వాసిలి వాకిలి
ప్రామాణిక యోగ జీవనం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
‘ఆది’లో శుద్ధంగా ఉన్న ‘అంశ’ ప్రాణ మండలం నుండి సృష్టికి సమాయత్తమవుతుంది. ఆ పరిణామంలో తొలిగా కాంతి, కాల ప్రమేయాలతో భూమండలం వైపుగా తన ప్రయాణం ప్రారంభిస్తుంది. అంటే మానవరూపాన్ని సంతరించుకునే దిశగా ప్రాణ అంశ కాలమానానికి లోబడిన అంశగా పరిణమిస్తుంది. ఇక్కడే మానవ ఆయుష్షు అనేది నిర్ణయమైపోతోంది. ఇక్కడి నుండి ప్రాణాంశ జ్యోతిర్మండలాన్ని చేరుకుని తేజస్సును తోడు తెచ్చుకుంటోంది. అంటే ప్రాణాంశకి జీవం తోడవుతుంది. ప్రాణానికి జీవం తోడై మానవ జీవనానికి కావల్సిన థార్మికతను ఋషిమండలాల నుండి చేదుకుని ఒక ప్రామాణిక జీవనానికి కావల్సిన నేపథ్యాన్ని సిద్ధం చేసుకుంటోంది.
ప్రాణాంశ శుద్ధత్వం తగ్గుతోంది
ఇక్కడి నుండి నక్షత్ర గ్రహ మండలాల గుండా తన ప్రయాణాన్ని కొనసాగిస్తుండగా అక్కడి ఖగోళ ధూళి అప్పటిదాకా శుద్ద అంశగా ఉన్న ప్రాణ జీవ అంశను పొదువుకునేటప్పటికి ఆ నక్షత్ర గ్రహాల ప్రభావాలు శుద్ధ అంశకు జతకలిసి శుద్ధత్వ ప్రామాణికతను తగ్గిస్తున్నాయి. అలా శుద్ధత్వ ప్రామాణికతను నక్షత్రాలు, గ్రహాలు ప్రభావితం చేస్తున్నాయి. ఇలా ప్రణ, జీవ అంశ ఏ గ్రహ, నక్షత్ర ప్రభావాలకు లోనవుతోందో ఆ గ్రహ, నక్షత్ర అంశతో మానవ జన్మకు రావటం జరుగుతోంది. మనపై నక్షత్రాలు, గ్రహాలు ప్రభావం చూపడానికి నేపద్యం ఇదే.
జ్యోతిర్మండలాల్లో లేని ధూళి ఖగోళ మండలాల్లో ఉందంటేనే అక్కడ ఖగోళ కాలుష్యం ఉన్నట్టు. కాలుష్యం అంటే నియంత్రించగలది! అంటే నక్షత్ర ప్రభావాలను, గ్రహ ప్రభావాలను నియంత్రించవచ్చన్న మాట. ‘్భృక్త రహిత తారక రాజయోగ’ ప్రయోక్త మాస్టర్ సి.వి.వి.తమ యోగమార్గం ద్వారా చేసిన ప్రయోగం ఇలా నక్షత్రాలను, గ్రహాలను నియంత్రించటమే. ఆ నియంత్రణ కోసం మాస్టర్ సి.వి.వి. సృజించిన యోగప్రణాళికను మనం ‘ప్లానెటరీ రెగ్యులేషన్స్’ అంటున్నాం. మాస్టర్ యోగ ప్రణాళికలో ఖగోళ సవరణలకు సంబంధించి ప్లానెటరీ రెగ్యులేషన్స్‌తో బాటు ‘నక్షత్ర రెగ్యులేషన్స్’, ‘లగ్న రెగ్యులేషన్స్’, ‘రావి రెగ్యులేషన్స్’ కూడా ఉన్నాయి.
మాస్టర్ యోగానికి పునాది ఖగోళంలోని అవకతవకలే
మాస్టర్ యోగానికి పునాది ఖగోళంలోని అవకతవకలను సరిచేసి ఆ ఖగోళ ప్రభావాల నుండి మనిషిని తప్పించటమే. అంటే గ్రహ, నక్షత్రాదుల ప్రభావం చూపని మానవ జీవితం సాధ్యం కావాలన్నది మాస్టర్ సి.వి.వి. ప్రయత్నం. ప్రయోగం. ఎప్పుడైతే గ్రహ, నక్షత్ర ప్రభావాలు మానవ జన్మపై ఆధిపత్యం చూపవో అప్పుడు మానవ మనుగడ నూతన రూపాన్ని సంతరించుకుంటుంది. మాస్టర్గారన్నట్లు ‘చీఫ్ లైఫ్’ ‘మెర్రి లైఫ్’ సాధ్యమై ‘‘న్యూ మాన్’’ ఆవిష్కరణ జరుగుతుంది.
