వీక్లీ సీరియల్

డార్క్ అవెన్యూ-3

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆత్మహత్యలు కానేకాదంటున్న బంధువులు
భాటియా కుటుంబం సామూహిక ఆత్మహత్యకు పాల్పడినట్లు వస్తున్న వార్తలను నారాయణ్ దేవి మరో కుమార్తె సుజాత నాగ్‌పాల్ తోసిపుచ్చారు. ‘రెండు రోజులకోసారి అమ్మతో మాట్లాడుతూనే ఉన్నా, మా కుటుంబంలో అంతా బాగానే ఉంది. మేం విద్యావంతులం. బాబాలను విశ్వసించం. ఇవి ఆత్మహత్యలు కావు. మా కుటుంబ సభ్యులు బలవన్మరణానికి పాల్పడ్డారంటూ తప్పుడు ప్రచారం జరుగుతోంది’ అని సుజాత పేర్కొన్నారు. నారాయణ్ దేవి మేనకోడలు గీతా థక్రాల్ కూడా ఇదే తరహా అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ విషాదం వెనుక ఇతరుల హస్తముందని ఆరోపించారు. భాటియా కుటుంబీకులు అందరిలాగే మామూలు భక్తులని.. తాంత్రిక శక్తుల్ని విశ్వసించరని తెలిపారు. కుటుంబంలో అంతర్గత గొడవలేవీ లేవన్నారు. ప్రియాంక పెళ్లి పనుల్లో అంతా సంతోషంగా నిమగ్నమై ఉన్నారని.. వారు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరమేమీ లేదని వ్యాఖ్యానించారు.
(పై సంఘటన యథార్థముగా జరిగినదే.. ఈ కథకు ఆ సంఘటనకు సంబంధం లేదు. కానీ ఈ విషాదానికి కథలోని సన్నివేశాలకు పోలిక ఉండటం వల్ల ఇలాంటి దుస్సంఘటనలు జరుగకూడదని కోరుకుంటున్నాను.. రచయిత్రి)
‘నమ్మలేక పోతున్నాను సర్’ అంది భార్గవి ఆ వార్తాకథనాలు చదివి.
‘ఈ సామూహిక బలవన్మరణాలు వెనుక వున్న మర్మం గురించి ఢిల్లీ పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ సంఘటన జరిగిన సమయంలోనే హైద్రాబాద్ సంఘటన నా దృష్టికి వచ్చింది. ఇలాంటి మాస్ సూసైడ్ అటెంప్ట్ జరగకుండా మనం చూడాలి. దీనిని సైకాలజీ కోణంలో పరిశీలించాలి. అంతేకాదు దీని వెనుక వేరే ఎవరి ప్రమేయం ఏమైనా ఉన్నదేమో పరిశోధించాలి..’ సమీర్ అన్నాడు.
‘జంగానియా గురించి చెప్పాలనుకుంది భార్గవి చెబితే ‘అంతా ట్రాష్’ అని కొట్టిపారేయవచ్చు. లేదా తమను పిచ్చివాళ్లలా చూడవచ్చు అనుకుంది భార్గవి. పావనికి భార్గవి ఫీలింగ్ అర్థమయ్యింది. అందుకే వౌనంగా ఉంది.
‘ఈ విషయంలో మీరు కోపరేట్ చేయాలి. మీకు అభ్యంతరం లేకపోతే నాతోపాటు హైద్రాబాద్ రాగలరా? ఇది ఒక సిబిఐ ఆఫీసర్‌గా అందరికీ తెలిసేలా చేసే పరిశోధన కాదు... ముల్లును ముల్లుతోనే తియ్యాలి. వాళ్ల మూఢ నమ్మకాలను మూఢనమ్మకాలతోనే ఎదుర్కోవాలి.. మనం ఘోస్ట్ హంటర్స్‌గా దెయ్యాల మీద పరిశోధన చేసేవారిలా వెళ్లాలి. మీరు ఎలాగూ చంద్రలేఖ కుటుంబానికి పరిచయమే కాబట్టి మీరు చెప్పింది వాళ్లు నమ్ముతారు.. ఏమంటారు?’ సమీర్ వాళ్లవైపు చూస్తూ అన్నాడు.
