S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రుతు సంబంధమైన పర్వం ‘హోళి’

పండగల ప్రాదుర్భావానికి మూడు ముఖ్య కారణాలుగా కనిపిస్తాయి. ఒకటి మహాపురుషుల జన్మదినాలు. రెండవది గొప్ప సంఘటనలకు స్మృతి చిహ్నాలుగా జరుపుకునేవి. మూడవది రుతువులను బట్టి నిర్వర్తించుకునేవి. హోళి రుతుసంబంధ పర్వం. ప్రత్యేకించి వసంత రుతువుకు సంబంధించిన పండగ. మాఘమాసపు కృష్ణపక్ష పంచమి, అంటే వసంత పంచమి దినాలకే, వసంతరుతువు లక్షణాలు పొడసూపుతాయి. కాగా ఫాల్గుణ పూర్ణిమ నాటికి అవి మరింత ప్రస్ఫుటమవుతాయి. రాగి రంగుతో చిగుళ్ళు, ఆకుపచ్చ రంగుతో పత్రాలు పలు రంగులతో పూలు దర్శనమిచ్చే సమయం. తొలకరి పంటలన్నీ ఇంటికి చేరి, పునాస పంటలన్నీ పంట ముఖాల పసిమితో ఉండే కాలమిది. ఇలా వర్ణోన్మీలనం ఈనాటి రంగులీలకు ప్రాతిపదికగా మారింది. హోళి పండగను హిందూదేశంలో వివిధ ప్రాంతాలలో, వివిధ రకాలుగా జరుపుకోవడం కద్దు. బృందావనంలో శ్రీకృష్ణుడు గొల్లపడుచులతో వినోదించిన పూజకు, ఈ పండగకు కొన్ని చోట్ల సంబంధం ఉంది. బాలకృష్ణుని ఊయలలో పరుండచేసి, బుక్కా, గులాల్, ఎర్రపొడి చల్లి పూవులు వేసి, పూజ చేస్తారు. దీనిని డోల జాతరగా పిలుస్తారు. ‘డోల’ అంటే ‘ఊయల’. ఫాల్గుణ పూర్ణిమ వసంత సంబంధం. కొందరు ఔత్తరాహికులకు ఫాల్గుణ పౌర్ణమి కడచిన మరుసటి దినం సంవత్సరాది. దక్షిణాపథ వాసులైన కర్నాటక, మహారాష్ట్ర, తెలుగు జాతీయులకు మరోపక్షంలో చైత్ర మాసాది ఉగాది. సూర్యుడు మేషరాశిలో ప్రవేశించే దినం తమిళుల వత్సరాది. ఇవన్నీ వసంతరుతు ప్రారంభంలోనే కావడం గమనార్హం. ఫాల్గుణ పౌర్ణమి దినమంతా ఉత్సవ దినమే. రంగులు కలిపిన నీళ్ళు ఒకరిపై ఒకరు చల్లుకుంటారు. ఇలా నీళ్ళు చల్లుకునే క్రీడనే వసంతోత్సవం అంటారు. పూర్వకాలంలో మోదుగు పువ్వులు తెచ్చి రోట్లో పోసి దంచి, నీళ్ళతో కలిపి చల్లుకునే వారని జానపద పాటల ద్వారా గ్రహింప వీలగుతున్నది. మోదుగు పువ్వును దంచి శీతల కషాయం చేసి, చల్లుకోవడం వైద్యప్రక్రియలో భాగమై, ఆరోగ్య వర్దకమవుతుంది. మోదుగను సంస్కృతంలో ‘పలాశ’ అంటారు. బ్రహ్మచర్య వ్రత దీక్షితుడైన ఉపవీతుడైన వటునకు దండధారణ, పలాశ వృక్ష ఛాయలో ఉపనయన కార్యకలాపం, పలాశ పత్రాలతో కుట్టిన విస్తట్లో భోజనం ఆచరణగా ఉంది. వసంతకాలంలో ఎటువంటి వారికైనా కామోద్దీపనం కలగడం సహజం. కామాన్ని అదుపులో ఉంచుకొనుటకు మోదుగ అమోఘ సాధనం. ఉద్రేకాన్ని అణిచే ఉచిత వైద్య ప్రకియ ఇది. ఏప్రిల్ 1వ తేదీ క్రైస్తవుల ‘‘ఆల్‌ఫూల్స్ డే’’కు భారత దేశ హోలీ వేడుకలకు పోలికలున్నాయి. ఇది వసంతోత్సవం, గ్రామీణ క్రీడలు, ప్రేమ కలాపాలకు సంబంధించింది. యూరోపియన్ల అల్లరి చిల్లరి చేష్టలకు, హిందువుల బుక్కా, గులాల్, రంగునీళ్ళు చల్లుకోవడం, చిమ్ముకోవడం, వేళాకోళాలు చేసుకోవడాలకు దగ్గరి పోలికలు ఉన్నాయి. వేళాకోళాలు, ఆనందంలో మునిగి తేలడాలు అతిశయంగా ప్రదర్శితం అవుతూ, యువత ఇంటింటికీ తిరిగి పండగ ఖర్చులకు మామూళ్ళు దండుకునే కార్యక్రమం ఎక్కడా చూసినా దర్శనమిస్తున్నది.

- సంగనభట్ల రామకిష్టయ్య