకోవాలి.
* వస్త్రాన్ని గట్టిగా కట్టాలి. అసలేం కనిపించకూడదు. తాడుతోపాటు చీర లేదా దుప్పట్టాను ఉపయోగించాలి.
* చంపడానికి ముందు ఏడు రోజులు సంప్రదాయాలను పాటించాలి. ఆలోపే ఆత్మ ఆవాహనమైతే.. మరుసటి రోజే ‘పని పూర్తి చేయాలి.’
* నిర్ణయించుకున్న ఆచారాన్ని అమలుపర్చే రోజు ఇంట్లో వంట చేయొద్దు. ఆరు గంటలపాటు ఫోన్లను నిశ్శబ్దంగా ఉంచాలి.
* ఇతరులు తమకు తాము ఉరి తీసుకునేలా ఓ వ్యక్తి వారి పక్కనే ఉండి పర్యవేక్షించాలి.
* వృద్ధురాలు నిలబడలేకపోతే.. వేరే గదిలో ఆమెను ‘నిద్రపుచ్చవచ్చు.’ ఇంకా ఉంది)

తేజారాణి తిరునగరి