ఎగిరి గంతేయాలనిపించింది భార్గవికి.. ఇలాంటి అవకాశం కోసమే ఎదురుచూస్తోంది. సమీర్‌కు దెయ్యాల మీద నమ్మకం లేకపోవచ్చు.. ఆత్మలు క్షుద్రశక్తులను నమ్మకపోవచ్చు. కానీ పరిశోధన కోసమైనా ఘోస్ట్ హంటర్స్‌గా వెళదామంటున్నాడు.
‘సర్ నేనూ మీతో వస్తాను’ చెప్పింది ఉత్సాహంగా భార్గవి.
‘నేను రాలేను సర్’ పావని చెప్పింది... తల్లిని వదిలి రావడం కష్టం కనుక.
‘్భర్గవి ఒక్కరే వస్తే చాలు.. ఇక్కడ నాకు ఏమైనా అవసరమైతే మీరు హెల్ప్ చేయవలసి ఉంటుంది.. ఎందుకంటే ఈ కేసు నేను పరిశోధిస్తున్నట్టు మా చీఫ్‌కు తప్ప మరెవరికీ తెలియదు’ సమీర్ చెప్పాడు.
‘మనం ఎప్పుడు వెళ్దాం సర్’ అడిగింది భార్గవి.
‘రేపే మన ప్రయాణం. నాతో రావడం మీకు ఇబ్బంది ఏమీ లేదు కదా?’ అడిగాడు సమీర్.
‘లేదు సర్ ఇట్స్ మై ప్లెజర్’ అంది భార్గవి.
‘ఓకే రేపు మిమ్మల్ని నేనే కాంటాక్ట్ చేస్తాను’ చెప్పి లేచాడు సమీర్.
సమీర్ వెళ్లేవరకు అలానే చూస్తుండిపోయింది. సమీర్ కారు స్టార్ట్ చేశాక ఒక వ్యక్తి ఆ హాస్పిటల్‌లో వున్న మార్చురీ నుంచి బయటకు వచ్చాడు.
* * *
హైదరాబాద్
డార్క్ అవెన్యూ
ఆ ఇంట్లో వున్న ముగ్గురిలోనూ భయం.. చంద్రప్రభ వణికిపోతోంది. మధ్యమధ్య ఉలికిపాటుతో భయపడుతోంది. లైట్స్ అన్నీ ఆఫ్ చేశారు.
క్యాండిల్స్ వెలిగించారు.. మొత్తం పదమూడు క్యాండిల్స్ వెలిగించారు.
‘నాన్న ఈరోజు వస్తారా?’ చంద్రప్రభ అడుగుతుంది.
‘నిన్న కలిసినపుడు నాతో ఏమీ చెప్పలేదు’ తల్లి చంద్రకళ అంది.
ఒక్క క్షణం చంద్రలేఖ ఒళ్లు జలదరించింది. క్యాండిల్స్ వెలుతురులో ఆ ఇల్లు ప్రేతాత్మల విడిదిలా వుంది. చిన్న అలికిడి అయినా భయపడుతున్నారు.
‘నిన్న నాన్న నీతో ఏం మాట్లాడాడు?’ పెద్దకూతురు తల్లిని అడుగుతుంది.
‘మీరెప్పుడు నా దగ్గరికి వస్తారని అడిగాడు?’ తల్లి చెప్పింది.
‘మరి వెళదామా..?’ వెంటనే ఉత్సాహంగా అంది చంద్రప్రభ.
‘చెల్లిని అడుగు. నేను ఎప్పుడైనా సరే.. మూడు తాళ్లు కూడా సిద్ధం చేశాను..’ అంది తల్లి.

‘చెల్లీ చచ్చిపోదామా?’ అడిగింది చంద్రప్రభ.
వెంటనే చంద్రలేఖ చూపుడు వేలును పెదవుల మీద పెట్టుకుని ‘ష్’ కొత్తదెయ్యం వస్తున్నట్టుంది అంది తన సెల్‌ఫోన్‌లో కెమెరా ఆన్ చేసింది.
భయంతో ముడుచుకు పోయింది తల్లి.
చంద్రప్రభ కిటికీలకు పేపర్స్ సరిగ్గా అతుక్కుని ఉన్నాయా? లేదా? అని చెక్ చేసింది.
చంద్రలేఖ సెల్‌ఫోన్‌ను బయటకు తీసుకువెళ్లింది. లాప్‌ట్యాప్ ఓపెన్ చేసి సెల్‌ను దానికి కనెక్ట్ చేసింది. మెల్లిగా బయటకు వచ్చింది.. ఏవో నీడలు కదులుతున్నట్టు...
