వీక్లీ సీరియల్

పాతాళస్వర్గం-33

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శకుని కొడుకుని అక్కున చేర్చుకుని ఆశీర్వదించాడు. అతని మొహంలో దిగుల్లాంటిదేం లేదు. కొడుక్కి ధైర్యం కలిగించేలా కొన్ని ఉపమానాలు చెప్పి నవ్వించాడు. బిక్కమొహంతో చూస్తున్న గౌతమి దగ్గరగా వచ్చి-
‘హలో మిసెస్ క్లూ ఎవిడెన్స్! నిన్ను చూస్తుంటే నాకు భయం వేస్తోంది. మిస్ క్లూ గానే ఎన్నో క్లూస్ ఇచ్చి అందర్నీ హడలగొట్టావ్. ఇప్పుడు క్లూకి ఎవిడెన్స్ కూడా తోడయ్యాడు. ఎన్ని ‘క్లూ’లైనా తీసి ఎవరికైనా అందచేసుకోండి. కానీ మా సింగపడవి ప్రశాంతతని, ప్రకాశాన్ని గురించి మాత్రం ఎవరికీ క్లూ ఇవ్వకండి. అవి కూడా మాకు మిగలకుండా పోతాయి’ అన్నాడు భయం నటిస్తూ. అందరూ గలగల నవ్వేశారు.
‘పోండంకుల్’ సిగ్గుపడిపోయింది గౌతమి.
‘ఇప్పుడు మేం చెయ్యబోయేదదే’ అంటూ నవ్వేశాడు శకుని. తర్వాత అందరి దగ్గరా మరోసారి సెలవు తీసుకుని తన వాళ్లతో కలిసి వెళ్లిపోయాడు.
‘్థంక్యూ థాంక్యూ వెరీమచ్’ చందనకేసి కృతజ్ఞతగా చూస్తూ అన్నాడు విజయనాయక్.
‘నేనే మీకు థాంక్స్ చెప్పాలి. ఆయన్ని గురించి వినడమే గానీ చూసే భాగ్యం కలగలేదు. బ్లాక్‌టైగర్ని చూడాలన్న నా కోరిక కూడా మీ అందరివల్లా కలిగింది. నిజంగా వాళ్లిద్దరూ కూడా చరిత్రకారులు’ మనస్ఫూర్తిగా అన్నాడు చంద్ర. నాయక్ కళ్లు తళుక్కుమన్నాయి.
‘మీ అందరికన్నా నేను చాలా అదృష్టవంతుణ్ణి బాబూ! సాక్షాత్తూ ఆ దేవతలే వచ్చి నా బిడ్డ పెళ్లి జరిపినట్టుంది. లక్ష్మీదేవి లాంటి నా కూతురికి శ్రీ మహావిష్ణువు లాంటి భర్తని తెచ్చిన పుణ్యం మీదే’ అన్నాడు శంకరయ్య.
‘అదంతా మీరు చేసిన పూజలకి ఆ భగవంతుడు మెచ్చి ఇచ్చిన వరం’ అన్నాడు చంద్ర చేతులు జోడిస్తూ.
‘నిజం! శంకరయ్యగారి పూజలు వృథా కాలేదు. చక్కని అమ్మాయికి మరింత చక్కని వరుణ్ని జత చేశాడు. ఇద్దరూ కలిసి ఆయన్ని పసిబిడ్డలా చూసుకుంటారు’ అన్నారెవరో.
‘అవునూ.. ఈ డాక్టరూ, ఆ సి.ఎం.గారి కుడిచెయ్యి లాంటి పి.ఎ. ప్రభుగారూ నగరంలోనే బాధ్యతా యుతమైన పదవులు నిర్వహిస్తున్నారు. ఇంతకీ వీళ్లు నగరంలో వుంటారా లేక ఈ కొండ మీదే వుంటూ అటూ ఇటూ పరుగులు తీస్తుంటారా?’ అల్లరిగా అంది చందన.
‘మన సి.ఎం.గారు ముందు చూపుతో కుటుంబ నివాస యోగ్యంగా కూడా వుండేలా చూసి మరీ హాస్పిటల్ కట్టించారు. ఎక్కడ వుండాలనిపిస్తే అక్కడుంటారు. మన పంతులు గారికి శిష్యులు చాలామందే ఉన్నారుగా. వాళ్లు చూసుకుంటుంటే, ఈయన దైవపూజలూ అవీ పూర్తి చేసి అటు ఇటు తిరుగుతుంటారు’ అన్నాడు ప్రయాగ నవ్వుతూ.
‘మరి నీ సంగతేమిటి అమ్మడూ?’ గౌతమి తల సున్నితంగా ఎత్తుతూ అంది చందన.
‘మా నాన్న, ఈయనా ఎక్కడుంటే అక్కడ’ అంటూ మళ్లీ తలదించేసుకుంది గౌతమి.
‘ఇద్దరూ చెరో చోటా వుంటే?’ మరింత అల్లరిగా అంది చందన. గౌతమి కంగారుగా చూసింది. ముసిముసిగా నవ్వారంతా.
