S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

చెలి జ్ఞాపకం

నా మదిలో పదిలపరచిన నీ జ్ఞాపకాలన్నీ,
పరులకు పంచక ఒక మూటగా కట్టి,
నిను వెతుకుతూ బయలుదేరిన నాకు..
ఎదురొచ్చిన ఓ నెచ్చెలి

నా ప్రేమ నీకు తెలియాలంటే..
నీ రాకకై నే వెచ్చించిన ఘడియల నడుగు...
నా గుండె రెట్టించిన సడియల నడుగు..
నీ కోసం నే నడిచిన అడుగుల నడుగు..
నా కన్నీటి వర్షంలో తడిచిన గొడుగుల నడుగు..
అవి చెప్తాయ్.
నా మది తోటలో పూసిన
‘పొగడ్తల పూల’ను నీపై
కురిపించాలనుకున్నా.. ఓ చెలీ
నీ కనులను ‘కలువపూల’ గనులతో పోల్చనా..
నీ కురులలో ‘మరు మల్లెల’ విరులను పేర్చనా..
నీ అధరం ‘గులాబీ పూల’ అరుణం అని తెలుపనా..
నీ బుగ్గలు ‘ముద్ద మందార’ మొగ్గలు అని పొగడనా..
సప్తవర్ణాల హరివిల్లులో నుండి
ఓ వర్ణం జారిపడి
నీ రూపుదాల్చింది..
రెక్కలు తొడిగిన నా మనస్సు
విహంగమై నీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంది..
నువ్వు గుర్తొచ్చిన క్షణం..
నా నయన మీనాలు కన్నీటి నదిలో ఈదులాడుతుంటాయి..
నా ‘నయనాల’లో నుండి
మరో ‘నయగరా’ కన్నీటి జలపాతమై నేల రాలుతుంది.

-జాబేర్ పాషా, మస్కట్ (ఒమన్) 0096897663604