సరిగ్గా అప్పుడే...
డార్క్ అవెన్యూ పరిధిలో వున్న పోలీసుస్టేషన్‌లో సిఐ టేబుల్ మీద వున్న ఫోన్ రింగయ్యింది.
కళ్లు మూసుకుని కుర్చీలో వెనక్కి వాలిన సిఐ దుర్జన్‌కుమార్ ల్యాండ్ ఫోన్ రిసీవర్ ఎత్తాడు.
టేబుల్ మీద విస్కీ బాటిల్ వుంది.. చిప్స్.. చికెన్ బిర్యానీ.. స్టేషన్‌ను బార్ లా.. లాకప్‌ను బెడ్‌రూమ్‌లా వాడుకునే నీచ మనస్తత్వానికి కేరాఫ్ చిరునామా దుర్జన్‌కుమార్.. ప్రతీ క్షణం తమ సిఐని తిట్టుకుంటూనే ఉంటారు స్టేషన్‌లోని సిబ్బంది.. కానీ క్రమశిక్షణ ఎక్కువగా వుండే శాఖలో వౌనంగా భరిస్తున్నారు.. ఎప్పుడో ఒకప్పుడు ఎవరో ఒకరు ఇలాటి వాళ్లను శిక్షిస్తారని వారి నమ్మకం..
* * *
ఇంకా దుర్జన్‌కుమార్‌కు మందు తాలూకు కిక్కు దిగలేదు.. ‘యెవర్రా.. ఇంత రాత్రిపూట ఫోన్ చేసి నా విస్కీ కిక్కు కక్కుకునేలా చేసింది.. స్టేషన్‌లో ఒక్క నొక్కు నొక్కానంటే, కిక్కురుమనకుండా ఛస్తావ్..’ తన సహజమైన భాష మొదలుపెట్టాడు.
అవతలి వైపు నుంచి కంఠంలో తీవ్రత ఒక్క క్షణంలో గమనించి ‘సర్ మీరా.. సారీ సర్’ అంటూ అటెన్షన్‌లోకి వచ్చాడు.
‘ఆ పని మీదే వున్నాను సర్.. చట్టమూ.. శిక్ష.. ఉహూ లాభమూ.. కక్ష’ అని ఓ వెకిలి నవ్వు నవ్వాడు.
అవతల వ్యక్తి అయిదు నిమిషాలు మాట్లాడాడు. తర్వాత ఫోన్ పెట్టేశాడు.
అదే సమయంలో
ఆ పోలీసుస్టేషన్‌కు అంత అర్ధరాత్రి వేళ ఒకమ్మాయి ఆయాసంతో వగరుస్తూ పరుగెత్తుకు వచ్చింది. ఆమె మొహమంతా చెమట.. భయం భయంగా వెనక్కి చూస్తుంది. స్టేషన్ ముందు సెంట్రీ డ్యూటీలో వున్న వహీద్ ఆ అమ్మాయి వంక చూశాడు. ఆమె ప్రమాదంలో ఉందని అర్థం చేసుకున్నాడు.
‘ఏమైందమ్మా.. ఎవరైనా తరుముతున్నారా?’ ఆమె పరుగెత్తుకు వచ్చిన వైపు చూస్తూ అడిగాడు.
ఆ అమ్మాయి ‘అవును’ అన్నట్టు భయంగా తలూపింది.
‘ఎవరు’ తన తుపాకీని సరిచేసుకుని అడిగాడు వహీద్..
‘మా ఇంట్లో..’ అంటూ అతడిని తోసుకుని లోపలికి వచ్చింది. ఓ మూలన వున్న కూజాలోని నీళ్లను తల మీదుగా పోసుకుంది. ఆమె చేతులు వణుకుతున్నాయి. కూజా నేల జారి భళ్లున శబ్దం చేసి పగిలిపోయింది. ఆ శబ్దానికి స్టేషన్‌లో కునికిపాట్లు పడుతున్న స్టేషన్ రైటర్, అప్పుడే మందు మత్తులో నుంచి బయటకు వచ్చిన సిఐ దుర్జన్‌కుమార్ ఉలిక్కిపడ్డారు.
వహీద్ లోపలికి పరుగెత్తుకు వచ్చాడు.
* * *
కూజాలోని నీళ్లు మొత్తం ఆమె శరీరాన్ని తడిపేసాయి.
