వాసిలి వాకిలి

యోగ సాధనతో తేజస్సంపన్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్య గురులు శుభగ్రహాలు. పారదర్శక గ్రహాలు. శుద్ధ గ్రహాలు. అంటే అశుద్ధతకు అవకాశమివ్వని గ్రహాలు. ఒకవిధంగా ఈ రెండు గ్రహాలను పవిత్ర గ్రహాలుగాను పరిగణిస్తున్నాం. ఇక్కడ పవిత్రం అంటే అపవిత్రతకు తావులేని గ్రహాలని అర్థం. పైగా సూర్య గురులు మంచి స్నేహితులు. అంటే సఖ్య గ్రహాలు. ఈ కారణంగా సూర్య గురులు యోగ కారకులు. అంటే యోగ సాధకులకు, ధ్యానులకు హితులు, అనుకూలురు. ఆథ్యాత్మికతలోనూ, గికతలోనా సూర్య గురులు ప్రథమ తాంబూలం అందుకుంటుంటారు.
సూర్య గురులు మనకు మార్గదర్శులు
భౌతిక పరిధులలో అంటే ప్రాపంచికంగా సూర్యగురులు మనకు అధికారం ఇస్తుంటారు... గౌరవం కట్టబెడుతుంటారు. సంపదల విషయంలోనూ చిన్నచూపు చూడరు. అయితే ఎంత అవసరమో అంతే ఇస్తుంటారు. కారణం అధిభౌతికత విషయంలో వీరిద్దరి దృష్టి మనపై ఉండటమే. సంస్కృతీ సంప్రదాయాలపై మొగ్గుచూపేలా చేస్తుంటారు. తెలివితేటలను కాస్త ఎక్కువగానే ఇస్తారు. మనం ఇతరులకు సహాయ సహకారాలందించాలనుకున్నప్పుడు ఈ ఇద్దరూ ముందడుగులు వేస్తూ మనకు మార్గదర్శకులవుతుంటారు. అందుకే ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ఆచార్యులు, గురువులు మనకు ఆరాధ్యులవుతుంటారు.
సౌర కుటుంబంలో అన్ని గ్రహాల కంటే అతి ప్రాచీన, తొలి గ్రహం సూర్యుడయితే సూర్యగ్రహం ఖగోళ మండలం రూపుదిద్దుకున్న పది లక్షల సంవత్సరాలకు గురుగ్రహం రూపొందింది. పైగా సూర్యగ్రహం మన భూగ్రహం కంటే ఇరవై రెట్ల సాంద్రగ్రహం. ఇంకా చెప్పుకోవాలంటే మన భూమి అయస్కాంత క్షేత్రం కంటే గురు గ్రహ అయస్కాంత క్షేత్రం పద్నాలుగు రెట్లు పెద్దది. అందుకే మనందరికీ గురువు అంటే అంత ఆకర్షణ.
బృహస్పతి గురువు ఒక్కరే!
సౌర కుటుంబంలోని కాంతివంత గ్రహాలలో గురు గ్రహానిది నాల్గవ స్థానం. రాత్రుళ్లు మన భౌతిక నేత్రాలతో ఈ గ్రహాన్ని చూడగలం. అప్పుడప్పుడు పగలు సూర్యుడి వెలుగు తక్కువగా ఉన్నప్పుడు సైతం గురు గ్రహాన్ని మన నేత్ర ద్వయంతో వీక్షించగలం. దేవతల గురువు బృహస్పతి ఈ గురువే. సౌర కుటుంబాన్ని శుద్ధి చేసేది గురు గ్రహమే. అందుకే గురు గ్రహాన్ని సౌరకుటుంబాన్ని నిత్యం శుద్ధి చేసే ‘వాక్యూమ్ క్లీనర్’ అని శాస్తజ్ఞ్రులు అంటుంటారు. మన ఆత్మను, అహాన్ని, విశ్వాసాన్ని ప్రతిఫలించేది కూడా గురువే.