మాస్టర్ సి.వి.వి. సిద్ధం చేసి సాధకుల యోగ సాధనకు అందుబాటులోకి తెచ్చిన ‘ప్లానెటరీ రెగ్యులేషన్స్’లో సౌర కుటుంబంలోని అన్ని గ్రహాలకు చెందిన రెగ్యులేషన్స్ ఉన్నాయి. సన్ రెగ్యులేషన్స్, శాటర్న్ రెగ్యులేషన్స్, బుధ రెగ్యులేషన్స్, గురు రెగ్యులేషన్స్, శుక్ర రెగ్యులేషన్స్, మార్స్ రెగ్యులేషన్స్. ఇలా.
ఈ రెగ్యులేషన్స్‌ను ఒక క్రమపద్ధతిలో సాధన చేయటం వల్ల మొదటగా ఆ గ్రహ ప్రభావం సాధకులమైన మన జీవితాలపై పడదు. అంటే ఒక గ్రహం చూపే ప్రభావాలు మంచివి కావొచ్చు, చెడువి కావొచ్చు. సాధకులమైన మన జీవితాలపై ప్రభావం చూపవు. ఇలా మాస్టర్ యోగ సాధనతో మనం గ్రహప్రభావ అతీత స్థాయికి చేరుకుంటాం.
మానవ దేహం అశుద్ధమే
మనం ఆది నుండి ఒక అంశగా కాలంతో, కాంతితో సంగమించి ఖగోళ మండలాల సంపర్కంతో ఆయా నక్షత్ర, గ్రహ తత్వాలను వెంటేసుకుని భూకక్ష్యలోకి ప్రవేశించి ఒక పురుషుడి నుండి సృష్టి తత్వంగా పరిణమించి స్ర్తి గర్భాశయంలో ఒక మానవ రూపాన్ని సంతరించుకుని ‘జననం’తో పాంచభౌతిక తత్వంతో చరించటం ప్రారంభిస్తున్నాం. ఈ ప్రాపంచిక తత్వానికంటే ముందే మన అంశపై ఖగోళ ప్రభావాలున్నాయి. కాబట్టి ఆ గ్రహ, నక్షత్ర ధూళి ఇక్కడి పాంచభౌతిక ధూళి మిళితమై మన మానవ మనుగడను అశుద్ధం చేస్తున్నాయి.
ఈ అశుద్ధత నుండి బయటపడాలంటే ‘ఆది’ నుండి అంశగా విడివడ్డ మన అంశకు ఒక్కో మండలంలో తోడవుతూ, చేరుతూ వచ్చిన ప్రభావాలను యోగసాధనతో వదిలించుకుంటే తప్ప మనం తిరిగి స్వస్థానానికి చేరుకోలేము. యోగసాధన సాధ్యం కానప్పుడు మృత్యువుతో దేహాన్ని వీడిన అంశ లేదా ఆత్మ ఇటు రూపం తీసుకున్న భౌతికానికి కాకుండా పోతుంది... పరిణామం ప్రారంభించిన పరానికి కాకుండా పోతుంది. కాబట్టి ఒక స్థితి నుండి విడివడి సృష్టికి వచ్చిన ఆత్మ మళ్లీ ఆదికి మరలాలంటే కలుపుకుంటూ వచ్చిన వాటిని విడుచుకుంటూ పోవలసిందే. అంటే శుద్దాంశగానే ‘ఆది’ని చేరగలదు.
ఖగోళ ధూళికి దూరం కాగలగాలి
దేహాన్ని మృత్యువు చేరుకోవటమంటే మానవరూపంలో మన దేహాన్ని గ్రహ, నక్షత్ర ప్రభావాలకు దూరం చేయాలి. వాటి ధూళిని ఈ దేహ రూపం నుండి దూరం చేయాలి. ఆ తర్వాత పాంచభౌతిక తత్వాల నుండి దూరం చేయాలి. ఇలా యోగసాధనతో ధూళిదూసరిత దేహం శుద్ధం కావాలి. ఆ తర్వాతనే ప్రాణం దేహం నుండి తప్పుకుంటుంది... ఆ తరువాత తేజస్సంపన్నమైన జీవం శరీరాన్ని వీడుతుంది. అప్పుడు దరిచేరిన మృత్యువు మనలోని అంశాన్ని శుద్ధంగా పరిగణించి దేహం నుండి మన ఆత్మను విడుదల చేస్తుంది. ఈ ప్రామాణిక పరిణామం యోగసాధన ద్వారానే సాధ్యం.