‘ఏయ్ ఎవర్నువ్వు.. స్నానం చేయడానికి ఇదేమైనా బాత్‌రూమ్ అనుకున్నావా?’ కోపంగా అన్నాడు దుర్జన్‌కుమార్.
‘మా ఇంట్లో దెయ్యం.. దెయ్యం నన్ను రేప్ చేయడానికి వెంటపడుతోంది’ ఒక్కోమాట కూడదీసుకుని చెప్పింది. స్టేషన్‌లో వున్న అందరూ ఉలిక్కిపడ్డారు ఒక్క సిఐ తప్ప.
దుర్జన్‌కుమార్ ఆమె వంక పరిశీలనగా చూశాడు. ఆమెను ఎక్కడో చూసినట్టు అనిపించింది.
‘నువ్వు నువ్వు.. ఆ పిచ్చిపిల్ల చంద్రప్రభవి కదూ’ అన్నాడు సి.ఐ.
వెంటనే టేబుల్ మీద వున్న పేపర్ వెయిట్‌ను దుర్జన్ కుమార్ తలకేసి కొట్టింది ఆమె.
అది కొద్దిలో మిస్సయ్యింది. దుర్జన్‌కుమార్ తలను రాసుకుంటూ వెళ్లింది. ‘అబ్బా..’ అని అరిచాడు. కొద్దిగా రక్తం వస్తోంది.
‘చంద్రప్రభ మా అక్క.. నా పేరు చంద్రలేఖ.. మా అక్క పిచ్చిదేమీ కాదు’ ఉక్రోషంగా అంది.
వహీద్ ఏదో చెప్పబోయాడు. మరో కానిస్టేబుల్ చంద్రలేఖను పట్టుకోబోయాడు. దుర్జన్‌కుమార్ కానిస్టేబుల్‌ను వారించాడు.
‘వద్దు తననేమీ అనొద్దు.. కొద్దిగా’ అని చేయి చూపెట్టి లూజ్ అన్నట్టు సైగ చేశాడు.
చంద్రలేఖ వంక చూసి ‘పద.. నేను వస్తాను.. ఆ దెయ్యం సంగతి చూస్తాను’ అన్నాడు తల మీద కట్టిన బొప్పిని రాసుకుంటూ.
‘సర్.. ఆ అమ్మాయిని రమ్మంటారా? అది అసలే అడవి. ప్రమాదకరమైన ఏరియా.. అందులోనూ ఈ అమ్మాయి?’ వహీద్ ఏదో చెప్పబోయాడు.
‘వద్దు. నేనొక్కడినే వెళ్తాను.. ఒకవేళ ఈ అమ్మాయి చెప్పినట్టు దెయ్యంలో మనుషులో ఉండొచ్చు.. మీరు ఇక్కడే వుండండి. స్టేషన్‌కు వచ్చి ఆపదలో వున్నాం కాపాడండి.. అని అడిగిన వాళ్లను కాపాడ్డం నా విధి’ అంటూ చంద్రలేఖ వైపు చూసి ‘పద’ అన్నాడు.
చంద్రలేఖ బుల్లెట్ మీద దుర్జన్‌కుమార్ వెనుక కూచుంది. కావాలనే జీపు తీసుకువెళ్లలేదు దుర్జన్‌కుమార్.
* * *
బుల్లెట్ గాలిని చీల్చుకుని వెళ్తున్నట్టు వెళ్తోంది. దుర్జన్ కుమార్ ఒళ్లు వేడెక్కడం మొదలుపెట్టింది. సరిగ్గా కొన్ని రోజుల క్రితం చంద్రప్రభ ఇలానే తన స్టేషన్‌కు వచ్చింది. తననెవరో రేప్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పింది. అప్పటికే డార్క్ అవెన్యూ గురించి, ఆ కుటుంబం గురించి వదంతులు మొదలయ్యాయి.. దానిని ఆసరా చేసుకుని చంద్రప్రభను డార్క్ అవెన్యూ పరిసరాలకు తీసుకువచ్చాడు.. దారుణంగా రేప్ చేశాడు.. ఎవరికైనా చెబితే ఆత్మలు కుటుంబాన్ని పీక్కు తింటాయని భయపెట్టాడు. ఒకరకమైన ఉన్మాద స్థితిలో వున్న చంద్రప్రభ భయపడిపోయింది.