ఆత్మవిశ్వాసమే ఒక్కోసారి అహంభావంగా ప్రతిబింబితమవుతుంటుంది. మన కీర్తిప్రతిష్టలే అహంకారుల్నీ చేస్తుంటాయి. ఇలా మనలో రెండో కోణం బయటపడటానికి కారణం గురు ప్రభావమే. ఎంతో పైకి ఎదిగిన వారిని మనం చూస్తుంటాం...ఒక ఉన్నత స్థాయికి చేరుకున్నాక వారు మిడిసిపడుతూ జారిపోతుంటారు. ఇలా జారిపోవటం కేవలం భౌతిక పరిధులలో మాత్రమే కాదు అధిభౌతికంగాను. ఈ రోజు ఎందరు మఠాధిపతులు, మతాధిపతులు, యోగాచార్యులు, ఆథ్యాత్మిక గురువులు కీర్తి ప్రతిష్టల వ్యామోహంలో పడి జారిపోతుండటం ఇందువల్లనే.
గురువు అంటే సర్వవ్యాపి
గురువు అంటే తనకు తానుగా మిగిలిపోయేవాడు కాదు... సర్వత్రా వ్యాపించేవాడు. మంచిని పెంచేవాడు... చెడుని తునిమేవాడు. అంటే మంచివారిని రక్షించేవాడు. చెడుమార్గం పట్టే వారిని దారి మళ్లించి మంచి మార్గంలో పయనింపజేసేవాడు. దీనే్న గురుమార్గం అంటుంటాం.
గురువు అంటేనే దివ్యజ్ఞాన ప్రతీక. దివ్వత్వానికి ప్రతిబింబం. ప్రతిరోజూ ఉదయానే్న మనపై సూర్యుడి ప్రభావం మూడు గంటలు ఉంటే గురువు ప్రభావం మరో మూడు గంటలు ఉంటుంది. ఇటు సూర్య గురువులతో పాటు శుక్రుడు సైతం మరో మూడు గంటలు మనపై ప్రభావం చూపుతాడు. అంటే సూర్యుడు, గురువు, శుక్రుడు మనకు శుభఫలదాతలన్న మాట. అంటే మనం మూడు గ్రహాల పర్యవేక్షణలో దైనందిన కార్యక్రమాలను ప్రారంభిస్తాం. ఈ మూడు గ్రహాల మార్గదర్శకత్వంలోనే మన రోజంతా గడుస్తుంది. అందుకే మనం మన పనులను ఉదయమే ప్రారంభించాలనేది.
అహంభావమూ ఆత్మవిశ్వాసమూ అధికమే!
గురువు కంటే సూర్యుడి ప్రభావం అధికంగా ఉంటే మన ప్రవర్తనకు అహంభావం జత కలుస్తుంది. అదే సూర్యుడి కంటే గురువు ప్రభావం అధికమైతే మనలో సాత్వికత చోటుచేసుకుని జ్ఞానవికసనం జరుగుతుంది. భౌతిక వనరుల కంటే అదిభౌతిక వనరుల వైపే మొగ్గు చూపి ఉంటాం. గురు సూర్యుల సఖ్యత వల్ల తండ్రి ప్రభావం అధికంగాను ఉంటుంది. పైగా మంచి తేజస్వంతులమవుతాం. అన్నట్టు వీరిద్దరి వల్లా మోక్షం తథ్యం.
గురుసూర్యుల స్నేహం వల్ల మనం దార్శనికులం అవుతాం. ఒకవిధంగా లక్ష్యం జీవితం కంటే పెద్దదవుతుంది. ఆత్మవిశ్వాసం అధికం కావటం వల్ల మనకు మించిన వారు లేరనుకోవటమూ జరుగుతుంటుంది.
ఆత్మవిశ్వాసమే కాదు విశ్వాసాలు ఎక్కువగానే ఉంటుంటాయి. ఆ విశ్వాసాల కారణంగా గీత దాటి ఆలోచించటం జరగదు. అలా జారిపోయే ప్రమాదం ఉంది. జీవితంలో మన రంగంలో ఎంతలా ప్రభావవంతంగా, ప్రతిభావంతంగా వెలిగినప్పటికీ ఒక దశలో జారిపోవటం ఖాయం. ఇలా మనలోని భౌతికవాదులనే కాదు అధిభౌతికవాదులు సైతం ఈ జారుడుకు మినహాయింపు కాదు.