‘ఇదిగో, పెళ్లి చేసి మేము, చేసుకున్న మీరు బాగా అలసిపోయాం. రేపు మళ్లీ బోల్డు తతంగం ఉంది. ఇదిగో ప్రభూ! మీ ఆవిడతో ఏదైనా మాట్లాడాలంటే మాట్లాడుకో. పది నిమిషాలు టైమిస్తున్నాను. మాట్లాడుకుని వచ్చెయ్యండి’ ప్రభుకేసి చిలిపిగా చూస్తూ అని, అందర్నీ వెంటబెట్టుకుని ఇంట్లోకెళ్లిపోయాడు చంద్ర.
ఆ పరిసరాల్లో గౌతమి, ప్రభు తప్ప ఎవరూ లేరు. గౌతమి తల మరింత వంగిపోయింది. చెంపలు కెంపులయ్యాయి. అంత చలిలోనూ అరచేతులు చెమటలు పట్టాయి. ఆమెనలా చూస్తుంటే ప్రభు మనసులో చిలిపి ఆలోచనలు వచ్చేశాయి.
‘ఏయ్! ఏవిటదంతా సిగ్గే?’ అన్నాడు ఆమె చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుంటూ. ఆమె మరింత కంగారు పడిపోయింది.
‘మైడియర్ క్లూ! ఇక్కడ మనిద్దరమే ఉన్నాం. ఏం చేసుకున్నా అడిగే వాళ్లుండరు. భయపడకు’ అన్నాడామె చెవిలో గుసగుసగా.
‘నా పేరు ‘క్లూ’ కాదు’ మెల్లగా అందామె.
‘నేనలాగే పిలుస్తాను’ అల్లరిగా అన్నాడతను. ఆమె నడుం చుట్టూ చేతులు వేసి గుండెలకి హత్తుకుంటూ. అతని స్పర్శకి మనసు, తనువు అదుపు తప్పుతున్నా-
‘అలా అయితే నేనూ నిన్ను ఎవిడెన్సూ అని పిలుస్తాను’ అంది కోపం నటిస్తూ.
‘నువ్వెలా పిల్చినా నాకిష్టమే డియర్. కానీ నువ్వలా ముడుచుకు పోవడమే బాగా లేదు. నేను ప్రేమించి, ఆరాధించి చేసుకున్న సాహస యువతి, అల్లరి పిల్ల ఇలా సిగ్గుల మొగ్గయి టచ్‌మి నాట్ అన్నట్టుంటే నాకు నీరసం వచ్చేస్తోంది. అందుకే మైడియర్ క్లూ! నువ్వు నా పాత గౌతమిలాగే ఉండాలి’ అంటూ ఆమె పెదవుల మీద పెదవులు ఆన్చబోయాడు ప్రభు.
‘తొందరపడకు మిస్టర్ ఎవిడెన్స్! ఆ ముద్దు ముచ్చట్లన్నీ తర్వాత...’ అంటూ అల్లరిగా అతని జబ్బమీద గట్టిగా గిల్లి, మెరపులా ఇంట్లోకి పరుగెత్తింది గౌతమి పకపక నవ్వుతూ.
మర్నాడు మధ్యాహ్నం వధూవరులని కూర్చోబెట్టుకుని వేడుకలు జరుపుకున్నారంతా. అప్పుడే గౌతమి సెల్ మోగింది. సెల్ ఆన్ చేసింది. చందన స్పీకర్ కూడా ఆన్ చెయ్యమనడంతో, స్పీకర్ ఆన్ చేసి-
‘హలో’ అందామె.
‘గౌతమిగారేనా?’ మృదువుగా అడిగిందో మగ గొంతు.
‘యా! మీరెవరు?’ అంది గౌతమి.
‘నేను మీకు తెలిసిన వాణ్నే మేడమ్. ఎవరో గుర్తు పట్టండి’ చనువుగా అన్నాడతను. ఆమె క్షణం ఆలోచించింది. అయినా ఆ గొంతు ఎవరిదో గుర్తుకు రాలేదు. ఎవరో బాగా తెలిసిన వాడే అనిపించింది అతను చనువుగా మాట్లాడడాన్నిబట్టి.
‘సారీ! నేను గుర్తు పట్టలేదు. ఎవరు?’ అంది కుతూహలంగా.
‘ఏంటి మేడమ్! అప్పుడే మర్చిపోయారా? కాస్త ఆలోచించండి’ కవ్వింపుగా అన్నాడతను. ఆమెలో కుతూహలం పెరిగిపోయింది.
‘వెరీ సారీ! చూస్తుంటే మీరు బాగా తెలిసినవారే అనిపిస్తోంది. కానీ గుర్తు రావడం లేదు.. ఓ చిన్న క్లూ ఇవ్వండి చెప్పేస్తాను’ అంది చిన్నపిల్లలా.