చంద్రప్రభను రేప్ చేయడం వల్ల తనకు మరొక లాభం కూడా డబ్బు రూపంలో వచ్చి చేరింది. ఇప్పుడు చంద్రలేఖ. ఈ ఆలోచన దుర్జన్ కుమార్‌ను వేడెక్కిస్తుంది.
డార్క్ అవెన్యూ పరిసరాల్లోకి వచ్చింది బుల్లెట్. అంతా నిర్మానుష్యంగా ఉంది. డార్క్ అవెన్యూ భయంతో వుండే కొద్దిపాటి జనసంచారం కూడా లేదు... పైగా రాత్రివేళ.. శివారు ప్రాంతం.
కనుచూపు మేరలో డార్క్ అవెన్యూ.. చీకటి రహస్యాలను తనలో దాచుకున్నట్టు.. క్యాండిల్ లైట్ వెలుతురులో.. బుల్లెట్ ఆపి స్టాండ్ వేశాడు. చంద్రలేఖ భుజం మీద చేయి వేశాడు.

‘దెయ్యం లోపల వుంది’ తన ఇంటివైపు చూపిస్తూ చెప్పింది భయం నటిస్తూ...
‘అసలు దెయ్యం ఇక్కడే వుంది’ మనసులో అనుకుని చంద్రలేఖ భుజం మీద చేయి వేసి నొక్కాడు.
‘నువ్వు నువ్వు కూడా దెయ్యానివేనా?’ భయం నటిస్తూ అడిగింది చంద్రలేఖ.
‘మగ దెయ్యాన్ని...’ అని చంద్రలేఖను నేల మీదకి నెట్టేశాడు.
చంద్రలేఖ తాపీగా తడిగా వున్న చీరను విప్పేసింది. పేటీ కోట్ బ్లౌజ్‌తో వుంది.. చీరను తనే పీలికలు చేసేసుకుంది.. అర్థం కాలేదు దుర్జన్‌కుమార్‌కు. బహుశా మెంటల్‌గా బాలెన్స్ తప్పిందేమో’ అనుకున్నాడు.. తన బ్లౌజ్ చించేసుకుంది.. జుట్టును చెరిపేసుకుంది.. దుర్జన్‌కుమార్‌ను పట్టి రక్కేసింది.. ఆ ప్రయత్నంలో దుర్జన్‌కుమార్ చేతులు చంద్రలేఖ మెడను చుట్టేశాయి.. పెనుగులాట...
చంద్రలేఖ బలం ముందు దుర్జన్‌కుమార్ బలం బలహీనమైంది. అతను తాగిన మత్తులో వున్నాడు.. పైగా ఊహించని షాక్‌లో వున్నాడు.
పక్కనే వున్న ఐరన్ రాడ్ చేతిలోకి తీసుకుంది. ఆ రాడ్ ముందుగానే సిద్ధం చేసుకుంది.. దుర్జన్ కుమార్ శరీరాన్ని బలంగా తాకింది రాడ్..
అతని గొంతులో నుంచి పెద్ద కేక.. చంద్రలేఖ దూరంగా చెట్టు కింద వున్న టూత్ సెట్ తీసుకుంది. సినిమాల్లో డ్రాక్యులాను చూపించడానికి ఆ సెట్ వాడుతారు. అది రబ్బర్ లాంటి పదార్థంతో చేస్తారు.. ఇది బలమైన కోరల్లా వున్న స్టీల్ మెటల్‌తో చేసినట్టు.. పళ్లకు క్లిప్పుల్లా తగిలించుకుంది.
నేల మీద పడిన దుర్జన్ కుమార్ మీద కూచుంది. అతని గొంతు దగ్గర నోరు పెట్టింది. కోరల్లాంటి టూత్ సెట్‌ను అతని గొంతులోకి దింపింది. రక్తం ఫౌంటెన్‌లా చిమ్మింది.. కొద్ది క్షణాలు ఆలస్యమైనా ప్రాణాలు గాలిలో కలిసిపోయేవి.. ‘నా అక్క పిచ్చితనాన్ని భయాన్ని ఆసరా చేసుకుని ఘోరంగా రేప్ చేసావు.. అందుకు నీకు విధిస్తున్న శిక్ష ఇది’ మనసులో అనుకుని ఇంకా వాడియైన పళ్లను గొంతులోకి దింపబోయింది. అప్పుడే ఎవరో తనను భుజాలు పట్టి పైకి లేపడం గమనించింది. అప్పటికే స్పృహ తప్పి పడిపోయాడు దుర్జన్‌కుమార్.
