AADIVAVRAM - Others
నిరంతరం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ప్రతీ వ్యక్తి తన జీవితంలో ఏదో సాధించాలని అనుకుంటాడు.
ఆ విధంగా అనుకోవాలి కూడా.
అవి చాలా పెద్దవి కావొచ్చు.
ఎదుటివాళ్ల దృష్టిలో అసాధ్యమైనవి కూడా కావొచ్చు.
ప్రతీదానికి సమయం ఉంటుంది.
గద్ద విషయం తీసుకుందాం.. గూడు నుంచి బయటకు పిల్లగద్ద తల్లి మాదిరిగా చిన్న పంది పిల్లను ఎత్తుకొని వెళ్లగలదా?
కష్టం.. సాధ్యం కాదు..
ముందుగా కొంత కాలం ఎలుకలను వేటాడుతుంది. దాని లక్ష్యం పంది పిల్లని వేటాడటం అయి ఉండవచ్చు. కానీ వెంటనే అది సాధ్యం కాకపోవచ్చు.
ఆ తరువాత కాస్త పెద్ద జంతువు.
ఆ తరువాత కుందేలు.
ఆ తరువాత దాని లక్ష్యమైన పంది పిల్ల.
పెద్ద లక్ష్యాలు ఉండాలి.
దాన్ని సాధించాలంటే చిన్న చిన్న లక్ష్యాలను ముందుగా ఏర్పర్చుకొని తమ ప్రయాణాన్ని కొనసాగించాలి.
ఓపిక ఉండాలి.
నిరంతర సాధన ఉండాలి.
ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
సామర్థ్యమూ వస్తుంది. లక్ష్యమూ నెరవేరుతుంది.