ఈ మానవాత్మ ప్రామాణిక పరిణామానికి మాస్టర్ యోగం సిద్ధంగా అందిస్తున్న ప్రణాళికనే ‘ప్లానెటరీ రెగ్యులేషన్స్’, ‘నక్షత్ర రెగ్యులేషన్స్,’, ‘లగ్న రెగ్యులేషన్స్’, ‘రాశి రెగ్యులేషన్స్’.
ప్రస్తుతం మనం ప్లానెటరీ రెగ్యులేషన్స్‌లోని ‘‘శని రెగ్యులేషన్స్’’పై దృష్టి పెడదాం.
‘శిక్షణ’, ‘రక్షణ’లు శనితత్వాలు
శనిని అర్థం చేసుకోవడం ప్రయత్నిస్తే శనిలో రెండు తత్వాలు కనిపిస్తాయి. ‘శిక్షణ’ ‘రక్షణ’ అనేవి ఆ రెండు తత్వాలు. శిక్షణలో శిక్ష, శిక్షణ అనేవి ఉన్నాయి. శిక్ష అంటే తప్పు చేస్తే దండించటం. శిక్షణ అంటే తప్పు దొరలినప్పుడు సరిచేయటం. శిక్ష, శిక్షణలను అర్థం చేసుకుని మనల్ని మనం ఉద్దరించుకోగలిగితే శని రక్షణ మనకు లభిస్తుంది. దుష్ట శిక్షణ - శిష్ట రక్షణ అంటారే అంటే దుష్టత్వాన్ని తరిమేయటం శిష్టత్వానికి అగ్రతాంబూలమివ్వటం అని మనం శని తత్వాన్ని నిర్వచించుకోవచ్చు. అందుకే శని అంటే నా ఉద్దేశంలో మార్గదర్శి శిక్షణ, రక్షణల విషయంలో శని ముందుండటం వల్ల మార్గదర్శి కిందే లెక్క. మన మనుగడలో శని ముందుండి చూపే వెలుగు మనకెంతో ఉపయుక్తం.
శని బాధకుడు, బోధకుడు
శని బాధకుడు, బోధకుడు. సామాన్యంగా బాధ కలిగినప్పుడే బోధ చెవికెక్కుతుంది. దెబ్బ తగిలినప్పుడే మరో దెబ్బ తగలకుండా జాగ్రత్త పడతాం. నేర్చుకోవటానికి కావల్సిన పట్టు దొరికేది కష్టమో, బాధో ఎదురైనప్పుడే. దెబ్బలు, బాధలు ఎందుకంటే మన మనసు పరిమితంగా ఆలోచించటం వల్ల. దీనే్న ఆలోచన కురచనవటం అంటాం. అంటే గిరి గీసుకుని కూర్చుంటే మన ప్రపంచం చాలా చిన్నదే అవుతుంది. మన గీతను మనమే చెరిపేసుకోవాలి లేదా దాని వ్యాప్తిని పెంచుకోవాలి. అప్పుడు మన ప్రపంచం పెద్దది అవుతుంది. మన జీవితమూ పెరుగుతుంది.
గీసుకున్న గీతల పరిధి పెంచుకోవాలి
అవసరాల పరిధి పెంచుకుంటే సరిపోదు... అవకాశాల పరిధిని పెంచుకోగలిగితేనే మనకు ఎదుగుదల. ఇలా పెంచుకోకుండా, శిక్షణను తలకెక్కించుకోకుండా మన జీవనయానంలో కష్టనష్టాలకు శనిని బాధ్యుడ్ని చేసి, శనిపై నెపం వేస్తే ఎలా?! అన్నట్టు, మనం గీతల్ని చెరిపేసుకోవటం అంటే బాహ్య ప్రపంచ గీతలనే కాదు... మనం ఆంతరంగికంగాను కొన్ని గీతల్ని గీసుకుని ఆ గీతల మధ్యలోనే తిష్ట వేసుకుని కూర్చుంటాం....మన సింహాసనంపైన మనమే కూర్చుంటాం. మనం వేసుకున్నది కాబట్టి అది కాలు విరిగిన కుర్చీ అయినా మనకు సింహాసనమే అనిపిస్తుంటుంది. చూచేవారికి ఆ కుర్చీ ఏ క్షణాన్నయినా విరుగుతుందని తెలుసు. అందులో కూర్చుంటే మనం పడతామని, దెబ్బలు తగలటం ఖాయమనీ తెలుసు. తెలుసుకోలేని మనస్తత్వంతో మనం విచక్షణను కోల్పోయి ఉంటే శనేశ్వరుడు ఏం చేస్తాడు? అందుకే శని పరోక్షంగా బాధిస్తాడు. శిక్షిస్తాడు, బోధిస్తాడు, శిక్షణనిస్తాడు... చివరికి రక్షిస్తాడు.