‘చాలు బెహెన్.. నువ్వు ఆ పాపాత్ముడికి విధించిన శిక్ష చలా.. ఇంటికి వెళ్లిపో’ ఎదురుగా వహీద్.
ఒక్క క్షణం షాకైంది చంద్రలేఖ.
‘వెళ్లు బెహెన్‌జీ. అల్లా నిన్ను చల్లగా చూస్తాడు’ చెప్పాడు వహీద్.
రెండు చేతులు జోడించి తన ఇంటివైపు నడిచింది చంద్రలేఖ.
తలుపు తీయగానే చంద్రప్రభ ‘దెయ్యాన్ని చంపేసావా?’ అని అడిగింది.
‘చంపేశాను’ అని తలుపు వేసి బోల్టు పెట్టింది.. క్యాండిల్స్‌ను ఆర్పేసింది. చీకట్లో అందరూ నిద్రపోయారు - చంద్రలేఖ తప్ప.
* * *
రైల్వేస్టేషన్‌లో నుంచి బయటకు వచ్చారు సమీర్, భార్గవి.
ఇంకా పూర్తిగా తెల్లవారలేదు. అప్పటికే రద్దీ మొదలైంది.. చివరి స్టేషన్ కావడంతో ప్రయాణీకులంతా దిగారు. చాలాకాలం తర్వాత హైద్రాబాద్‌లో అడుగుపెట్టిన భార్గవిలో చెప్పలేని ఎక్సయిట్‌మెంట్.. ఒక స్ట్రేంజర్‌తో (అపరిచితుడితో) తాను వందల కిలోమీటర్లు ప్రయాణం చేసింది. అదీ ఒక స్పైతో.. సిబిఐ గూఢచారితో. ఈ ప్రయాణం ఎటువైపు తీసుకువెళ్తుందో.. చిన్న గగుర్పాటు.. అది ఎమోషన్‌తో కలిగిన గగుర్పాటు..
తమకు గెస్ట్‌హౌస్‌లో బస ఏర్పాటు చేశారు. ఒక అపరిచిత వ్యక్తితో అదీ సిబిఐ ఆఫీస్‌తో కలిసి ఒకే ఇంట్లో ఉండబోతుంది. సమీర్ స్టేషన్ బయటకు రాగానే క్యాబ్ బుక్ చేశాడు. క్యాబ్ వచ్చింది. మెట్రో రైలు రాకతో మారిన హైద్రాబాద్ సరికొత్త అందాలతో మెరిసిపోతున్నట్టు అనిపించింది.
భార్గవి కూడా మంచు తెరల్లో హైద్రాబాద్ సొబగులు చూస్తోంది.
‘్భర్గవిగారు మనం ఫ్రెషప్ అయి వెంటనే ఆక్షన్‌లోకి దిగాలి. డార్క్ అవెన్యూకు వెళ్లాలి...’ అన్నాడు సమీర్.
‘ష్యూర్ సర్. కానీ ఒక్క విషయం. నన్ను భార్గవి అనండి చాలు.. గారు వద్దు’ అంది భార్గవి.
‘ఓకే భార్గవిగారూ.. సారీ భార్గవి’ అన్నాడు సమీర్.
క్యాబ్ గమ్య స్థానానికి చేరుకుంది. కారులో నుంచి దిగారు ఇద్దరూ.. తమ లగేజీని కిందకి దించాడు. గెస్ట్‌హౌస్ సినిమా వాళ్ల ఇల్లులా వుంది. లోపలికి అడుగుపెట్టారు ఇద్దరూ.
* * *
డార్క్ అవెన్యూ పరిసర ప్రాంతంలో కలకలం. సిఐ దుర్జన్‌కుమార్ స్పృహలేని పరిస్థితిలో ఉన్నాడు. అతని మెడ మీద కోరల్లాంటి పళ్లను దించిన గుర్తులు ఉన్నాయి. సిఐ దుర్జన్‌కుమార్‌ను ముందుగా చూసింది కానిస్టేబుల్ వహీద్. తమ సిఐ ఎంతకూ రాకపోవడంతో సిఐని వెతుక్కుంటూ వచ్చిన వహీద్‌కు గాయాలతో నెత్తుటి మడుగులో వున్న సిఐ కనిపించాడు. వెంటనే అంబులెన్స్‌లో ఉన్నతాధికారులకు విషయాన్నీ తెలియజేశాడు.