‘క్లూ కే క్లూ ఇవ్వాలా?’ పెద్దగా నవ్వాడతను.
గౌతమి కళ్లు తళుక్కుమన్నాయి.
‘అక్కర్లేదు జింబో! నాకు తెలిసిపోయింది. ఫోన్ చేసి మాట్లాడేది మా జింబో. అంతే కాదు అక్కడ చిన్నీ వాళ్లంతా వున్నారు. మా సి.ఎం.గారు మీ అందరికీ పప్పు బెల్లాల్లా సెల్‌ఫోన్లు ఇచ్చి మళ్లీ మమ్మలందర్నీ ఫూల్స్ చేశారు. యామై రైట్?’ అంది ఉత్సాహంగా. అంతకన్నా ఉత్సాహంగా అరిచారు చిన్ని, సిద్దూ వాళ్లు. తర్వాత వేడుకల సంగతి మర్చిపోయినట్టు ఇట్నించి గౌతమీ వాళ్లూ, అట్నించి ఆటవికులూ తమని తాము మర్చిపోయినట్టు ఎన్నో మాట్లాడుకున్నారు. స్విచ్ ఆఫ్ చేసి తలెత్తి చూసింది గౌతమి. చిరునవ్వుతో ఆమెకేసే చూస్తున్నాడు చంద్ర. గౌతమి కళ్లు నీళ్లతో నిండిపోయాయి. అతని కేసి కృతజ్ఞతగా చూస్తూ, రెండు చేతులూ జోడించి-
‘్థంక్యూ సర్! నిజంగా మీరు దేవుడే. నిజమైన ప్రజాపాలకుడంటే మీరే! ఎదుటి వారి మనసుల్ని చదివి వాళ్లు అడక్కుండానే వారి కోరికలు తీర్చే ఆపద్బాంధవుడు. మీలాంటి వారి పాలనలోనే దేశం సుభిక్షంగా ఉండేది. మీలాంటి నాయకులే దేశమంతా వుంటే మన దేశమే రామరాజ్యం అయిపోతుంది’ తనని తాను మర్చిపోయినట్టు ఉద్వేగంగా అంది గౌతమి. దానికి చంద్ర కాస్త ఇబ్బందిగా చూస్తే మిగతా వారందరూ హర్షధ్వానాలు చేశారు పరిసరాలు దద్దరిల్లేలా.
వారి ఆనందం కలకాలం నిలుస్తుంది అన్నట్టు ఆలయంలో జేగంట గణగణమంటూ ‘తథాస్తు’ పలికింది. (అయిపోయింది)
=======================================================
జంగానియా..
ప్రకృతి కనె్నర్ర చేస్తే నల్లబడ్డ ఆకాశం..
ప్రేతాత్మలు మేఘాలను ఆవహించినట్టు..
ఈదురుగాలి గబ్బిలాలతో కలిసి గాలిలోకి ఎగిరినట్టు..
చితిమంటలు మృత్యువును ఆహ్వానిస్తున్నట్టు..
ఎటుచూసినా సమాధులు..
అమావాస్య..
అర్ధరాత్రి..
పిశాచాలు బలం పెంచుకునే నిశిరాత్రి..
తరతరాలుగా క్షుద్రోపాసనలతో ప్రేతాత్మలను ఆవాహన చేసుకున్న జంగానియా..
ఆ ప్రాంతమంతా భీతి కొలిపేలా ఉంది..
సమాధుల మధ్య పెద్ద చితిమంట..
ఆ చితి మంట ముందు తొంభై తొమ్మిదేళ్ల తీశ్మార్..
చూపుల్లో క్రూరత్వం.. గొంతులో తగ్గని గాంభీర్యం..
నలుపురంగు వస్త్రాన్ని ధరించి కాటుకను పెట్టుకున్న కాళరాత్రి భయానకంగా కనిపిస్తున్నాడు..
అంతలో ఆ భయంకర ప్రదేశానికి హెలికాప్టర్ వచ్చి ఆగింది..
అందులోంచి రాజేంద్రనాథ్, శివప్రసాద్ దిగారు..
మరో హెలీకాప్టర్ వచ్చింది..
అందులోంచి చంద్రకళ, చంద్రప్రభ, చంద్రలేఖలు దిగారు..
తీశ్మార్ గొంతులోంచి క్షుద్రమంత్రాలు ఆ స్మశాన ప్రాంతంలో ప్రతిధ్వనిస్తున్నాయి..
వారందరూ డార్క్ అవెన్యూ నుంచి అక్కడికి చేరారు..
అక్కడ ఏం జరుగుతోంది? అంతుచిక్కని డార్క్ అవెన్యూ రహస్యం ఏంటి?
తెలుసుకోవాలంటే.. చదవండి.. ఆద్యంతం ఉత్కంఠను రేపే
తేజారాణి తిరునగరి హారర్ థ్రిల్లర్

ఆదివారం ఆంధ్రభూమి పాఠకుల కోసం.. వచ్చేవారం నుంచే

-రావినూతల సువర్నాకన్నన్