మన కర్మలకు మనమే కర్తలం
శనిని మనం కర్మసాక్షిగా కూడా పరిగణించాలి. అంటే శని మన కర్మలకు అంటే మనం చేసే పనులకు మనల్ని కర్తల్ని చేస్తూ, మనలనే సాక్షుల్ని చేస్తూ, తాను సాక్షి సంతకం చేస్తుంటాడు. అంటే మనవి దుష్కర్మలయినా, సత్కర్మలయినా వాటి కర్తలం మనమే కాబట్టి వాటి ఫలితాలను అనుభవించాల్సిందీ మనమే. అయితే అనుభవించటానికి మనల్ని సిద్ధం చేసేదీ శనే. కర్మ ఫలితాల నుండి విముక్తం చేసేదీ శనే. నిజానికి శని ఈ జన్మలోనే మన కర్మ ఫలితాలను అనుభవింపజేసే మనల్ని జన్మరహితుల్ని చేస్తాడు. ఇలా శని మన మానవ మనుగడ. జన్మరాహిత్య విషయాలలో మనకు మిత్రుడు, మార్గదర్శి, హితవరి అవుతున్నాడు.
మనం మన్ను తిన్న పాములా కాక ఇన్ని విధాల ఆత్మస్పృహతో మనుగడలో ముందంజ వేస్తూ ఉల్లాసంగా, ఉత్సాహంగా చైతన్య జీవనం సాగించాలంటే మాస్టర్ యోగ ప్రణాళికలోని ‘శాటర్న్ రెగ్యులేషన్స్’ సాధన ఎంతో ముఖ్యం. ఈ సాధనతో మనలో స్వీయపరివర్తన సాధ్యమవుతుంది. ఇలా సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్కు అవకాశమిచ్చేదే ‘శాటర్న్ రెగ్యులేషన్స్’.
సామాన్యులు డబ్బు కూడబెడితే చాలు జీవితం ఆనందంగా గడిచిపోతుంది అనుకుంటుంటారు. నిజానికి ఈ ఆలోచనకు శని అనుకూలుడు కాదు. సంపదలు జీవితాన్ని నిర్వచంచవు. సుఖశాంతులొక్కటే జీవిత భాష్యానికి అందేవి అన్నది శని సిద్ధాంతం. ఆనందాన్ని కోరుకోవటం సామాన్యులు చేసే పని. శాంత జీవనాన్ని కోరుకోవటం యోగసాధకులు చేసే పని. ఈ రెండింటి వైపు మనల్ని పరుగులు తీయించేది మన మనస్సే. ఆ మనస్సుపై మన ఆధిపత్యం సాగాలి... అంతేకానీ మనపై మనసు పెత్తనం చెలాయించటం కాదు. పరుగులు పెట్టే కోరికలకు కళ్లెం వేసే వారొకరుండాలి. ఆ బాధ్యత తీసుకున్న వాడు శని. ప్రాపంచిక వ్యామోహాలకు గంతలు కట్టి మార్గం తప్పకుండా జీవనయానాన్ని కొనసాగించే వాడు శని.
ఆత్మయాన మార్గదర్శి
మనల్ని ఆత్మయానానికి సిద్ధం చేసేది శని. మన వ్యక్తిత్వాన్ని వ్యక్తిమత్వం వైపు మరల్చేది శనినే. జీవితానికి ఒక అర్థాన్ని, అర్థవంత లక్ష్యాన్ని చూపేది శనినే. అసలు మానవాత్మ భౌతికంలోనే అధిభౌతికం కావటం అవసరం. అదే మాస్టార్ యోగసాధనా లక్ష్యం. అందుకే మాస్టర్ యోగంలో శని పాత్ర, భాగస్వామ్యం ఎంతో ఉంది. అసలు భూమండలాన్ని సరిచేసే యత్నం శనితోనే ప్రారంభమైంది. ఈ యత్నంతో ఖగోళ శక్తులు భూమిని తాకాయి. అంటే మానవ జీవితంలోకి ఖగోళ శక్తులు దిగివచ్చి మానవుడ్ని నవమానవుడిగా మలిచాయి. మాస్టర్ యోగంతో మన లోకంలో నవశకం ప్రారంభమైంది. ఈ యత్నంతో ఖగోళ శక్తులు భూమిని తాకాయి. అంటే మానవ జీవితంలోకి ఖగోళ శక్తులు దిగివచ్చి మానవుడ్ని నవమానవుడిగా మలిచాయి. మాస్టర్ యోగంతో మన లోకంలో నవశకం ప్రారంభమైంది. ఇలా మాస్టర్ యోగం ‘‘న్యూ యోగ ఫర్ న్యూ ఏజ్’’ అయింది. భూగోళంపై, భూగోళవాసులపై శని ప్రాభవంతో ‘‘న్యూ ప్రిన్సిపుల్’’ ఆదర్శ ఆచరణ పథమయింది.