S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వీక్లీ సీరియల్

01/12/2020 - 23:05

ఉదయం.. సమయం తొమ్మిది.
షణ్ముగం పూజ గదిలోనుండి హాల్‌లోకి వచ్చాడు.
‘నమస్కారమండీ’ అని విన్పించింది.
తలెత్తి చూశాడు.
బదులుగా ప్రతి నమస్కారం చేశాడు.
తన ఆగమనంతో లేచి నిలబడిన ఆ అపరిచిత వ్యక్తిని కూర్చోమని సైగ చేస్తూ, ఆ వ్యక్తికి ఎదురుగా సోఫాలో కూర్చున్నాడు షణ్ముగం.

01/05/2020 - 23:23

ముద్దొచ్చే మోము, చురుకైన కళ్లు, వినయం ఉట్టిపడే నడక. అందరినీ ఆశ్చర్యపరిచే మేధస్సు. ఆ కుర్రాడ్ని చూస్తే చూపురులిట్టే ఆకర్షితవౌతారు. ఇక స్కూల్ టీచర్స్ విషయం చెప్పనక్కర్లేదు. అఖిల్‌ని అందరూ లైక్ చేస్తారు.
సుధా మేడమ్ టేప్ ఆన్ చేసింది. సన్నగా మ్యూజిక్ మొదలయ్యింది.
‘డ్యాన్స్ విత్ మ్యూజిక్’ అనేసరికి పిల్లల్లో తిరిగి ఉత్సాహం ఉరకలు వేసింది. సంగీతానికి అనుగుణంగా తలల్ని ఊపసాగారు.

12/28/2019 - 23:44

అందరూ ఒకచోట సమావేశమయ్యాక హెడ్ పిల్లల్నుద్దేశించి మాట్లాడింది.
‘డియర్ స్టూడెంట్స్! చదువు చదువూ అని బోర్ ఫీలవకుండా మిమ్మల్ని ఉల్లాసపరచాలనే ఉద్దేశంతో.. రొటీన్‌కి భిన్నంగా సరదాగా సందడిగా గడపాలని మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాం.

12/22/2019 - 23:04

వేదవ్యాస్ అంచనా నిజమయ్యింది. రెండు నిమిషాల అనంతరం పేలిపోకుండా మిగిలి వున్న బెలూన్స్ ఇరవై కిలోల అఖిల్ బరువుని గాలిలో నిశ్చలంగా నిలపలేక అతడిని నెమ్మదిగా కిందికి దింపసాగాయి. వలతో రక్షక దళం అఖిల్‌ని కవర్ చేశాక అందరూ హాయిగా ఊపిరి పీల్చుకున్నారు.
అంతలోనే చకచకా జరిగిపోయిందా సంఘటన.
అప్పటివరకూ మామూలుగానే వున్న అఖిల్‌లో నెమ్మదిగా ఏదో మార్పు చోటు చేసుకోసాగింది.

12/15/2019 - 23:40

కొత్త సీరియల్ ప్రారంభం
*
‘పట్టపగలే బ్యాంక్ దోపిడీ’
అనే వార్త ఆంధ్ర రాష్ట్రంలో సంచలనం సృష్టించింది!
తెలుగు దినపత్రికలన్నింటిలోనూ ఫ్రంట్ పేజీలో కవర్ చేసిన ఆ న్యూస్ బ్యాంక్ ఖాతాదార్లని, డిపాజిటర్లని భయకంపితుల్ని చేసింది.
సుమారు అయిదు వందల కోట్ల రూపాయల టర్నోవర్ కల్గి ఉందా బ్యాంక్. దాని పేరు ‘మనీ మనీ కోఆపరేటివ్ బ్యాంక్’.

12/13/2019 - 06:13

తీశ్మార్ గొంతులో నుంచి క్షుద్ర మంత్రాలు ఆ స్మశాన ప్రాంతంలో ప్రతిధ్వనిస్తున్నాయి.
తీశ్మార్ లేచాడు.. అతని చేతిలో మంత్రదండం లాంటిది ఉంది.. దాని పిడిభాగం పుర్రె గుర్తు ఉంది.
దానిని చంద్రకళ తల మీద పెట్టి

12/02/2019 - 23:26

కారు వెళ్తోంది. భార్గవి సమీర్ వంక చూసి అడిగింది.
‘శివప్రసాద్ వర్మ ఎక్కడున్నాడో కచ్చితంగా తెలిసినట్టే కదా?’
శివప్రసాద్ వర్మ ఎక్కడున్నాడో చెప్పాడు సమీర్.
‘అక్కడా? పెద్ద కోటీశ్వరుడు.. అలాంటి హోటల్‌లో?’

11/26/2019 - 23:09

సిఐ దుర్జన్‌కుమార్ ఎట్టకేలకు నోరు విప్పారు. తాను నోరు విప్పకపోతే తన నోరు శాశ్వతంగా మూతపడుతుందన్న భయం అతనిలో మొదలైంది. ఎప్పుడైతే భయం మనిషిలో మొదలవుతుందో అప్పుడే మనిషిలో మార్పు మొదలవుతుంది. ఆ మార్పు ఎలాంటిదైనా కావచ్చు. ముందు డబ్బు కావాలనుకున్నాడు. డబ్బు కావాలా? నిజాయితీగా డ్యూటీ చేయడం కావాలా? అన్న ప్రశ్నకు డబ్బే ముఖ్యం అనుకున్నాడు.. నిజాయితీని అమ్ముకున్నాడు.

11/18/2019 - 22:32

‘కనిపిస్తారు. కానీ మీరు కొద్దిగా ఓపిక పట్టాలి. మీ వారు వచ్చాక వెంటనే మా గురించి చెప్పకూడదు’ చెప్పాడు సమీర్.
‘ఎందుకు?’ అనుమానంగా ప్రశ్నించింది చంద్రకళ.
‘మేము తనకు బాగా పరిచయం లేము కదా.. భయంతో వెళ్లిపోవచ్చు’ చెప్పాడు సమీర్.
కొద్దిగా కన్విన్స్ అయినట్టు మొహం పెట్టి సరేనన్నట్టు తలూపింది.

11/09/2019 - 19:14

సమీర్ చంద్రలేఖ చెబుతున్నది వింటున్నాడు. భార్గవి ఒక విధమైన షాక్‌లో వున్నది. చెబుతున్నది తన స్నేహితురాలు.. ఒక క్రిమినాలజీ చదివిన వ్యక్తి. కానీ ఎక్కడో లాజిక్ మిస్సవుతోంది.
ఆ లాజిక్‌ను వెతుకుతున్నాడు సమీర్.
‘నేను చెప్పింది మీరు నమ్మట్లేదు కదూ’ చిన్న అనుమానంతో అడిగింది చంద్రలేఖ.

Pages