ఈ విషయం బయటకు పొక్కడంతో మీడియా అంతా వచ్చింది. కెమెరాలు హుషారుగా వున్నాయి. రేటింగ్ పెంచుకోవడానికి ఛానెల్స్‌కు భలే మంచి చౌక బేరం.. జనం గుమిగూడారు.
* * *
క్రైమ్ సీన్
పోలీసు ఉన్నతాధికారులు వచ్చారు.. పక్కనే వహీద్ స్ట్ఫిగా నిలబడి వున్నాడు. ఓ పక్కన సిఐ దుర్జన్ కుమార్ తీవ్రమైన గాయాలతో పడి వున్నాడు. అతని ఒంటి మీద గోళ్లతో రక్కిన గుర్తులు వున్నాయి. మెడ మీద పంటిగాట్లు వున్నాయి... డిసిపి అవినాష్ వహీద్ వైపు చూసి ‘ముందు సిఐని చూసింది నువ్వే కదూ?’ అన్నాడు.
‘యస్సార్’ స్ట్ఫిగా నిలబడి సెల్యూట్ చేసి చెప్పాడు వహీద్.
‘అసలు ఏం జరిగింది..? సిఐ దుర్జన్‌కుమార్ ఒక్కరే ఎందుకు ఇక్కడికి వచ్చాడు?’ డిసిపి అవినాష్ అడిగాడు.
‘సర్ నిన్న అర్ధరాత్రి ఆ ఇంట్లో..’ అంటూ డార్క్ అవెన్యూ వైపు చూపించి.. ఆ ఇంట్లో వుండే ఒకమ్మాయి మన స్టేషన్‌కు వచ్చి కంప్లైంట్ ఇచ్చింది సర్’ చెప్పాడు వహీద్.
‘ఏమని.. డిటైల్డ్‌గా చెప్పు’ డిసిపి అడిగాడు.
‘తనను దెయ్యం రేప్ చేయాలని వెంటపడనుందని చెప్పింది సర్’
‘వ్వాట్.. దెయ్యమా?’
‘అవును సర్. ఆ అమ్మాయికి మెంటల్ బాలెన్స్ లేనట్టుంది. అంతకు ముందు కూడా ఆ అమ్మాయి వాళ్ల అక్కయ్య అలాగే వచ్చి మన స్టేషన్‌లో ఓ కంప్లైంట్ ఇచ్చింది సర్.. ఆ దెయ్యం తనను రేప్ చేసిందని కూడా చెప్పింది సర్.. ఆ అమ్మాయిని పరీక్షించిన డాక్టర్ ఆ అమ్మాయికి మతిస్థిమితం లేదని చెప్పడంతో ఆ కేసు క్లోజ్ అయ్యింది సర్.. మళ్లీ నిన్న రాత్రి అలాగే ఇంకో అమ్మాయి వచ్చింది సర్.. మన సిఐ సర్ ఆ అమ్మాయిని తనే ఇంటి దగ్గర దిగబెట్టి విషయం ఏమిటో తెలుసుకుంటానని స్వయంగా బులెట్ మీద ‘బుల్లెట్ మీద’ అనే పదం నొక్కి చెబుతూ.. తీసుకువెళ్లారు సర్.. ఆ తరువాత ఎంతకూ సిఐ సర్ రాకపోవడంతో అనుమానంతో సర్‌ను వెతుక్కుంటూ వచ్చేసరికి సిఐ సర్ ఇలా కనిపించారు సర్.. దెయ్యం దెయ్యం అంటూ అనడం కూడా వినిపించింది సర్.. ఆ అమ్మాయి కూడా దెయ్యం దెయ్యం అని అరుస్తూ లోపలికి పరుగెత్తి బోల్టు పెట్టుకుంది సర్.. వెంటనే మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను సర్’ చెప్పాడు స్క్రీన్‌ప్లేను సినిమా డైరెక్టర్‌కు స్టోరీ రైటర్ చెప్పినట్టు చెప్పాడు వహీద్.
అప్పటికే అంబులెన్స్ వచ్చింది.. ఫోరెన్సిక్ నిపుణులు వచ్చారు.

(ఇంకా ఉంది)

తేజారాణి తిరునగరి