సూర్య గురు రాజయోగం
సూర్య గురువులు మన విషయంలో బలంగా ఉన్నారంటే మనది సూర్య గురు రాజయోగమే. అదృష్టం భౌతికంగాను, అధిభౌతికంగాను మన వెంటే ఉంటుంది. అయితే ఈ అదృష్టం జీవితం రెండో దశలోనే మనకు తోడుగా ఉండేది. జీవితంలో కొంత కాలం కష్టపడ్డ తర్వాతనే ఈ అదృష్టం కలిసొచ్చేది.
మనిషి మనుగడకి ప్రకృతి పారవశ్యానికీ ఆధారం సూర్యుడే!
మనం ప్రాణశక్తితో, ప్రకృతి జీవశక్తితో శోభిల్లాలంటే అవసరమైంది సౌరశక్తి. అందుకే శాస్ర్తియంగానైనా, ఆథ్యాత్మికంగానైనా సూర్యుడు ప్రాణికోటికి ముఖ్య భూమిక అవుతున్నాడు. భౌతిక జీవనానికి సూర్యుడు బాహ్య శక్తి అయితే అదిభౌతిక జీవనానికి అంతశ్శక్తి.
తరతరాలుగా ఆథ్యాత్మికంగాను, గికంగాన సూర్యుడ్ని సంకల్పించటం మనకు తెలిసిన విషయమే. కారణం సూర్యుడే మహాశక్తి. మహా తేజస్సు కాబట్టి, వైజ్ఞానికంగా సూర్యుడ్ని ఒక కాంతిగోళం కింద పరిగణిస్తున్నప్పటికీ గిక ప్రపంచానికి ఓ చైతన్య సింధవు. అంతర్జ్యోతికి బాహిరరూపం. అందుకే సూర్యుడ్ని ఆరాధించటం, పూజలు చేయటం, గికంగా సంకల్ప సాధనల జరుగుతున్నాయి. సూర్యుడ్ని ఖగోళనేత్రం అని అనేది కూడా ఇందుకే. అంటే సూర్యుడ్ని కేంద్రంగా చేసుకుని ఖగోళ మండలాన్ని ఆపోసన పట్టవచ్చు. ఒక్క మాటలో చెప్పుకోవాలంటే సూర్యుడ్ని ఆరాధించటం అన్నది మతాలకతీతంగా జరుగుతున్నది. కాబట్టి సూర్యారాధన ఏ ఒక్క మతక్రతువు కాదు.
జ్యోతిర్మండలాల పరంగా సూర్యుడు ఒక దివ్యశక్తి అయితే, ఖగోళ మండలాల పరంగా ఒక కాంతివాహిని అయితే, భూమండల పరిధిలో ఒక అగ్ని శక్తి. అందుకే మనం యజ్ఞయాగాలలో అగ్ని సంబంధ క్షతువులు నిర్వహిస్తాం. యోగసాధకులు సైతం సూర్యుడ్ని సంకల్పించి సూర్యశక్తిని ఆవాహన చేసుకుంటుంటారు. మాస్టర్ యోగసాధనలో ‘సన్ బోరిన్గ్స్’ ‘సన్ రెగ్యులేషన్స్’ సాధన ఈ దిశగా సాగేదే. అంతేకాదు సూర్యుడ్ని మన ఆత్మ ప్రతినిధిగా పరిగణించటమూ జరుగుతోంది. గిక పరిభాషలో ప్రతి వానవ ఆత్మా ఒక అధిభౌతిక సూర్యుడే.
యోగ, ధ్యాన సాధనలకు సూర్యుడే కేంద్రం
వేదమంత్రాలన్నీ సూర్యకిరణ శక్తులకు మంత్రస్వరాలే. వీటిల్లో గాయత్రీ మంత్రం విశిష్టమైనదిగా పరిగణిస్తున్నాం. ఈ గాయత్రి సూర్య సంబంధిత సావిత్రిదే. ఈ సావిత్రీ శక్తి సౌరఫలకమై మన బుద్ధిని, హృదయాన్ని, దేహాన్ని చైతన్యపరచి, శక్తిసంపన్నం చేస్తుంది. అందుకు యోగ, ధ్యాన సాధనాలు సూర్యుడ్ని కేంద్రంగా చేసుకుని సాగుతుండాలి.
నిజానికి యోగసాధనకు, ధ్యానమగ్నతకు సావిత్రి ఆధారపీఠం. మన కుండలినిలోని దివ్యశక్తిని మేల్కొల్పేది ఈ సావిత్రి శక్తి. అందుకే సావిత్రిని అగ్నిరూపంగాను పరిగణిస్తుంటాం. ఏ యోగసాధనకయినా లక్ష్యం దివ్యజ్ఞాన, దివ్యశక్తులను సాధించటమే. ఈ రెండింటి ద్వారా దివ్యకాంతి మన భౌతికతపై ప్రసరించి మనం దివ్యశరీరులం అవుతాం.
సూర్యుడితో సంయోగమే యోగం
యోగసాధన సూర్యుడితో సంయోగించటానికే. మానవాత్మ విశ్వాత్మగా పరిణమించటంలో సూర్యుడితో సంయోగం ప్రధాన పాత్ర వహిస్తుంది. ఇలా పరిణమించగలిగితేనే యోగ సాధకులమైన మనం పురుషతత్వంతో పూర్ణపురుషులం అవుతాం... సూర్యుడితో మానవాత్మ సంయోగించటమంటే భౌతిక పరిధిలో ఆవరించిన చీకట్లను తొలగించుకుని తేజస్సును సంతరించుకోవటమే. అంటే భ్రమలు, మాయలు తొలగి సాధకాత్మ విశ్వాత్మగా పరిణమిస్తూ పారదర్శకంగా పూర్ణపురుష తత్వంలో మగ్నం కావాలి. మనం గికంగా చెప్పుకునే హంస, పరవహంస తత్వం ఈ సౌర పురుష తత్వమే.
గికంగా సార్యుడు ప్రణవ శక్తికి ప్రతిశబ్దం. జ్ఞానయోగం మన ఆత్మను సూర్యుడికి సంకేతమంటుంది. భక్తియోగంలో సూర్యనారాయణుడిగా సూర్యుడ్ని ఆరాధించటం జరుగుతుంది. ఇక త్రిమూర్తుల శక్తి అంతా సూర్యశక్తే అనటం మనకు తెలిసిందే. సాంఖ్యయోగం సైతం సూర్యుడికి ప్రథమ తాంబూలమిచ్చింది. సూర్యుడిని మైత్రోపనిషత్తు ప్రాణం అని అంటుంది. ఇక్కడ ప్రాణం అన్నది ఆత్మ సంబంధి. పింగళ నాడి సైతం సూర్య సంబంధితమే. ఇక మనం ఉచ్ఛరించే మంత్రాలు, బీజాక్షరాలు మొదలైనవన్నీ శక్తిప్రపూర్ణాలు కావటం సూర్యశక్తిని కలిగి ఉండటమే. మనం ఉచ్ఛరించే శబ్దాలు స్వర రూపంలో ఉన్నప్పటికీ అవి కాంతి గాను, శక్తి గాను పరివర్తన చెందుతాయి. తంత్ర యోగంలో సూర్యుడు హృదయాధిష్టానుడు. మూలాధారంలోని అగ్నితత్వం సూర్యుడిదే. మొత్తానికి యోగసాధనతో మనలోని ప్రతి ఒక్కరం ఒక సూర్యుడవుతూ, అందరం సూర్యతేజస్సుతో ఖగోళ సూర్యుడికి ప్రతినిధులవుతాం... అలాగే సాధకులమైన మనం సాధనతో తేజస్సంపన్నులపై సూర్యతేజాన్ని మనలో నిలుపుకుంటాం.

-విశ్వర్షి 93939 33946